స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (3) using AWB
పంక్తి 36:
== ఖద్దరు ఉద్యమం ==
 
మాతృభూమి విూద నుండి పరాయి పాలకులను పాలద్రోలాలంటే విదేశీ వస్తువుల వ్యామోహం వదలాలని, స్వదేశీ కుటీర పరిశ్రమలను అభివృద్ధిపర్చుకోవాలని మహాత్ముడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖద్దరు ఉద్యమం రూపుదిద్దుకుంది. ఈ ఉద్యంలో భాగంగా గుంటూరు జిల్లా తొలిసారిగా మహమ్మద్‌ ఇస్మాయిల్‌ తెనాలిలో 1926లో ఖద్దరుషాపు ప్రారంభించి చివరకు 'ఖద్దరు ఇస్మాయిల్‌' గా శ్యాశ్విత నామధేయులయ్యారు. ఈ తరహాలోనే నిరంతరం ఖద్దరు ధరించడమే కాకుండా ఖద్దరు విక్రయశాల ఉద్యోగిగా ఖద్దరు ప్రచారాన్ని నిర్వహించిన షేక్‌ ఖాశిం బేగ్‌ ఖద్దరు జుబ్బా ఖాశిం బేగ్‌ గా గుర్తింపు పొందారు. అటు నైజాంలోని హైదరాబాద్‌ నగరంలో ప్రముఖ జాతీయోద్యమకారిణి బేగం ఫక్రుల్‌ హాజియా స్వయంగా ఖద్దరు వస్త్రాలను ధరించడమే కాకుండా విదేశీ వస్తువుల బహిష్కరణలో పాల్గొని ట్రూప్‌ బజారులోని స్వగృహం అబిద్‌ మంజిల్‌లో విదేశీ వస్త్రాలను అగ్నికి ఆహుతి ఇచ్చారు. ఆమె తనయుడు బద్రుల్‌ హసన్‌ బొంబాయి నుండి రాట్నాలు తెప్పించి, హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. తిలక్‌ స్వరాజ్య నిధికి ఆయన 23 వేల రూపాయలు సేకరించి పంపారు. ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాక సందర్భంగా నిరసన తెలియజేస్తూ విదేశీ వస్తువులను తగులబెట్టిన తొలి వ్యక్తిగా బద్రుల్‌ హసన్‌ ఖ్యాతిగాంచారు. నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముహమ్మద్‌ ఉస్మాన్‌ తన కర్మాగారంలోని విదేశీ బట్టలను పోగేసి తగులబెట్టారు. బహుముఖంగా విస్తరిస్తున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అక్షరయోధులు అధికంగా శ్రమించారు. నగరంలోని నిజాం కళాశాలకు చెందిన గౌసుద్దీన్‌ అను విద్యార్థి హిందూ-ముస్లింల ఐక్యతకు సంబంధించి గ్రంథం ప్రచురించారు. గోషా మహల్‌ నివాసి ముహమ్మద్‌ జహుర్‌ అహమ్మద్‌ ఖాదీ ఉద్యమాన్ని బలపర్చుతూ రాసిన ఉత్తేజకరమైన వ్యాసాలు హైదరాబాదులోని ముషీర్‌-యే-దక్కన్‌, మదీనా ఉర్దూ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో ఉద్యమం సాగుతుండగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని చౌరీచౌరా పోలీస్‌ స్టేషన్‌స్టేషను‌ విధ్యంసం, పోలీసు ఆధికారుల విూద దాడి సంఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తరువాతి క్రమంలో జాతీయోద్యమ వేదిక మీదకు వచ్చిన సైమన్‌ కమీషన్‌ను బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా మద్రాసులో షఫీ మహమ్మద్‌ ప్రముఖ పాత్ర నిర్వహించారు. జాతీయోద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి యువజన-విధ్యార్థులను రంగం మీదకు తెచ్చేందుకు గుంటూరుకు చెందిన గాలిబ్‌ సాహెబ్‌, రహిమాన్‌లు అవిరళ కృషి సల్పారు. షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌ బ్రాడిపేటలో ఆయన తన సోదరుని పేరిట నిర్వహించిన