రేడియో: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (4) using AWB
పంక్తి 35:
[[లండన్]] వెళ్ళగానే మార్కోనీ వైర్ లెస్ పరికరాన్ని పేటెంట్ కార్యాలయం లో రిజిస్టర్ చేయించాడు. జనరల్ పొస్టాఫీసులో ప్రధాన ఇంజనీరుగా పనిచేస్తున్న విలియం ప్రీస్ పరికరాన్ని ప్రదర్శించడానికి మార్కోనీకి అనుమతి సంపాదించిపెట్టాడు. ఇంజనీర్లు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, వ్యాపార సంస్థల అధిపతులు ఈ ప్రదర్శనకు ఆహ్వానించబడ్డారు. ఇంట్లో తయారు చేసిన మొరటుపరికరాలు ఎలా పనిచేస్తాయో ఏమో అని మార్కోనీ అధైర్య పడ్డాడు. కానీ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైంది. మరుసటి ప్రదర్శన పదాతిదళం, నావికాదళం అధిపతుల సమక్షంలో జరిగింది. మార్కోనీ పరికరంతో సంకేతాలను ఎనిమిది మైళ్ళ దాకా పంపడానికి వీలయ్యేది.
===నీళ్లపైన ప్రయోగం===
1897 మే లో తొలి వైర్ లెస్ టెలిగ్రాఫ్ స్టేషన్స్టేషను కార్డిఫ్ వద్ద నెలకొల్పబడింది. ఏరియల్ ని వంద అడుగుల ఎత్తులో బిగించారు సంకేతాలు నీళ్ళ మీదుగా ఎలా ప్రయాణిస్తాయో పరిశీలించాలని బ్రిస్టల్ చానల్ మధ్య భాగం నుంచి ప్రసారం ప్రారంభించాడు. మొదట్లో సంకేతాల జాడే కనిపించలేదు. నిరాశ చెందకుండా మార్కోనీ ఎక్కడ లోపముందో పరీక్షించి, పరికరంలో తగిన మార్పులు చేసాడు. సంకేతాలు వచ్చాయి కానీ అవి బలహీనంగాను, లోపభూయిష్టంగానూ ఉండేవి. ఏరియల్ పొడవును పెంచి సంకేతాలను సంతృప్తికరంగా గుర్తించటం జరిగింది. ఈ ప్రయోగాలను పరిశీలించటానికి బెర్లిన్ అధికారులు ప్రొఫెసర్ స్లాచీ, జార్జ్ ఆర్కో అనే ఇద్దరు నిపుణులను పంపించారు కూడా.
===ఖ్యాతి===
అనతి కాలంలోనే మార్కోనీ ప్రయోగాల విజయ గాధలు యూరప్ అంతా వ్యాపించాయి. ఎక్కడ చూసినా ప్రజలు ఆయన వినూత్న ఆవిర్భావాన్ని గురించి చర్చించుకోసాగారు. ఇది వరకు ఇంగ్లండ్ లో అతడిని గేలి చేసిన వాళ్ళూ, విమర్శించిన వాళ్ళూ ఇప్పుడు జోహార్లర్పించడం మొదలుపెట్టారు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఓడలలో వార్తా ప్రసార సౌకర్యాలు ఏర్పరుచుకునే అవకాశం దగ్గర పడుతోందని సామాన్య ప్రజలకు కూడా నమ్మకం కుదిరింది.
పంక్తి 93:
 
===అతి చిన్న తరంగాలు(Short Wave)===
ఈ పౌనఃపున్యతను సుదూర ప్రాంతాలకు ప్రసారంచేయడానికి వాడతారు. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్ యొక్క కోణాన్ని బట్టి ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500 కిలోమీటర్ల ను దాటి ఈ ప్రసారాలు ఉంటాయి. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్‌ నుండి వెలువడిన రేడియో తరంగాలను భూవాతావరణపు పై పొర (Iono sphere) ను తమకు కావల్సిన కోణంలో ఢీ కొట్టేట్టుగా వదులుతారు. ఆ రేడియో తరంగాలు , భూవాతావరణపు పై పొర (Ionosphere) ను ఢీకొని వికేంద్రీకరించబడి (Reflect) తిరిగి భూమి మీదకు ప్రసారమవుతాయి. సామాన్యంగా, ట్రాన్స్‌మిటర్‌కు, ప్రసారమయ్యే ప్రాంతానికి దూరం 3,500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ట్రాన్స్‌మిటరు ఏరియల్ కోణాన్ని నియంత్రించి ఈ దూరాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జరిగే ప్రసారాలు చాలా దూరం వినబడినా, ధ్వనిలో నాణ్యత ఉండదు. భూ వాతావరణపు పొరలో వచ్చే మార్పులమీద ఆధారపడి ప్రసారాలు జరుగుతాయి కాబట్టి, రేడియోలలో వచ్చే ప్రసార కార్యక్రమాల ధ్వని పైకి, కిందకూ జరుగుతూ ఉంటుంది. ఒకే ప్రాతంలో వాతావరణపు పొరను ఢీ కొట్టటం వలన ఒక రేడియో స్టేషన్‌‌కుస్టేషను‌‌కు మరొక స్టేషన్‌కుస్టేషను‌కు తరంగాలు కలసి పోయి ఒక్కొక్కసారి అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతిలో చాలా తక్కువ రేడియో స్టేషను లు ప్రసారాలు చేస్తున్నాయి. బి.బి.సి(British Boradcasting Corporation), వి.వొ.ఎ. (Voice of America) మొదలగు అంతర్జాతీయ రేడియో సంస్థలు ఈ విధానంలో దశాబ్దాలపాటు ప్రసారాలు చేసినాయి, ఇప్పటికి కూడ చేస్తున్నాయి.
 
===పౌనఃపున్య మాడ్యులేషన్(Frequency Modulation)===
పంక్తి 153:
సంఘం మనుషులు ఏ చెట్టు కిందో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పెద్దల ముందు మైకుపెడతారు. వాళ్ల అనుభవ సారమంతా టేపుల్లో నిక్షిప్తం అవుతుంది. వారి జీవితానుభవాలను పిల్లలు తెలుసుకొనడానికి ఇదొక మంచి అవకాశం. కొంత మంది కథలు చెప్పవచ్చును, సంగీత కచేరీ కూడా చేయవచ్చును.
 
కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ సామాజిక రేడియోలకు తలుపులు తెరిచింది. బోణీ 'సంఘం రేడియో' వారిదే. బుందేల్‌ఖండ్‌లో కూడా ఈమధ్యే కార్యక్రమాలు మొదలయ్యాయి. కచ్ మహిళా వికాస్ సంఘటన్ (గుజరాత్), ఆల్టర్నేటివ్ ఫర్ ఇండియా డెవలప్‌మెంట్ (జార్ఖండ్), వాయిస్ ప్రాజెక్ట్ (కర్ణాటక)... ఇప్పటికే కమ్యూనిటీ రేడియోల్ని జనానికి పరిచయం చేశాయి. ఇంకో ఏడాదిలో పాతిక దాకా కొత్త రేడియోలు రావచ్చని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ రేడియో ఫోరం అంచనా. సామాజిక రేడియో లైసెన్సు కింద చాలా [[విశ్వవిద్యాలయాలు]] సొంత స్టేషన్లుస్టేషనులు పెట్టుకున్నాయి. ఒక యూనిట్ స్థాపనకు 'ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు