చీమకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 124:
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- చీమకుర్తి పట్టణంలోని రచ్చమిట్ట ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ నిర్మాణానికి, దాత శ్రీ మారం వెంకటసుబ్బారెడ్డి, స్థలాన్ని విరాళంగా అందజేసినారు. దాతల విరాళాలతో ఆలయ నిర్మాణం జరిగినది. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమాలు 2014,జూన్-9 వ తేదీ మద్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభం చేసెదరు. విఘ్నేశ్వరపూజ, మంగళస్నానాలు, అనంతరం పాలరాతితో చేసిన శ్రీ షిర్డీసాయినాధుని మూలవిరాట్టుకు గ్రామోత్సవం నిర్వహించెదరు. ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని మూడురోజులపాటు మహాకుంభాభిషేకాన్ని నిర్వహించుచున్నారు. 72 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. 13వ తేదీ ఉదయం 7=21 గంటలకు శ్రీ షిర్డీ సాయినాధ, దత్తాత్రేయ, గణపతి,శిఖర ప్రతిష్ఠ నిర్వహించెదరు, ఈ సందర్భంగా 25 వేలమందికి అనందానం నిర్వహించెదరు. [6] & [7]
#శ్రీ కృష్ణమందిరం:- చీమకుర్తిలోని ఇసుకవాగు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో 2014, ఆగష్టు-1వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా, ఆలయంలో ప్రత్యేకపూజలు, స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. [8]
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామివార్ల ఆలయం:- చీమకుర్తి గ్రామ శివారులో దిన్నేపురంలో ఉన్న ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా, వరలక్ష్మీ వ్రత మహోత్సవాన్ని నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో వరుణయాగం నిర్వహించెదరు. ఈ ఆలయంలో, 2015,మార్చ్-4వ తేదీ బుధవారం నాడు, స్వామివార్ల రథోత్సవం నిర్వహించినారు. 5వ తేదీ గురువారం, ఫాల్గుణ పౌర్ణమి నాడు, మహిళా భక్తులు పొంగళ్ళు వండి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, మొక్కుబడులు తీర్చుకున్నారు. [9] & []
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- చీమకుర్తి పట్టణంలోని పల్లపోతువారి వీధిలోని ఈ ఆలయంలో, 2014,డిసెంబరు-7వ తేదీ ఆదివారం, మార్గశిర బహుళ పాడ్యమి నాడు, సుదర్శనమూర్తి, ఆంజనేయస్వామి వారల పంచలోహ విగ్రహ ప్రతిష్టను వేడుకగా నిర్వహించినారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో నగరోత్సవం, కలశాభిషేకం, హోమాలు. పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. నూతన విగ్రహాలకు ప్రాణప్రతిష్ట, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించినారు. ఈ విగ్రహాలను పల్లపోతు వంశస్థులు సమకూర్చినారు. విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంతో పట్టణంలో పండుగ వాతావరణమం నెలకొన్నది. [10]
#శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం చీమకుర్తిలోని అగ్రహారంలో ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/చీమకుర్తి" నుండి వెలికితీశారు