పండితారాధ్యుల నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తొలితరం సంపాదకులలో '''పండితారాధ్యుల నాగేశ్వరరావు''' ఎన్నదగినవాడు. ఇతడు [[గుంటూరు]] జిల్లా, [[ఇంటూరు]] గ్రామంలో [[1912]], [[మార్చి 26]]న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించాడు. [[గుంటూరు]]లోని [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో విద్యాభ్యాసం చేశాడు<ref>{{cite web|last1=ముదిగొండ|first1=వీరభద్ర శాస్త్రి|title="నేడు ‘పండితారాధ్యుల’ శతజయంతి!"|url=http://aviiviannee.blogspot.in/2012/03/blog-post_6018.html|website=అవీ ఇవీ అన్నీ|accessdate=17 January 2015}}</ref>. అనంతరం పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచాడు. పిఠాపురం మహారాజావారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు పనిచేసి, ఆచార్యరంగా నెలకొల్పిన వాహిని పత్రికలో 1932లో చేరాడు. 1943 నుంచి 1959 వరకూ [[ఆంధ్రపత్రిక]]లో పనిచేశాడు. 1960లో [[ఆంధ్రభూమి]] సంపాదకుడిగా విశేషమైన సేవలందించాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వెలువడిన [[ఆంధ్రజనత]]కు 1965లో ఏడాదిపాటు సంపాదకత్వం వహించాడు. 1966 నుంచి మరణించే(1976) వరకూ [[ఆంధ్రప్రభ]] బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఈ పత్రికలతో పాటుగా [[గోభూమి]], [[క్రాంతి(పక్షపత్రిక)|క్రాంతి]], [[సంజయ]], [[ప్రజాప్రభ]] వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు<ref>[https://en.wikipedia.org/wiki/Nageswara_Rao_Panditharadhyula]ఇంగ్లీషు వికీపీడియాలో వ్యాసం</ref>. 1969-72 మధ్య కాలంలో రాష్ట్రంలో తలెత్తిన వేర్పాటువాద ఉద్యమ సందర్భాలలో సమన్వయానికి, సంఘటితత్వానికి దోహదం చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహించాడు. పండిత పాత్రికేయులుగా ప్రఖ్యాతిగాంచిన పండితారాధ్యుల 1976 నవంబర్ 13న తుదిశ్వాస విడిచాడు.
 
==మూలాలు==