సందేహం మార్చు

అయ్యా, యర్రా రామారావు గారూ! నేను సృష్టించిన బైబిల్ పుస్తకంలో సందేహాలు అనే వ్యాసాన్ని ఎందుకు తొలగించారో ఆధారాలతో సహా చెప్పగలరు.

శుభాకాంక్షలు మార్చు

భూపతిరాజు రమేష్ రాజు గారూ, తెలుగులో మీ సభ్యనామము మార్చుకొన్నందుకు శుభాకాంక్షలు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:26, 15 మార్చి 2013 (UTC)Reply

తెలుగు భాషపై అభిమానంతో మీ సభ్యనామము మార్చుకొన్నందుకు శుభాకాంక్షలు. తెవికీ లో మీ కృషికి అభినందనలు(  కె. వి. రమణ. చర్చ 11:03, 15 మార్చి 2013 (UTC))Reply

తెలుగు వికీ సమావేశం మార్చు

తెలుగు వికీపీడియా సర్వసభ్య సమావేశంలో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)Reply

కర్ణాటక (ర్నా కాదు) మార్చు

సరి చేయవలసింది గా మనవి.శశి (చర్చ) 13:16, 23 మార్చి 2013 (UTC)Reply

కలియుగ రాజవంశములు మార్చు

వికీసోర్సులో కోట వెంకటాచలం రచించిన s:కలియుగ రాజవంశములు పుస్తకాన్ని ఆర్కీవు నుండి కామన్స్ లోకి అప్‌లోడ్ చేశారు. ఆసక్తి కలిగితే ఒకసారి చూడండి. ఇందులో విలువైన సమాచారం ఉన్నది. ఒక 50 పేజీల చిన్న పుస్తకం కలియుగం లోని రాజుల వంశాల కాలనిర్ణయం గురించి వివరించారు.Rajasekhar1961 (చర్చ) 09:52, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply

చారిత్రక వ్యాసాలు మార్చు

రాజు గారూ, మూలాలతో సహా చక్కటి చారిత్రక వ్యాసాలు వ్రాస్తున్నారు. కొన్ని మూలాలను పలుచోట్ల ఉపయోగిస్తున్నారు కాబట్టి పేజీ సంఖ్యలు వగైరా ఇస్తే ఇంకా బాగుంటుంది. ఉదాహరణకు అచ్యుతదేవరాయలు వ్యాసం చూడండి --వైజాసత్య (చర్చ) 08:30, 4 ఏప్రిల్ 2013 (UTC)Reply

రమేష్ రాజు గారూ ! సమగ్రమైన ఆసక్తి కరమైన వ్యాసాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు వ్రాసిన కుక్కుట శాస్త్రం చాలా ఆసక్తి దాయకంగా ఉంది. t.sujatha (చర్చ) 16:34, 8 ఏప్రిల్ 2013 (UTC)Reply

ప్రత్యుత్తరం మార్చు

 
నమస్కారం భూపతిరాజు రమేష్ రాజు గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 04:44, 1 ఆగష్టు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం వైజాసత్య (చర్చ) 04:44, 1 ఆగష్టు 2013 (UTC)

పురస్కార ప్రతిపాదనకు సమ్మతి మార్చు

మిమ్మల్ని వికీపీడియా:2013 కొలరావిపుప్ర/భూపతిరాజు రమేష్ రాజు పేజీలో పురస్కారానికి ప్రతిపాదించాను. మీ సమ్మతి ఆ పేజీలో తెలియజేయగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 17:11, 3 డిసెంబర్ 2013 (UTC

ధన్యవాదములు! నేను సమ్మతిస్తున్నాను! (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 02:35, 5 డిసెంబర్ 2013 (UTC))

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం మార్చు

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:32, 13 డిసెంబర్ 2013 (UTC))