లాండ్రి షాపు ఆనాడు జాతీయ ఉద్యమకారులకు రహస్య కూడలి అయ్యింది. ఆ కారణంగా ఆ లాండ్రి విూద పలుమార్లు పోలీసుల దాడి చేశారు. ఈ మేరకు సంపూర్ణ స్వరాజ్యం సాధనకు అనుసరించాల్సిన ఉద్యమ వ్యూహాన్ని నిర్ణయించమని కాంగ్రెస్‌ గాంధీజీని కోరింది. సంపూర్ణ స్వరాజ్యం తమ లక్ష్యంగా ప్రకటించి ముందుకు సాగుతున్న ఉద్యమాన్ని అడ్డుకోవడానికి బ్రిటీష్‌ వైశ్రాయి ఇర్విన్‌ నిరంకుశంగా వ్యవహరించ సాగాడు. బ్రిటీష్‌ వైశ్రాయి అప్రజాస్వామిక వ్యవహార సరళికి వ్యతిరేకంగా గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, జాతీయోద్యమంలో చిచ్చరపిడుగుగా ఖ్యాతి గడించిన హస్రత్‌ మెహాని చే ప్రశావితులైన నగరానికి చెందిన రజియా బేగం, జమాలున్నీసా బాజి, వారి అన్నదమ్ములు అన్వర్‌, జాఫర్‌లు ఉద్యమ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కుటుంబీకులందరూ స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు, అన్నిరకాల అసమానతల నుండి ప్రజల విముక్తి కోరుతూ జాతీయోద్యమంలో పాల్గొనడమే కాకుండా, అటు సామ్రాజ్య విస్తరణకాంక్ష గల బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించడంతోపాటు, నిజాం వ్యతిరేక పోరాటాలలో పాల్గ్గొన్నారు. బ్రిటీషు ప్రభుత్వ చట్టాల ఉల్లంఘన ద్వారా శాసనోల్లంఘన ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్న మహాత్మా గాంధీ 1930 మార్చి 20న గుజరాత్‌లోని దండి యాత్ర ఆరంభించగానే మద్రాసులో జరిగిన శాసనోల్లంఘనలో ఒబైదుల్లా సాహెబ్‌ అరెస్టు అయ్యారు. చిత్తూరుజిల్లా [[మదనపల్లె]] తాలూకా [[పెదపాలెం]] నివాసి షేక్‌ ఇమాం, ప్రకాశం జిల్లా, అమ్మనబ్రోలుకు చెందిన షేక్‌ చెంగీ షా కనపర్తిలోని ఉప్పు కొటారాల విూద జరిగిన దాడిలో పాల్గొన్నారు. బెహాంపూర్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌, పశ్చిమ గోదావరికి చెందిన డాక్టర్‌ నశీర్‌ అహమ్మద్‌ విదేశీ వస్తువుల బహిష్కరణ, మధ్యనిషేధం ఉద్యమంలో పాల్గొన్నారు. డాక్టర్‌ నశీర్‌ స్వగృహం వద్దే శాసనోల్లంఘన ఉద్యమ శిబిరం ఏర్పాటు చేశారు. జాతీయ కాంగ్రెస్‌ సభ్యులైన ఆయన ఆరు నెలల జైలు జీవితం గడిపారు. గుంటూరుకు చెందిన షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌, నెల్లూరు జిల్లాలో యల్‌.ఫకీర్‌, యం.షంషీర్‌ బేగ్‌ పలుమార్లు జైలుశిక్షలకు గురయ్యారు. ఈ సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రచురించిన కరపత్రాలను పంచుతున్న నేరానికి అబ్దుల్‌ రజాక్‌, షేక్‌ మూసా సాహెబ్‌, షేక్‌ నబీసాహెబ్‌లు పోలీసులు దాడికి గురయ్యారు. చీరాల యువకుల ఆహ్వానం మేరకు వెళ్ళి ఉప్పుగుడారాలలోకి దూకిన ముహమ్మద్‌ గౌస్‌ దేవరంపాడు శిబిరానికి నాయకత్వం వహించారు. 1931లో గాంధీజీ-ఇర్విన్‌ల మధ్యన కుదిరిన ఒప్పందం తెచ్చిన ఉపశమనం అతి త్వరలో ముగిసింది. బ్రిటీషు ప్రభుత్వం జాతీయోద్యమాన్ని తీవ్రంగా అణిచివేయాలని నిర్ణయించుకుని కిరాతక చట్టాలు రూపొందించగా మహాత్ముడు వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని రూపొందించారు. ఈ పరిణామంతో రెచ్చిపోయిన అధికారగణం విజయవాడలోని ప్రతిష్టాకరమైన భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యాలయం విూద కూడా పోలీసులు దాడులు నిర్వహించి కార్యాలయానికి తాళాలు వేశారు. ఈ చర్యను అవమానకరంగా భావించిన యువనాయకుడు సయ్యద్‌ హబీబుల్లా ముందుకు వచ్చి తన సహచరులతో కలసి 1932 జులై 31న కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఈ సంఘటన పురస్కరించుకుని యువ నాయకుడు సయ్యద్‌ హబీబుల్లాతోపాటుగా 70మంది యువకులు అరెస్టయ్యారు. (భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర, కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం, విజయవాడ, 1984, పేజి.92) ఈ సందర్భంగా ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు తెనాలి ఉన్నత పాఠశాల విద్యార్థి షేక్‌ మహబూబ్‌ ఆదం, ఆయన గురువు మంత్రవాది వెంకటరత్నంలు పోలీసుల కన్నుగప్పి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు. 1932 ఆగస్టు 17న ప్రభుత్వం కమ్యూనల్‌ అవార్డును ప్రకటించింది. హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సందర్భంగా గాంధీజీ జరిపిన హరిజన యాత్రలో భాగంగా 1933 డిసెంబరు 31న తిరుపతికి రాగా అక్కడ సి.ఎ.రహీం అను ఉత్సాహవంతుడైన యువకుడు అక్కడికక్కడ కాగితం విూద చేతి గోటితో మహాత్ముని చిత్రాన్ని చిత్రించిన ఆయనకు బహుకరించారు. ఆ తరువాత సంభవించిన వివిధ పరిణామాల వలన, సంపూర్ణ స్వరాజ్య సాధనా లక్ష్యంగా ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం బలహీనపడి 1934లో పూర్తిగా ముగిసింది. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించుకోవడం పట్ల యువకులు కినుక వహించిన మున్షీ మహమ్మద్‌ మస్తాన్‌ (తెనాలి) రహమతుల్లా (ఒంగోలు) విప్లవకర చర్యలకు పాల్పడ్డారు. విప్లవ కరపత్రాలను పంచడమే కాక, మంతెనవారి పాలెంలో రహస్యంగా నిర్వహించిన రాజకీయ తరగతులకు హాజరైన మున్షీ మస్తాన్‌ పోలీసుల చేత చావుదెబ్బలు తిన్నారు. 1939లో ఏర్పడిన హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్‌ స్థాపనకు తోడ్పడిన పలు సంస్థలలో నిజాం సబ్జెక్ట్సు లీగ్‌ కార్యకలాపాల్లో అబుల్‌ హసన్‌ సయ్యద్‌ అలీ, బద్రుల్‌ హసన్‌, ఫజులుర్రెహమాన్‌, సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌ ప్రధాన పాత్ర నిర్వహించగా, ప్రముఖ జాతీయవాది బద్రుల్‌ హసన్‌ విదర్‌ హైదరాబాద్‌ (ఇనీరిశినీలిజీ కగిఖిలిజీబిలీబిఖి) అను గ్రంథాన్ని రాసి నిజాం సబ్జెక్ట్సు లీగ్‌ భావాలను ప్రచారం చేయగా, నిజాం ప్రభుత్వం ఆ గ్రంథాన్ని నిషేధించింది. ఆ తరువాత ఏర్పడిన 'స్వదేశీ లీగ్‌'కు నిజాం ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు ఫజులుల్‌ ర్రెహమాన్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. (హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర ః వెల్దుర్తి మాణిక్యరావు). ఆ తరువాత ఏర్పడిన హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్‌కు వ్యవస్థాపకులలో మౌల్వి సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌ ఒకరుగా ఖ్యాతిగాంచారు. ఆయనతోపాటుగా షేక్‌ నబీ సాహెబ్‌, షేక్‌ మొయినుద్దీన్‌ తదితరులను ప్రచార కార్యక్రమాలలో పాల్గొని చాలా కాలం నిజాం ప్రభుత్వం నిర్బంధంలో గడిపారు. 1939లో ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సంపూర్ణ స్వరాజ్యం కోరుతుండగా బ్రిటీష్‌ పాలకులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, నాయకులతో ఏమాత్రం సంప్రదించకుండా ఎకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ద్వితీయ ప్రపంచ యుద్ధంలో తమల్ని భాగస్వాములను చేయడాన్ని సహించలేకపోయారు. ఆ నేపధ్యంలో 1940 అక్టోబరు 17న ఆచార్య వినోబా భావేను తొలి సత్యాగ్రహిగా అనుమతిస్తూ మహాత్ముడు చారిత్రక వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
 
===అనంతపురం ముస్లింల పాత్ర ===
పంక్తి 48:
== క్విట్ ఇండియా ఉద్యమ కాలం ==
 
1942 జులైలో మహాత్ముడు ఇది బాహాటమైన తిరుగుబాటు అని హెచ్చరిక చేశారు. 1942 ఆగస్టులో బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, క్విట్‌ ఇండియా పోరాటానికి సమర శంఖారావం పూరించింది. బ్రిటీష్‌ వారిని భారతదేశం వదలి పొమ్మంటూ 1942 జూలైలో వార్ధాలో చేసిన తీర్మానాన్ని, బొంబాయి సమావేశం ధృవీకరించింది. ఆ తీర్మానం క్విట్‌ ఇండియా తీర్మానంగా ప్రసిద్ధి పొందింది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి గాంధీజీ మాట్లాడుతూ విజయమో-వీరస్వర్గమో ('ఈళి ళిజీ ఈరిలి') తేల్చుకోవాలన్నారు. జాతీయ నాయకుల పిలుపు మేరకు జనసమూహాలు కూడా కదిలాయి. ప్రభుత్వం ప్రజల విూద విరుచుకపడింది. ఈ క్రమంలో, అనంతపూర్‌ జిల్లా కదిరి నివాసి మహబూబ్‌ సాహెబ్‌ కొత్తకోట అటవీ శాఖ కార్యాలయాన్ని తగుల బెట్టినందుకు జైలుకు వెళ్ళారు. అనంతపురం జిల్లాకు చెందిన యం.మొహిద్దీన్‌ సాహెబ్‌, యం.అఫ్సర్‌ ఆలీ, తదితరులు మధ్యం వ్యాపారుల బెదిరింపులకు లొంగకుండా మధ్యనిషేధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆనాడు మహమ్మద్‌ ఆలీ జిన్నాతో వ్యక్తిగత పరిచయం ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధుడైన మహమ్మద్‌ అలీ ముస్లింలీగ్‌ రాజకీయాలకు దూరమై ఈ పోరాటంలో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వ్యవసాయదారుడు అబ్దుల్‌ బజీద్‌ ఖాన్‌ ఒకటిన్నర సంవత్సరం జైలుశిక్షను అనుభవించారు. ఆ తరువాత అతి చిన్నవయస్సులోనే జిల్లా బోర్డు సభ్యునిగా ఎన్నికైన ఆయన చరిత్ర సృష్టించారు. భీమవరం వ్యాపారి షేక్‌ అలీ సాహెబ్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఆ సందర్భంగా జరిగిన లాఠీ ఛార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత కూడా బ్రిటీష్‌ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న ఆయన పలుమార్లు జైలు శిక్షలకు గురయ్యారు. ఆలీపూర్‌ క్యాంపులో రెండు సంవత్సరాల పాటు పలు కడగండ్లు అనుభవించారు. స్వాతంత్య్రం