శ్రీ కృష్ణదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
కృష్ణదేవ రాయలుకు [[తిరుమల దేవి]], [[చిన్నాదేవి]] ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల).<ref name=voices1>[http://books.google.com/books?id=PxvDNBc4qwUC&pg=PA118&lpg=PA118&dq=krishnadevaraya#v=onepage&q=krishnadevaraya&f=false Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William Joseph Jackson]</ref> కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=WS9uAAAAMAAJ&q=nagalamba Krishnadeva Raya: the great poet-emperor of Vijayanagara - G. Surya Prakash Rao]</ref> పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. [[ప్రతాపరుద్ర గజపతి]] ని ఓడించి, ఆయన కూతురైన [[తుక్కా దేవి]] ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.<ref>[http://books.google.com/books?id=QaIRAQAAMAAJ&q=krishnadevaraya+wives&dq=krishnadevaraya+wives Encyclopaedia of Indian Literature: K to Navalram - Amaresh Datta, Sahitya Akademi]</ref> చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు.<ref name=voices1/><ref>[http://books.google.com/books?id=1N5Hgos5mScC&pg=PA48&lpg=PA48&dq=krishnadevaraya+wives#v=onepage&q=krishnadevaraya%20wives&f=false Courts of Pre-Colonial South India By Jennifer Howes]</ref> కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం<ref>[http://books.google.com/books?id=5OQdAAAAMAAJ&q=tirumaladevi&dq=tirumaladevi Readings in South Indian history - T. V. Mahalingam]</ref> ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు [[1524]] లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు [[తిమ్మరుసు]] ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు [[చంద్రగిరి]] దుర్గమునందున్న సోదరుడు, [[అచ్యుత రాయలు]] ను వారసునిగా చేసాడు.
 
==మతము, కులము==
శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నవి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన [[తుళువ నరస నాయకుడు]] బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడు<ref>Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258 </ref> <ref>History: UGC-NET/SET/JRF (Paper II and III), 1/e - By Amitava Chatterjee</ref> అని కొన్ని రచయితల చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి. శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. కొన్ని పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు కురూబు యాదవుడని రచయితలు వ్రాశారు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణం లో మరియు శిలాశాసనాలలో లిఖించబడినది<ref>సర్దేశాయి తిరుమలరావు-ది హిందూ ఆంగ్ల దినపత్రిక</ref><ref>యాదవాభ్యుదయ వాఖ్య - అప్పయ్య దీక్షిత</ref><ref>నరసభూపాలియము - భట్టు మూర్తి</ref><ref>అచ్యుతరాయాభ్యుదయము - రాజనాథ కవి</ref><ref>వరదాంబిక పరిణయం - తిరుమలాంబ</ref><ref>స్వరమేధకళానిధి - రామయామాత్య తొదరమల్ల</ref><ref>బాలభాగవతం - కోనేరునాథ కవి</ref><ref>వసుచరితము - భట్టు మూర్తి</ref><ref>విజయనగర సామ్రాజ్య మూలములు - యస్. కృష్ణస్వామి అయ్యంగార్ - మద్రాసు విశ్వవిద్యాలయము, 1919</ref>.
 
==సమకాలీన సంస్కృతిలో==