మీరు ఇటీవలి చేర్చిన బొమ్మల గురించి సలహా మార్చు

మీరు ఇటీవల చేర్చిన బొమ్మలలో కొన్ని దోషాలున్నాయి. అర్థ ధ్వనించే పేరు లేకపోవుట, సరియైన లైసెన్స్,సారాంశం లేదా సముచిత వినియోగ పెట్టెలు లేవు. కొత్తగా ప్రవేశపెట్టిన WP:FUW వాడితే బొమ్మ కు అవసరమైన వివరాలు (సూచనల ప్రకారం పూరించితే) చేరుతాయి. మీ బొమ్మల లైసెన్సులు ధృవీకరించబడి, మీ కృషి ఫలవంతమవుతుంది. గమనించండి. --అర్జున (చర్చ) 03:52, 25 డిసెంబర్ 2013 (UTC)


Non-free rationale for దస్త్రం:DSC00358.JPG మార్చు

 

Thanks for uploading or contributing to దస్త్రం:DSC00358.JPG. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 03:53, 25 డిసెంబర్ 2013 (UTC)

బొమ్మలు చేర్చుట మార్చు

కృతజ్ఞతలు అర్జునరావు గారూ! నేను ఏలూరులో కుక్కుట శాస్త్రానికి చెందిన పుస్తకం కొన్నాను. దాని కవర్ ని ఫొటో తీశాను. దయచేసి నేను అప్ లోడ్ చేసిన బొమ్మలు వ్యాసంలో చేర్చే విధానం చెప్పండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 14:05, 26 డిసెంబర్ 2013 (UTC))

  • మీరు అంటున్న బొమ్మ ఈ వ్యాఖ్యలో చేర్చాను.
దస్త్రం:DSC00358.JPG
కుక్కుటశాస్త్రం పుస్తకం ముఖపత్రము
ఈ విభాగం సవరించునప్పుడు కనబడే వికీకోడ్ నకలు చేసి వ్యాసం పేజీలో చేర్చండి. మరింత సమాచారం చూడండి.--అర్జున (చర్చ) 16:40, 26 డిసెంబర్ 2013 (UTC)

వికీప్రాజెక్టు సలహా మార్చు

మీరు తెవికీలో విస్తారంగా కృషి చేస్తున్నందులకు సంతోషం. మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్_ఆధారిత_నాణ్యతాభివృద్ధి లో చేరి మెళకువలు తెలుసుకొని వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచడానికి కృషి చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 06:07, 13 జనవరి 2014 (UTC)Reply

కొలరావిపు ప్రశంసాపత్రం మార్చు

  కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
భూపతిరాజు రమేష్ రాజు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో మతాలు, కులాల సంబంధ వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ మార్చు

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:14, 3 ఆగష్టు 2014 (UTC)

అనుభవం మార్చు

మీ అనుభవం మాకు ఆదర్శం కావాలి. ఈ మధ్యన మీరు వ్యాసములలో కాస్త ఆసక్తి తగ్గించినట్లున్నారు. మహాభారతంలో సమస్యలు కొత్తవి రాకుండా మీరు కాస్త జాగ్రత్తగా వాక్యములు నిర్మాణము చేయండి. క్రీస్తు వ్యాస విషయములో వ్రాయలేక చాలా చాలా ఇబ్బంది ఈ మధ్యన పడ్డారు. కానీ మీ వ్యాస ఆసక్తికి మాత్రము చాలా అభినందనీయము. JVRKPRASAD (చర్చ) 14:57, 17 ఫిబ్రవరి 2015 (UTC)Reply

ప్రసాదుగారూ! నిజమే! కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొద్దికాలంగా వ్యాసాలకు సరైన సమయం కేటాయించలేకపోతున్నాను. మీరు ఇచ్చిన సలహా నేను తప్పకుండా పాటిస్తాను. ధన్యవాదములు (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 05:35, 18 ఫిబ్రవరి 2015 (UTC))Reply

వ్యాసభాగాలు తొలగింపు మార్చు

వ్యాసభాగాలు తొలగింపు కార్యక్రమము మీరు చేపట్టారు. ఎందుకోసమో తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 15:00, 17 ఫిబ్రవరి 2015 (UTC)Reply

