శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (2) using AWB
పంక్తి 1:
'''శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం''' కలియుగ వైకుంఠపతి [[వెంకటేశ్వర స్వామి| వేంకటేశ్వరుని]] [[సుప్రభాత సేవ]]లో కీర్తించే [[స్తోత్రము]]. "సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" (Good Morning) అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి [[శ్రీవైష్ణవం]] ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు ([[షోడశోపచారములు]]) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు. తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. [[బంగారు వాకిలి]]లో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. 1430 సంవత్సరంలో శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠవంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా (అంటే 580 సంవత్సరాలుగా) ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
 
 
సంస్కృతంలో ఉన్న ఈ ప్రార్ధనప్రార్థన తెలుగునాట, మరియు ఇతర హిందువులలోను అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రార్ధనాప్రార్థనా గీతాలలో ఒకటి. అనేక వెంకటేశ్వరస్వామి మందిరాలలోను, ఇండ్లలోను ఈ సుప్రభాతాన్ని చదివే, వినే ఆచారం ఉంది. చాలా శైవ, వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నాగాని "సుప్రభాతం" అనగానే వెంకటేశ్వర సుప్రభాతం స్ఫురణకు రావడం కద్దు.
 
==సుప్రభాత సేవ==
పంక్తి 32:
</poem>
 
"కౌసల్యాదేవి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. నిదుర లెమ్ము." - [[రామాయణం]] [[బాలకాండ]]లో ఈ శ్లోకం యాగరక్షణా నిమిత్తమై తనవెంట వచ్చిన రామలక్ష్మణులకు [[విశ్వామిత్రుడు]] విద్యాబోధ చేసే సందర్భంలో చెప్పినది. మరికొన్ని ఇతర వైష్ణవ సుప్రభాతాలు కూడా ఈ శ్లోకంతోనే ఆరంభమవుతాయి.
 
; ఉదాహరణగా మరి కొన్ని శ్లోకాలు
పంక్తి 38:
 
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు
 
మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌
 
శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో
శ్రీ దేవతాగృహభుజాతంర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌
 
లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో
పంక్తి 57:
 
; సుప్రభాత శ్లోకాల సారాంశం
కౌసల్యా కుమారా! పురుషోత్తమా! రామా! తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన కర్తవ్యములు ఆచరింపవలసి ఉన్నది. ఓ గోవిందా! గరుడ ధ్వజా! [[లక్ష్మి|లక్ష్మీ]]వల్లభా ! లెమ్ము. ముల్లోకములకును శుభములు కలిగింపుము. జగన్మాతా! విష్ణు వక్షస్థలముననుండుదానా! కమలాయతాక్షీ! ఆశ్రితుల కోరికలను నెరవేర్చు తల్లీ! వేంకటరమణుని రాణీ! [[సరస్వతి]], [[పార్వతి]], [[శచీదేవి]] నిన్ను పూజించుచుందురు. దయానిధీ! నీకు సుప్రభాతమగు గాక.
 
[[సప్తర్షులు]] నీ పాదములను పూజించుటకు సిద్ధముగానున్నారు. ఓ వేంకటాచలపతీ! శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. లేత చిగురులు, పూల సువాసనలతో మలయమారుతము వీచుచున్నది. పెంపుడు చిలుకలు విలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము.
 
నారదుడు నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక. తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించబూనుచున్నవి. గొల్లపడుచులు పెరుగు చిలుకుచున్న సవ్వడులు నలుదిక్కుల నిండినవి. శ్రీమాన్! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకబంధువుడవు. శ్రీనివాసా! దయాసముద్రుడవు. లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించినవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
 
బ్రహ్మాది దేవతలు పుష్కరిణిలో స్నానముచేసి ద్వారము కడ కాచుకొనియున్నారు. నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషబాధ్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. అష్టదిక్పాలకులు నీ సేవకై కాచుకొనియున్నారు. [[గరుడుడు]], మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! [[నవగ్రహములు]]ను నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
 
స్వామీ! నీ పాదధూళిచే పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
పంక్తి 82:
నియ తారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకటశైల పతే
 
అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారు ముఖాంబురుహమ్‌
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామ మయే.
 
వినా వేంకటేశం న నాథో న నాథః
పంక్తి 108:
 
== ఇవి కూడా చూడండి ==
* శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్లోకాలు మరియు అర్ధవివరణల కోసం [[:s:శ్రీ_వేంకటేశ్వర_సుప్రభాతంశ్రీ వేంకటేశ్వర సుప్రభాతం]]లో చూడండి.
 
 
పంక్తి 115:
 
==బయటి లింకులు==
 
 
*[http://www.a1tamilnadu.com/list_mp3.asp mp3 ఫార్మాట్‌లో సుప్రభాతం డౌన్‌లోడ్]
Line 121 ⟶ 120:
* [http://www.archive.org/details/SuprabhataSeva సుప్రభాత సేవ తెలుగు స్వేచ్ఛానువాదం- కొమర్రాజు ప్రసాద్ - ఆడియో] ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
* [http://www.archive.org/details/venkateshwarasup024009mbp వెంకటేశ సుప్రభాత గీతములు మరియు శ్రీలక్ష్మీనారాయణ స్తోత్ర మంజరి]- బాపట్ల వెంకట పార్ధసారధి రచన - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం - ఇందులో ప్రతి శ్లోకానికి తెలుగులో పద్యానువాదం ఉన్నది.
 
 
 
[[వర్గం:స్తోత్రములు]]