సిద్ధించాక 1946లో కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గ సభ్యునిగానూ, రాష్ట్ర కార్యవర్గంలోనూ బాధ్యతలను నిర్వహించారు. భీమవరం నివాసి షేక్‌ ఫకీర్‌ మొహిద్దీన్‌ 17-8-1942 నాటి జాతీయోద్యమ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జైలుశిక్ష, ఎనిమిది కొరడా దెబ్బల శిక్షకు గురయ్యారు. ఆయన 1943 డిసెంబరు 9 వరకు అలీపూర్‌ జైలులో గడిపారు. తాడేపల్లిగూడెం తాలూకా నవాబుపాలెం రైల్వే గేట్‌మన్‌ షేక్‌ పెద మస్తాన్‌ సంవత్సరం పాటు అలీపూర్‌ క్యాంపు జైలు బాధలను రుచి చూశారు. తాడేపల్లిగూడెం నివాసి షేక్‌ రహీంఖాన్‌ పెంటపాడు తపాల కార్యాలయం తగులబెట్టిన సంఘటనలో ప్రధాన పాత్ర వహించినందున 12 కొరడా దెబ్బల శిక్షను అనుభవించారు. కృష్ణాజిల్లా తిరువూరు తాలూకా గౌరంపాలెం నివాసి సాలార్‌ సాహెబ్‌, స్వాతంత్య్ర సమర యోధుడు కొత్వాల్‌ అబ్బాస్‌ ఆలీ కుమారుడు కొత్వాల్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. నూజివీడుకు చెందిన షేక్‌ నూరుల్లా సాహెబ్‌, కొనకంచి నివాసి షేక్‌ సర్దార్‌ సాహెబ్‌ వ్యక్తిసత్యాగ్రహం నుండి క్విట్‌ ఇండియా ఉద్యమం వరకు నిరంతరం కార్యక్రమాలలో పాల్గొన్నారు. నందిగామ తాలూకా కొనకంచి గ్రామాధికారి షేక్‌ బికారీ సాహెబ్‌ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న కిరాతక వైఖరికి నిరసనగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆలూరు తాలూకా నెమకల్‌కు చెందిన టైలర్‌ యం.అక్బర్‌ ఆలీ ఎనిమిది మాసాల జైలు శిక్షకు గురయ్యారు. అనంతపురం జిల్లా కసాపురం నివాసి మహమ్మద్‌ రసూల్‌ గుంతకల్‌ వద్ద రైల్వేస్టేషన్‌రైల్వేస్టేషను‌ ధ్వంసం చేసిన సంఘటనలో మిత్రులతో కలసి పాల్గొన్నందున ఆరు మాసాల జైలు శిక్షను అనుభవించారు. మదనపల్లె నివాసి పి. మదార్‌ సాహెబ్‌ పోలీసు లాఠీ దెబ్బలకు గురయ్యారు. నంద్యాల తాలూకా తొగిరిచేడుకు చెందిన రైతుకూలీ ముల్లా మహబూబ్‌ సుభాని అలీపూర్‌జైలులో ఆరు మాసాల జైలుశిక్ష అనుభవించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన షేక్‌ మొహద్దీన్‌ సాహెబ్‌ నిర్బంధానికి గురయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన టైలర్‌ షేక్‌ హటల్‌ సాహెబ్‌ను అరెస్టు చేసి డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్స్‌ క్రింద 18 మాసాల శిక్షను విధించారు. నిడుబ్రోలుకు చెందిన షేక్‌ మస్తాన్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నారు. ఆయనకు ప్రభుత్వం మూడు సంవత్సరాల ఆరు మాసాల జైలుశిక్ష విధించింది. బస్‌కండక్టర్‌ ముహమ్మద్‌ హనీఫ్‌ అలీపూర్‌, రాజమండ్రి జైళ్లలో సంవత్సరం గడిపారు.తెనాలికి చెందిన మున్షీ సయ్యద్‌ మహమ్మద్‌ మస్తాన్‌ తెనాలి రైల్వే స్టేషన్‌స్టేషను‌ విూద జరిగిన దాడిలో పాల్గొని, అక్కడ జరిగిన పోలీసు కాల్పుల్లో చావు తప్పి బయటపడ్డారు. ఆ తరువాత కొంతకాలం రహస్య జీవితం గడిపారు. తెనాలికి చెందిన మరోయోధుడు సయ్యద్‌ అబ్దుల్‌ అజీం ఉద్యమ కార్యకలాపాలలో పాల్గొనడమే కాక, మద్రాసులో కొంతకాలం అజ్ఞాతవాసం చేశారు. ముస్లింల సంక్షేమం, రాజ్యాధికారం ప్రధాన లక్ష్యంగా అఖిల భారత ముస్లింలీగ్‌ మద్రాసు నగరవాసుల గుప్పెట నుండి బయట పడి గుంటూరు జిల్లా కేంద్రం బాగా బలపడింది.1944 మే 5న తెనాలిలో సయ్యద్‌ మహబూబ్‌ నాయకత్వంలో ముస్లింలీగ్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ న్యాయవాది ముహమ్మద్‌ అబ్దుల్‌ సలాం అధ్యక్షత వహించగా సయ్యద్‌ మహబూబ్‌, ముహమ్మద్‌ యాశిన్‌, అబ్దుల్‌ కరీం, అల్లాబక్ష్‌ లాంటి ప్రముఖులు సభ్యులుగా ముస్లింలీగ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కమిటీ ఎన్నికయ్యింది. 1945 జనవరి 21న బాపట్లలో గుంటూరు జిల్లా ప్రైమరి లీగ్‌ అధ్యక్ష కార్యదర్శుల ప్రథమ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కవి ఉమర్‌ అలీషా మాట్లాడుతూ మన దేశంలో కాంగ్రెసు, ముస్లిం లీగు రెండు పెద్ద రాజకీయ సంస్థలు. రెండు ఏకమైతేనేగాని పరదేశ పాలకవర్గాన్ని తరుమలేము. హిందూ-ముస్లిం తగాదాలు పోరాటాలు విదేశ పాలకులను ఇక్కడే శాశ్వితముగా అట్టి పెట్టగలవు. ఈ సత్యాన్ని ఉభయులు గ్రహించాల,ని ఉద్బోధించారు. అఖిల భారత ముస్లింలీగ్‌ రాజకీయ దృక్పధం ఏలా ఉన్నా ఆంధ్రలోని ముస్లింలలో అత్యధికుల రాజకీయ దృక్కోణం మాత్రం భిన్నంగా వ్యక్తం అయ్యింది. ఆయన మార్గ నిర్దేశకంలో ముస్లింలీగ్‌ పాకిస్థాన్‌ కొరకే కాకుండా ముస్లిం ప్రజలకు నిత్యం సహాయ సహకారిగా నిరూపించాలి, అని స్పష్టంగా ప్రకటించింది. ఈ కార్యక్రమాలలో అజీజుల్లా దుర్రాని (ఇంగ్లాండు), అబ్దుల్‌ మన్నాన్‌ దుర్రాని (అలీఘర్‌), డాక్టర్‌ మహమ్మద్‌ బేగ్‌, యం.ఎ. సలాం, షేక్‌ మగ్దూం, యస్‌ మహబూబ్‌లు పాల్గొన్నారు. బ్రిటీష్‌ దాస్య శృంఖాలాల నుండి విముక్తం చేయడానికి జర్మనీ వెళ్ళిన సుభాష్‌ చంద్రబోస్‌ అటు నుండి బర్మా చేరుకుని కెప్టన్‌ మాన్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యం (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ )పగ్గాలను సుభాష్‌ చంద్ర బోస్‌ స్వీకరించారు. ఆయన నేతృత్వంలో భారత జాతీయ సైన్యం, స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పడింది. ఇటు సైన్యంలో అటు ప్రభుత్వంలో మస్లిం యోధులు, మేధావులు నేతాజికి సన్నిహితంగా ఉంటూ అండదండలు అందించారు. ఈ క్రమంలో హైదరాబాదుకు చెందిన అబిద్‌ హసన్‌ సఫ్రాని లాంటి వారు ఉన్నత స్థానాలలో బాధ్యతలు నిర్వహించగా ఖమురుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌, హైదరాబాద్‌ చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్‌ కూడా నేతాజీతో కలసి పనిచేశారు. ఈ మేరకు హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్‌, అబ్దుల్‌ సయీద్‌ ఉస్మాని, అబ్దుల్‌ లతీఫ్‌, ఇమాముద్దీన్‌, ముహమ్మద్‌ ఖాన్‌ లాంటి పలువురు నేతాజీ వెంట నడిచారు. ఈ యోధులలో ఆబిద్‌ హసన్‌ సఫ్రాని లాంటి వారు స్వాతంత్య్ర పోరాట సాహిత్య చరిత్రలో అపూర్వం అనదగిన జైహింద్‌, నేతాజీ అను పదాలను సృష్టించారు. విజయనగరం