స్వాగతం మార్చు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

వికీలో అభ్యంతరకరమైన బొమ్మల విషయమై మార్చు

(సంభోగం వ్యాస చర్చ పేజీలో మీ అభిప్రాయ వ్యక్తీకరణ పట్ల నా స్పందన)వికీపీడియాలో పెద్దలు మాత్రమే చూడదగ్గ చిత్రాలను చేర్చడంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతూనేవుంది. ఆంగ్ల వికీపీడియా వికీపీడియాలో అటువంటి చిత్రాలు ఉండొచ్చు అని తీర్మానించుకుంది. దానికి అనేకానేక కారణాలతో పాటుగా కొన్ని దేశాల్లో పోర్న్ ఇంటర్నెట్ లో చేర్చడంపై నిషేధం లేకపోవడమూ ఒకటైవుంటుందని నా అనుకోలు. ఐతే భారతదేశంలో అంతర్జాలంలో నీలిచిత్రాలను చూడడాన్ని వదిలిపెట్టినా, అంతర్జాలంలో అభ్యంతరకరమైన సమాచారాన్ని చేర్చడంపై మాత్రం తీవ్రమైన నిషేధం ఉంది. మన వికీపీడియన్లలో చాలామంది భారతీయులే కనుక ఈ విషయాన్ని కొద్దిగా గమనింపులో ఉంచుకోవాలి. ఎలాగైతే కాపీహక్కుల చట్టాలను వివిధ దేశాలు, వివిధ సబ్ క్లాజుల స్థాయిలో అవగాహన కలిగివున్నామో ఈ విషయాన్ని కూడా అలాగే అవగాహన కలిగివుండాలి. ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి. మీరు భావించినట్టుగా వికీని కేవలం పెద్దలు మాత్రమే వినియోగించుకోవడం లేదు. నిజానికి పిల్లలు క్విజ్ పోటీల్లోనూ, వారికి ఇచ్చిన అసైన్ మెంట్లు చేయడంలోనూ విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.(అంతమాత్రాన ఆంగ్లవికీలో పోర్నోగ్రఫీ గురించిన నిర్ణయం ఏమత్రం బెసగలేదనుకోండి) ఇవన్నీ కాక భారతీయ సంస్కృతిలో ఇటువంటి ఫోటోలు, బొమ్మల పట్ల గత వందేళ్ళుగా అప్రకటిత నిషేధం కనిపిస్తూంటుంది. దాన్నంతటినీ మనం మన వికీపీడియా ద్వారా ఎదిరించలేము. ఇన్నింటిని దృష్టిలోవుంచుకుని తెవికీలో అశ్లీల చిత్రాలను చేర్చడంపై మీ కోణాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 12:47, 22 ఫిబ్రవరి 2015 (UTC)Reply

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు మార్చు

 

హలో భూపతిరాజు రమేష్ రాజు! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:16, 12 మార్చి 2015 (UTC)Reply

గౌరవ నీయులైన భూపతిరాజు రమేష్ రాజు గారు మీ రచనలు చూసాను. చాలా బాగున్నాయి. మీరు చాలా లోతుగా అధ్యయనం చేసారు.వారూ వీరు ఒకరో కాదో నాకు పూర్తిగా తెలియదు కానీ వారిని వీరిని , మధ్య యుగంలోనే గొల్లలు యాదవులు గా పరిగణించబడ్డారు కదా మరిప్పుడు ఇంకెందుకు వేరుగా చూడుటం. 1920 ల్లోనే యాదవ సభలు బాపట్ల లో జరిగాయని మీకు తెలియనిది కాదు. ఆ సభలలో గొల్లలు యాదవులు ఒకరేనని ఉత్తర భారత దేశ ప్రముఖులు చెప్పారు. అదీ కాక మొన్నీమధ్యే మన రాజధాని లో జరిగిన సభలలో కూడా అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొన్నారు . ఇంకా కాటమ రాజు ను 23 వ శ్రీ కృష్ణావతారం గా భావించారు. కాబట్టి వారు వీరు ఒక జాతి అని నా అభిప్రాయం. అయితే అందులో చాలా రకాలు ఉండి వుండ వచ్చు. దయచేసి గమనింప గలరు.

కావున మీరు గొల్ల వ్యాసమును మరలా మార్పులు -చేర్పులు చేస్తారని నమ్ముతున్నాను. గొల్ల లో రకాలు కూడా తెలియజేస్తారని విశ్వసిస్తున్నాను. అదే విధంగా పూజ గొల్లలు ఎర్ర గొల్లలకు వియ్యమందరని కూడా తెలియ జేస్తున్నాను. కావున మరియొక సారి పరిశీలించమని నా మనవి.


మీ ప్రత్యుత్తరానికి నా ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా ఈ వ్యాసానికి మార్పులు చేస్తాను. యాదవులు, గొల్లలు ఐకమత్యంగా ఉంటే మంచిదే. కాని ఇప్పటికీ ఉత్తర భారతదేశానికి చెందిన యాదవులకు దక్షిణభారత దేశానికి చెందిన గొల్లవారంటే చిన్నచూపు ఉన్నది. భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న తెగలు ఎన్నో ఉన్నవి. అందులోని యాదవ (Yadava) అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన ప్రాచీన తెగ. మధ్యయుగంలో సంస్కృత మహాభారత కావ్యాన్ని ఇతర రాష్ట్రాల భాషల్లోకి అనువదించినప్పుడు యాదవులను ఆయా రాష్ట్రాలకు చెందిన పశువుల కాపరుల వర్గాలను పేర్కొన్నారు. ఆ క్రమంలో తెలుగు కవులు సంస్కృత మహాభారత కావ్యాన్ని తెలుగు భాషలోకి అనువదించినప్పుడు స్థానికత ప్రతిబంబించేలా యాదవులను గొల్లవారిగా పేర్కొన్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గొల్లవారు తాము యాదవులమని నమ్ముతారు. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్ సౌకర్యం కోసం దేశవ్యాప్తంగా పశువులను మేపుకొని జీవనాధారంగా ఉన్న తెగలను యాదవ వర్గంగా పరిగణించింది. ఫలితంగా యాదవ-గొల్ల ఉపకులము కూడా ఏర్పడినది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. గోత్రాలు, ఆచార వ్యవహారాల్లో యాదవులకు గొల్లలకు ఎటువంటి సంబంధమూ లేదు. ఏమైనా యాదవులు గొల్లలు ఒక్కరు కాదనే మాట మాత్రం నిజం అని నా గట్టి నమ్మకం. వారి వృత్తి ఒకటే అయినా జాతులు వేరు. వృత్తి ఒకటే అయినప్పుడు ఒక్కరేనన్న భావన కలుగడం సహజం. అందువల్ల అఖిలేశ్ యాదవ్ గారు కూడా కాటమరాజు ను 23 వ శ్రీ కృష్ణావతారం గా భావించియుండవచ్చును. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 07:08, 18 మార్చి 2015 (UTC))Reply

