పండితారాధ్యుల నాగేశ్వరరావు
తొలితరం సంపాదకులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు ఎన్నదగినవాడు. ఇతడు గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో 1912, మార్చి 26న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించాడు. [1] గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు[2]. అనంతరం పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచాడు. పిఠాపురం మహారాజావారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు పనిచేసి, ఆచార్యరంగా నెలకొల్పిన వాహిని పత్రికలో 1932లో చేరాడు. 1943 నుంచి 1959 వరకూ ఆంధ్రపత్రికలో పనిచేశాడు. 1960లో ఆంధ్రభూమి సంపాదకుడిగా విశేషమైన సేవలందించాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వెలువడిన ఆంధ్రజనతకు 1965లో ఏడాదిపాటు సంపాదకత్వం వహించాడు. 1966 నుంచి మరణించే(1976) వరకూ ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఈ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు[3]. 1969-72 మధ్య కాలంలో రాష్ట్రంలో తలెత్తిన వేర్పాటువాద ఉద్యమ సందర్భాలలో సమన్వయానికి, సంఘటితత్వానికి దోహదం చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహించాడు. పండిత పాత్రికేయులుగా ప్రఖ్యాతిగాంచిన పండితారాధ్యుల 1976 నవంబరు 13న తుదిశ్వాస విడిచాడు.
మూలాలు
మార్చు- ↑ "Andhra Prabha News Paper". India Mapped: News Papers in India. Retrieved 2013-04-04.
- ↑ ముదిగొండ, వీరభద్ర శాస్త్రి. ""నేడు 'పండితారాధ్యుల' శతజయంతి!"". అవీ ఇవీ అన్నీ. Archived from the original on 1 ఏప్రిల్ 2014. Retrieved 17 January 2015.
- ↑ [1] ఇంగ్లీషు వికీపీడియాలో వ్యాసం