జిల్లా వేపాడు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ చిన్నతనంలోనే పనికోసం బర్మాకు వెళ్ళి అక్కడి తేయాకు తోటల్లో శ్రమిస్తూ దాచుకున్న 20 వేల రూపాయలను అజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు విరాళంగా సమర్పించి తాను కూడా ఆజాద్‌ హింద్‌ పౌజ్‌లో రైఫిల్‌మన్‌గా, రిక్రూటింగ్‌ ఏజెంటు కూడా ఎంతో కృషిచేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్‌.అబ్దుల్‌ అలీ నేతాజీ పిలుపుకు ప్రభావితుడై ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరారు. వృత్తిరీత్యా వడ్రంగి కావడంతో ఆయనకు క్యాంపు క్వార్టర్లలో చేతినిండా పని ఉండేది. అయినా అలుపు సొలుపు ఎరుగకుండా పనిచేస్తూ ఆయన అధికారుల ప్రశంసలను అందుకున్నారు. అనంతర కాలంలో ఆయన యుద్ధఖైదిగా సంవత్సరం పాటు జైలుశిక్షను అనుభవించారు. అబ్దుల్‌ అలీ లాగే చిత్తూరు జిల్లాకు చెందిన మహమ్మద్‌ అఫ్జల్‌ సాహెబ్‌ నేతాజీ సైన్యంలో చేరారు. ఆయన కూడా ఒక ఏడాది యుద్ధఖైదీగా నిర్బంధానికి, ఇబ్బందులకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పి.పి.మహమ్మద్‌ ఇబ్రహీం అదే బాటలో నడిచారు. కడపజిల్లా రాయచోటికి చెందిన డ్రైవర్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో భారత జాతీయ సైన్యంలో చేరారు. 1945 దాకా మలయా తదితర ప్రాంతాలలో జైలులో గడిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన షేక్‌ అహమ్మద్‌ అజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో భాగస్వాములయ్యారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొని ఆయన పలు శిక్షలకు గురయ్యారు. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా, జాతీయంగా భారతీయులు నిర్వహిస్తున్న ఉద్యమాల తీవ్రత ఫలితంగా 1947లో భారతదేశం పాలనాధికారాన్ని భారతీయులకు అప్పగించాల్సిన పరిస్థితి ఆంగ్లేయులకు ఏర్పడింది. 1940 నుండి పాకిస్థాన్‌ ఏర్పాటును కోరుతూ ఆల్‌ ఇండియా ముస్లింలీగ్‌ సాగించిన విభజన రాజకీయాలకు ఆంగ్లేయులు తోడ్పాటు అందించారు. ఈ విభజన ప్రయత్నాలకు తెలుగుగడ్డ విూద నుండి తెనాలికి చెందిన మున్షీ మస్తాన్‌, నసరావుపేటకు చెందిన షేక్‌ ముహమ్మద్‌ ఆలీ, షేక్‌ మొహిద్దీన్‌ సాహెబ్‌లు లీగ్‌ విభజన రాజకీయాలను నిరసించారు. మహమ్మద్‌ ఆలీ ఎంతో కాలం లీగ్‌ సభ్యునిగా ఉన్నా కూడా, లీగ్‌ విభజన రాజకీయాలను వ్యతిరేకిస్తూ లీగ్‌కు రాజీనామా చేశారు. నరసరావుపేటకు చెందిన సయ్యద్‌ జాన్‌ అహమ్మద్‌ విభజనను వ్యతిరేకిస్తూ పనిచేశారు. భారత విభజన వలన కలిగే నష్టాలను, కష్టాలను వివరిస్తూ సభలు సమావేశాలు నిర్వహించారు, విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. ఈ మేరకు విభజనకు వ్యతిరేకంగా ప్రజలు, నాయకులు ఎంతగా ప్రయత్నించినా చివరకు విభజన తప్పలేదు. 1947 జూలై 15న బ్రిటీష్‌ పార్లమెంట్‌ భారత స్వాతంత్య్ర ప్రదాన బిల్లు ను ఆమోదించింది.
 
==హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమ చరిత్ర కాలం==