దయచేసి గమనింప గలరు మార్చు

మీరు గమనించినందుకు నా ధన్యవాదాలు. అఖిలేశ్ యాదవ్ గారు కాదు చెప్పింది, చరిత్ర లో వున్నది అని చెప్పాను( కాటమ రాయుని చరిత్ర ) కానీ మీరు ఇంకోలా అర్థం చేసుకొన్నారని నా విన్నపం. ఇంకా శ్రీ కృష్ణ దేవ రాయలు కురుబ వంశస్తుడని తెలిసినదే(పారిజాతాపహరణం). ఆయన కూడా యాదవ వంశానికి సూర్యుని వంటి వాడిని అని చెప్పి ఉన్నారు. ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొ రకంగా పిలవటం సహజమే అని నా అభిప్రాయం(బలిజ, కాపు, తెలగ, నాయుడు). అలా అని ఉత్తర భారత దేశం లోని వారు వీరు ఒకరు అని నే చెప్పేటంత చరిత్ర నాకు తెలియదు. కానీ ప్రాచీన కాలంలో వారిని వీరిగా పిలిచారని మాత్రం చెప్పగలనండి. ఇంకా దేవగిరి యాదవులు కూడా తెలంగాణా ప్రాంతమును పాలించారు. వారి తరువాతి తరం వారు ఇంకా ఇక్కడ ఉన్నారని నా అభిప్రాయం. అయితే అన్ని రకాల పశు పాలకుల కులాలను యాదవులు అనలేము కానీ, గొల్ల లో కొన్ని రకాలు యాదవులు అనే నా అభిప్రాయం(పూజ్య ). యెర్ర గొల్ల పూజ్య గొల్ల ఒకటి కాదు. పూజ్య గొల్ల వారు యర్ర గొల్లవారికి వియ్యాలు జరగవని తెలియజేయుచున్నాను. కుదిరితే మీరింకొంచెం పరిశోధన చేసి వివరంగా తెలియజేయగలరని నా మనవి. ఏదేమైనా మీ వ్యాసాలు చదివితే మీరు పరిశోధన బాగా చేశారని అనుకుంటున్నాను.

ధన్య వాదాలు

నమస్కారం! మంచి సమాచారం ఇచ్చారు. కాని దేవగిరి యాదవులు, గొల్లవారు ఒక్కటి కాదని నా అభిప్రాయం. దానికి కారణం గొల్లవారికి యాదవుల గోత్రాలు లేకపోవడమే. మీకు ఏమైనా తెలిసియుండివుంటే పోస్ట్ చేయండి. మంచిది. చక్కగా ఇలా చర్చించుకొనే కొలదీ ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇక శ్రీకృష్ణ దేవ రాయలు యొక్క తండ్రి తుళువ నరసనాయకుడు (1491-1503 CE) బంట్ అనే నాగవంశపు కులానికి చెందినవాడు అని పరిశోధనలు చెబుతున్నాయి (Prof K.A.N. Sastri, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, pp 250,258). అయితే దేవగిరి యాదవులే బంట్ లు అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. వీలైతే మరింత పరిశోధనలు చేస్తాను. మీరు కూడా మెసేజ్ పోస్ట్ చేసిన తరువాత మీ పేరు వ్రాయండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 12:50, 2 ఏప్రిల్ 2015 (UTC))Reply

వివరణ మార్చు

పూర్వం నుంచే దక్షిణ భారత దేశంలోని గొల్లలను,(కురుబులను), యాదవులుగా పరిగణిస్తున్నారు. మీరు కాటమ రాయుని చరిత్ర(12 వ శతాబ్దం) చదివిన యెడల అప్పటికే గొల్లలను యాదవులుగా చెప్పారు. ఇంక ప్రస్తుతం సర్టిఫికెట్ మీద యాదవ అని మాత్రమే ఉంటుంది. కాని మీరు ఒకటి కాదు గోత్రాలు వేరు అంటున్నారు. వారు వీరు వేరు అవునో కాదో పక్కన పెడితే వీరిని ప్రభుత్వ లెక్కల ప్రకారం యాదవులుగానే పరిగణిస్తున్నారు కాబట్టి దక్షిణ భారత దేశ యాదవులుగా రాయమని నా విన్నపం. శ్రీ కృష్ణ దేవరాయలు(15 వ శతాబ్దం) గారు కూడా కురుబ(గొల్ల) అయినా, యాదవుడని చెప్పుకొన్నాడు. కావాలంటే పారిజాతపహరణం చదవండి.( అందు 19 వ పద్యం అనుకుంటున్నా,ఒక శిలా శాసనంలో ఆయనే "నేను యాదవ వంశానికి సూర్యుని వంటి వానినని" చెప్పెను. )కావున ఆ కాలంలోనే వీరు యాదవులుగా పరిగణించారని నేను చెప్ప దలుచుకున్నాను .మీరు మారుస్తారని ఆశిస్తున్నాను. రాజు గారు గొల్ల , యాదవ ఒకటి కాదు అని మీరు అన్నారు. కాని మీరు ఒకసారి వీటిని గమనించగలరని ఆశిస్తున్నాను.

