నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: వొత్తిడి → ఒత్తిడి (2) using AWB
పంక్తి 28:
==అల్లం రాజయ్య రాసిన ముందుమాట==
డాక్టర్‌ గోపీనాథ్‌ తన పుస్తకానికి ముందుమాట రాయమనగా నేను ఆశ్చర్య పోయాను. అంత అనుభవం, లోతైన బహుముఖ అధ్యయనం నాకు లేదు. వేల సంవత్సరాలుగా ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేస్తున్న, సర్వసంపదల సృష్టికర్తలైన ప్రజారాశుల్లో... ఆ సంపదను చేజిక్కించుకుని వారి మీద అధికారం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలక పక్షాల లోతుపాతులు ` కార్యకర్తగా, నాయకుడిగా ఆయన మమేకత్వం ` విశ్లేషణ నాలాంటివాడికి అందనిది.
అంటరాని కులంలో పుట్టి, కులాల ముళ్ల కంచెలు దాటి, లేమిని ఎదిరించి, మారుమూల పల్లె ఎల్లలు దాటి ` ఏకలవ్యుడిలా అనేక విద్యలు అభ్యసించినవారు ఆయన. అడుగడుగునా, దారి పొడుగునా రాజీలేని పోరాటంలో ` ఒంటరిగా అనుభవించిన వొత్తిడిఒత్తిడి అనుభవిస్తున్న తీవ్రత మాటలకందనిది.
గజిబిజిగా అస్తుబిస్తుగా, వెనుకా ముందులుగా ` కాలువలుగా, వాగుల్లాగా ప్రవహించిన వాక్యాల లోతుల్లో తడి ` నా కళ్లల్లోకి ప్రవహించి.......
ఈ పుస్తకం చదవడానికి చాలా రోజులు పట్టింది. ఇది రొమాంటిక్‌ ఫిక్షన్‌ కాదు. కథ కాదు ` కవిత్వం కాదు ` భయంకరమైన కఠోరవాస్తవం. రాసిన వాక్యాల వెంట, రాయని మరెన్నో తెలిసిన ఘటనలు చుట్టుముట్టేవి. గోపి పల్లె బతుకు. మోకాలుమంటి దిగబడే దారులు, అడపాదడపా స్కూలుకు వచ్చే పంతుళ్ళు, ఊరి కొట్లాటలు, పసి మనుసుల్లో ఎగిసిన, కలతపెట్టిన ఘటనలు.... పశువులు, పంటలు, ఎండా, వానా, చలి, చేపలు, కన్నీళ్లు, కష్టాలు ప్రతిదీ ` గుండె గొంతుకలోన గుబగుబలాడినయ్‌.
పంక్తి 40:
మొదట కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, బంజరు, షికం తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణ, పంచాయతి పద్ధతులను అగ్ర కులాల నుండి కింది కులాలకు మార్పు ` అంటరాని తనానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలు తీసుకున్నారు.
గ్రామాల్లో రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయడానికి రాడికల్‌ విద్యార్థులు కృషి చేశారు. ఆటపాట నేర్చుకున్నారు. నిజమైన ప్రజాకళాకారులై వందల సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామాల్లో, చిన్నచిన్న పట్నాల్లో ` బీదలపాట్లు, భూమి బాగోతంలాంటి వీధి నాటకాలను జననాట్యమండలితో కలిసి ప్రదర్శించారు. లోకల్‌ విషయం, స్థానిక భాషలో నిజమైన మనుషుల ఆహార్యంతో ప్రజల్లో కొత్త ఆలోచనలకు, ఐక్యతకు ఆచరణకు ఇవి కారణమయ్యాయి. విద్యార్థుల ఇలాంటి సాహసోపేత ఆచరణకు సంబంధించి ఇంతవరకు ఎక్కడా వివరంగా రికార్డు కాలేదు.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పోరాటాలకు తెరదీసిన ఒక గొప్ప మలుపుకు కారణమైన విద్యార్థులకు గోపి నాయకుడు. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతుకూలి సంఘాల నిర్మాణం జరిగి, కృార భూస్వాములతో తలపడ్డాయి. గ్రామంలోని అమానవీయ పద్ధతులైన, వెట్టి, కులవివక్షత, అంటరానితనం, అక్రమ గ్రామపంచాయతి పద్ధతి, కూలి రేట్ల పెంపకం, బంజరు, షికం భూముల ఆక్రమణదాకా అనేక విషయాల్లో పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. ఈ ఘర్షణలు ముదిరి నిర్బంధం, పోలీసుల రంగ ప్రవేశం, అరెస్టులు, కోర్టు కేసులతో పల్లెలు అట్టుడికాయి... దొరలను ప్రజలు సాంఘికంగా బహిష్కరించారు. దొరలు గడీలు వొదిలి పట్నాలకు పారిపోయారు. దొరలు అనేకరకాలుగా ఆక్రమించిన భూములను ప్రజలు దున్నుకున్నారు. జగిత్యాల జైత్రయాత్రతో ప్రారంభమైన ఈ పోరాటాలు దావానలంలా అన్ని జిల్లాలకు వ్యాపించాయి. ఫలితంగా కల్లోలిత ప్రాంతాల చట్టం వచ్చింది. విద్యార్థులు అనేకమంది అజ్ఞాత జీవితంలోకి వెళ్లి పూర్తి కాలపు విప్లవకారులుగా మారడం, పోరాటాలు పల్లెల నుండి సింగరేణి గనుల్లోకి, సాయుధ దళాల నిర్మాణంతో అడివిలోని ఆదివాసుల్లోకి విస్తరించాయి. ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదు. కోస్తా, రాయలసీమ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు విస్తరించి వేలాది విద్యార్థులు పాల్గొన్న ఒక గొప్ప ఉద్యమంలోని అనేక ఆటుపోట్లు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లు, ఈ సరికొత్త ఆరాట పోరాటాల మదింపు, కొనసాగింపు చేసి ముందుకు నడిపించిన నాయకత్వంలో గోపిది ప్రధాన భూమిక. గోపీ తన పుస్తకంలో తను ఎంచుకున్న మార్గంలో రాశారు. కాని ` కీలకమైన ఘట్టాలను, మలుపులను, విభిన్న ధోరణులు ` వాటిని సమన్వయపరిచిన తీరు ` ముఖ్యంగా ఆ వొత్తిడినిఒత్తిడిని, వేడిని, స్పర్శను అనుభవించాడు గనుక అలాంటి అపురూపమైన విషయాలు గోపియే రికార్డు చేయవల్సి ఉన్నది. ఉద్యమాలు అభివృద్ధి చెందే క్రమంలో జరిగిన టూలైన్‌ స్ట్రగుల్‌ గురించి, గ్రామీణ సంబంధాలలో కులం పాత్ర గురించి ` అంతవరదాకా రాజ్యమేలిన రొమాంటిక్‌ భావవాద అంచనాల నుండి, వాగాడంబరం నుండి, ఉద్యమాలను భూమార్గం పట్టించిన అతి కొద్ది మందిలో గోపి ఒకరు. 1982లో మద్రాసులో ‘నేషనాలిటీ క్వశ్చన్‌ ఇన్‌ ఇండియా’ మీద అఖిల భారత విద్యార్థి సెమినార్‌ ఏర్పాటు మొదలు విద్యార్థి ఉద్యమం అఖిల భారత స్థాయిలో ఏర్పాటుదాకా రాజ్‌కుమార్‌, గోపిలాంటివాళ్లు పూనుకుని చేసినవి. గోపి 1978 నుండి 1982 దాకా అనేక మహత్తర పోరాటాలు చేసిన రాడికల్‌ విద్యార్థి సంఘానికి నాయకుడుగా ఉన్నాడఆ ఉప్పెన ప్రవాహంలోంచి గోపి డాక్టర్‌గా తను ప్రజలతో మమేకం కావాలనుకుని బయటపడి అనేక అడ్డంకులు ఎదుర్కొని ఒంటరి పోరాటంతో దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న దళిత కార్డియాలజిస్టుగా ఎదిగారు.... అయినా మళ్లీ అనేక పోరాటాలు ` కులాలతో, వర్గాలతో ` కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్న అంతరాల సమాజంలో అదే అశాంతి. అదే కత్తి అంచు మీద ప్రయాణం....రాజ్యాంగం ప్రవచించిన హక్కులను, ఎన్నికల రాజకీయాలను, భారత దేశంలోని కింది కులాలవాళ్లు చైతన్యవంతంగా ఉపయోగించుకుంటే దళితులు రాజ్యాధికారం చేపట్టగలరనే ఆలోచనలతో దివంగత కాన్షీరాం బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)తో కలిసి గోపి ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీల నాయకునిగా పనిచేశారు.పాలకవర్గాలల్లోని అంతర్గత వైరుధ్యాల మూలంగా అప్పుడప్పుడు అలాంటి అద్భుతాలు దళిత కులాలకు రాజ్యాధికారం రాజ్యాంగం మేరకైనా జరుగుతాయామోకానీ అవి తాత్కాలికమే. సర్వసంపదలు చేజిక్కించుకున్న దోపిడీ అగ్రవర్గాలు అధికారం పేద ప్రజలకు అంత సుళువుగా ఇవ్వరని గోపికి తెలియంది కాదు. అయినా అధికార రాజకీయాలను అధ్యయనం చేశాడు. బిఎస్పీ ఉత్తర్‌ప్రదేశ్‌కే పరిమితమవడం మూలంగా ` అప్పుడప్పుడే సాంప్రదాయక కాంగ్రెస్‌ రాజకీయాల స్థానే రంగంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితిలాంటి పార్టీలలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అన్ని పార్టీలలో నాయకత్వ స్థానంలో ఉండి ఆయా పార్టీలలో కొనసాగే ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు కుతంత్రాలు, డబ్బు, ద్వంద్వ ప్రమాణాలతో ఇమడలేక ` సరిపడక ` జ్యోతిరావుఫూలే, అంబేడ్కర్‌ అధ్యయన వేదిక, హాస్పిటల్‌ నిర్వహణలో ` తను నమ్మిన విలువల కోసం ఎంచుకున్న మార్గంలో సాగిపోతున్నారతన తరం మనుషులందరిలాగే ` ఒకసారి ప్రజల పక్షం అనే ముళ్లదారిలోకి ప్రవేశించినవారు ` సామాజిక శాస్త్రాలైన మార్క్సిజాన్ని, అంబేడ్కర్‌ను, ఫూలేను తెలుసుకున్నవారు ` ఎక్కడున్నా మండుతూనే ఉంటారు. అసమ విషమ తలకిందుల ప్రపంచంతో నిరంతరం తలపడుతూనే ఉంటారు. తనకు తన చుట్టూ ఉన్న ప్రపంచంతో అంతర్‌ బహిర్‌ యుద్ధమే ఈ పుస్తకం.
అయితే ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి ` నిరంతరం అవమానపరిచే ` గాయపరిచే ` హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా ` మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో ` ఇలాంటి పుస్తకం రాయడం ` ప్రచురించడం ఒక సాహసమే ` ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ` ప్రపంచ ప్రజలందరు
తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి ` ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......
పంక్తి 52:
భారతదేశంలో ఆడ మగ, ముసలి ముతక, పిల్లా పీచు, అన్ని కులాలు దళారులుగా లొంగిపోవడానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ` వేలసంస్థలు ` నెట్‌వర్కులు ` టీవీలు ` ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అట్లా లొంగిపోకుండా, దళారులుగా రూపాంతరం చెందకుండా మిగిలిన వారిపై దాడి కోసం భారత దేశం మనం చెల్లించే పన్నులతో ప్రపంచంలోని ఆయుధాలన్నీ కొనుగోలు చేసి అమెరికావారి పర్యవేక్షణలో పెద్ద యుద్ధ రంగం సిద్ధం చేస్తోంది.
అదిగో అలాంటి సన్నివేశంలో, సందర్భంలో పోరాడే ప్రజల పక్షాన నిలబడి ` లోపలి, బయటి వైరుధ్యాలను మనతో పంచుకుంటున్నాడు..... అలాంటి జ్వరతీవ్రతగల గోపిని ఆలింగనం చేసుకుంటూ......
 
 
==మూలాలు==
Line 66 ⟶ 65:
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ ` 500 006.
ఫోన్‌ : 23521849
 
== సూర్య లో నా మంచం నాఇష్టం! http://www.suryaa.com/sahithyam/article-1-153734==
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
 
== సూర్య లో నా మంచం నాఇష్టం! http://www.suryaa.com/sahithyam/article-1-153734==