సాదనాల వేంకటస్వామి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 81:
==జీవిత విశేషాలు==
'''సాదనాల వేంకటస్వామి నాయుడు'''(Sadanala Venkata Swamy Nayudu) [[1961]], [[ఫిబ్రవరి 15]]వ తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]], [[ముమ్మడివరం]] మండలం, [[గేదెల్లంక]] గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించాడు. [[విశాఖపట్నం]] జిల్లా, [[నక్కపల్లి]] గ్రామంలో ఇతని బాల్యం గడిచింది. [[రాజమండ్రి]] వి.టి.జూనియర్, డిగ్రీ కాలేజీలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.(తెలుగు) పట్టా పొందాడు. [[రాజమండ్రి]] జి.ఎస్.కె.మెమోరియల్ లా కాలేజీలో లా పూర్తి చేశాడు. [[తెలుగు విశ్వవిద్యాలయం]] లో “కృష్ణాపత్రిక సాహితీసేవ ఒక పరిశీలన” అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా సాధించాడు<ref>{{cite news|last1=న్యూస్ టుడే|title=కవిత ఏదయినా అది సమాజం కోసమే - సాదనాల మనోదృశ్యం|work=ఈనాడు దినపత్రిక తూర్పుగోదావరి జిల్లా సంచిక|date=1990-01-06}}</ref>.ఆ తర్వాత [[అన్నామలై విశ్వవిద్యాలయం]] నుండి బి.ఇడి.చేసి కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల, రాజమండ్రిలో ఆంధ్రోపన్యాసకులుగా కొంతకాలం పనిచేశాడు. తరువాత [[దక్షిణ మధ్య రైల్వే]]లో ప్రథమశ్రేణి తెలుగు పండితుడిగా [[డోర్నకల్]] రైల్వే హైస్కూలులో పనిచేశాడు. ప్రస్తుతం [[సికిందరాబాదు]] డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.
 
==సాహిత్య రంగం==
ఇతడు కథలు, కవితలు, వ్యాసాలు, గేయాలు, నాటికలు అనేకం వ్రాశాడు. ఇతని రచనలు [[సమాచారం (దినపత్రిక)|సమాచారం]], [[కళాప్రభ]], [[నేటి నిజం]], [[అపురూప]], [[అంజలి]], [[రచన (మాస పత్రిక)|రచన]],[[ఎక్స్‌రే]],[[ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక|ఆంధ్రజ్యోతి]] మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కథలు, కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఇతడు రచించిన గీతాలు కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆకాశవాణిలో ఇతడు వ్రాసిన గీతాలు, సంగీతరూపకాలు, నాటికలు ప్రసారమయ్యాయి. ఇతడి రచనలకు ఎన్నో బహుమతులు లభించాయి. పలు సాహిత్య సంస్థలతో ఇతనికి సంబంధాలున్నాయి. అనేక సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ గావించాడు.
Line 113 ⟶ 112:
# జీవనసాహితి - ముఖ్యసలహాదారు
{{Div end}}
 
==పత్రికా రంగం==
ఇతని రచనలు పలు దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని గురించి పరిచయ వ్యాసాలు కూడా పలుపత్రికలలో వచ్చాయి. ఇతడు [[అక్షరవర్ధిని]] అనే పత్రికకు, [[సంవీక్షణం]] అనే ద్వైమాసపత్రికకు సంపాదకునిగా పనిచేశాడు.
 
==సంగీత, నాటక రంగాలు==
ఇతడు ఆకాశవాణిలో ఆడిషన్ పాసై గాయకుడిగా అనేక జానపద గేయాలు పాడాడు. డ్రామా ఆడిషన్ పాసై బి గ్రేడ్ కళాకారుడిగా పాతికకు పైగా రేడియో నాటకాలలో నటించాడు. విజయశంకర్ ప్రభుత్వ సంగీత,నృత్య కళాశాల రాజమండ్రిలో మృదంగం, గాత్రం అభ్యసించాడు. మూషిక మరణం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశాడు. అనేక నాటకాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేసి స్వయంగా నటించాడు. పల్లెరథం, సంధ్యారాగం, సువ్వీ సువ్వన్నలాలి, గోదావరి చెప్పిన సుబ్బారావు కథ, అదిగో భద్రాద్రి మొదలైన సంగీత రూపకాలను వ్రాసి ఆకాశవాణిలో ప్రసారం కావించాడు. దూరదర్శన్‌లో ప్రసారమైన గురజాడ దిద్దుబాటు, కథావీధి టెలీ ఫిల్ములలో నటించాడు.
 
==సినిమా రంగం==
ఇతడు [[ఆంధ్రకేసరి (సినిమా)|ఆంధ్రకేసరి]], సుర్ సంగం, [[గాలి శ్రీను]] మొదలైన చిత్రాలలో చిన్న పాత్రలను ధరించాడు. '''మహానంది''' డాక్యుమెంటరీ చిత్రానికి టైటిల్ సాంగ్ వ్రాశాడు. '''దక్షిణ కాశి - ద్రాక్షారామం''' , '''శ్రీకాళహస్తి''', '''కొయ్యబొమ్మలతల్లి కొండపల్లి''' మొదలైన డాక్యుమెంటరీ చిత్రాలకు రచనాసహకారం అందించాడు.
 
==సాంస్కృతిక, సేవా రంగాలు==
ఇతడు జేసీస్ క్లబ్, రోటరీ క్లబ్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు. భారతీయ యూత్ హాస్టల్స్ అసోసియేషన్‌ రాజమండ్రి యూనిట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించాడు. 1993లో జరిగిన తానామహాసభలకు రాజమండ్రి ప్రాంత కన్వీనర్‌గా, గురజాడ ఆర్ట్స్ థియేటర్‌కు ఉపాధ్యక్షుడిగా, ది ట్రస్ట్ ఆఫ్ సర్వీస్ సంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. అక్షరాస్యత ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమగీతాలను రచించాడు. “బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్” పేరుతో ప్రతియేటా 20మంది పేదపిల్లలకు స్కాలర్‌షిప్పులతో పాటు అప్పుడప్పుడు పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, చెప్పులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
 
==క్రీడారంగం==
 
==సేవా రంగం==
==పురస్కారాలు, సత్కారాలు==
==మూలాలు==