Jassal, Smita Tewari; École pratique des hautes études (France). Section des sciences économiques et sociales; University of Oxford. Institute of Social Anthropology (2001). "Caste in the Colonial State: Mallahs in the census". Contributions to Indian sociology

Swartzberg, Leon (1979). The north Indian peasant goes to market. Delhi: Motilal Banarsidass. p. 11. Retrieved 7 October 2011. Quote: "As far back as is known, the Yadava were called Gowalla (or one of its variants, Goalla, Goyalla, Gopa, Goala), a name derived from Hindi gai or go, which means "cow" and walla which is roughly translated as 'he who does'."


Bayly, Susan (2001). Caste, Society and Politics in India from the Eighteenth Century to the Modern Age. Cambridge University Press. p. 84. ISBN 978-0-521-79842-6. Retrieved 7 October 2011. Quote: "They had many counterparts elsewhere, most notably in the Gangetic plain where users of titles like Ahir, Jat and Goala turned increasingly towards the cow-cherishing rustic piety associated with the cult of Krishna. With its visions of milkmaids and sylvan raptures, and its cultivation of divine bounty in the form of sweet milky essences, this form of Vishnu worship offered an inviting path to 'caste Hindu' life for many people of martial pastoralist background.42 Footnote 42: "From the later nineteenth century the title Yadav was widely adopted in preference to Goala. ..." www.en.wikipedia.org/Yadav అందులో యాదవ్ అనేది గొల్లా , ఆహిర్ , కురుబ అని చెప్పారు. ఉత్తర భారత దేశంలో గోల అనే పదం యాదవులకు వాడుతారు

గొల్లలను బ్రిటిష్ కాలంలోనే రికార్డుల్లా యాదవులుగా మార్చారు. రిజర్వేషన్స్ సమయంలో కాదు. మీరు చూసిన "www.yadav gotra list" మీరు గొల్లలు యాదవులు ఒకటి కాదని అన్నారు. కాని వారు గొల్ల గోత్రాలను కూడా పొందు పరిచారు

andhrapradesh history by cave animations video చూడండి మీకు అర్థమవుతుంది. అన్దులో వింధ్య పర్వతాఅల నుంచి వచ్చిన ఆర్యులే ప్రస్తుతం ఆంధ్రదేశం లోని వారని మీకు తెలుస్తుంది. వారు ఇక్కడి ద్రవిడులతో కలిసి పోయారు. ఇంకా వెస్ట్ మరియు ఉత్తర భారత దేశంలో యాదవులను గోల అంటారని " " రాసి ఉన్నది.

Yaduvanshi - Descendants of Yadu
  • Nandvanshi - Descendants of Nanda (Ahirs)
  • Gwalvanshi - Descendants of Holy Gwals (Original word Gaur becomes Gwar and then Gwal)

(from yadav history) (యాదవుల లో అనేక రకాలు గలవు. )

యాదవ గోత్రాలలో అక్షితల, ఆరుద్ర, గున్వాల, గుమ్మ(గుమ్మి), గావ్లి(గొల్ల), పీట్ల, తాట్ల, వల్లభాల(వల్లబల) గోత్రాలు కలవు.గమనించగలరని మనవి. 1920 ల్లోనే యాదవ సభలు బాపట్ల లో జరిగాయని మీకు తెలియనిది కాదు. ఆ సభలలో గొల్లలు యాదవులు ఒకరేనని ఉత్తర భారత దేశ ప్రముఖులు చెప్పారు.

ముద్ది రాజులు అనగా కౌరవులు అని ఒక చోట చదివాను. వారు యయాతి ముసలితనం పొందడం వలన వారికి ఆ పేరు వచ్చింది అని రాశారు. మీకు ఉపకరిస్తుందని అనుకొంటున్నాను

సాంకేతిక లోపం మార్చు

 Y సహాయం అందించబడింది

నా వికీపిడియా సాంకేతిక పదం పనిచేయుటలేదు, అందువల్ల లాగిన్ అవ్వలేకపోతున్నాను. దయచేసి వికీపిడియావారు నా సమస్యను పరిష్కరించగలరు. - భూపతిరాజు రమేష్ రాజు

మీ కంప్యూటర్ లో ఏవైనా మార్పులు జరిగిన తరువాత ఈ సమస్య ఎదురైనదా?. మీరు ఖాతా సృష్టించినపుడు ఈమెయిల్ చేర్చివుంటే , మీకు కనబడే తెరపై Forgot password లాంటిది నొక్కటం ద్వారా, మీ కు కొత్త పాస్వర్డ్ వికీపీడియా ఈమెయిల్ ద్వారా పంపిస్తుంది. అది వాడి మీరు ప్రవేశించి పాస్ వర్డ్ మార్చుకోవచ్చు. వేరే కంప్యూటర్ కూడా వాడి ప్రయత్నించవచ్చు. మీరు ఈ మెయిల్ చేర్చనట్లైతే కొత్త ఖాతా పెట్టుకోవటమే పరిష్కారం--అర్జున (చర్చ) 06:13, 28 మార్చి 2015 (UTC)Reply

అర్జునగారూ! నా అకౌంట్ లాక్ చేయబడింది. బహుశా ఎవరో కావాలని అసూయతో నన్ను నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారని నా అనుమానం. దయచేసి నాకు నా వాడుకరిపేజీతో అనుసంధానం చేయండి. కనీసం తాత్కాలిక సాంకేతిక పదంతో కూడా లాగిన్ అవ్వలేకపోతున్నాను - భూపతిరాజు రమేష్ రాజు. నా వాడుకరి పేజీ లింకు: https://te.wikipedia.org/wiki/వాడుకరి:భూపతిరాజు_రమేష్_రాజు

మీ సభ్యపేజీని పరిశీలించాను. మీపై ఎలాంటి నిరోధం విధించబడలేదు. BlockListలో కూడా మీ పేరు లేదు. మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏ హెచ్చరిక వస్తుందో స్క్రీన్ షాట్ పంపండి. పరిశీలించడానికి వీలుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:00, 28 మార్చి 2015 (UTC)Reply

కాంతారావుగారూ! ధన్యవాదాలు! బహుశా ఏదైనా సాంకేతిక లోపం అయివుంటుంది. నేను ఇప్పుడు లాగిన్ అవ్వగలిగాను. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 01:34, 30 మార్చి 2015 (UTC))Reply

వాడుకరి లాగిన్ అవ్వగలిగినందున "సహాయం కావాలి" ముసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణ 16:32, 31 మార్చి 2015 (UTC)Reply

మరలా నా వికీపిడియా సాంకేతిక పదం పనిచేయుటలేదు, అందువల్ల లాగిన్ అవ్వలేకపోతున్నాను. దయచేసి వికీపిడియావారు నా సమస్యను పరిష్కరించగలరు. - వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు

"The Gollas," Mr. H. A. Stuart writes,* " are the great pastoral caste of the Telugu people. The traditions of the caste give a descent from the god Krishna, whose sportings with the milk maids play a prominent part in Hindu mythology.

Mr. Stuart writes further *

that " the social status of the Gollas is fairly high, for they are allowed to mix freely with the Kapu, Kamma, and Balija castes, and the Brahmans will take buttermilk from their hands. They employ Satanis as their priests. In their ceremonies there is not much difference between them and the Kapus. The name Golla is generally supposed to be a shortened form of Sanskrit Gopala " (protector of cows). The Gollas also call themselves Konanulu, or Konarlu, and, like the Tamil Idaiyans, sometimes have the title Konar. Other titles in common use are Anna, Ayya, and occasionally Nayudu.


gave their name to Golgonda, and built the forts, of which traces still survive in those parts ". Each Telugu New Year's day, it is stated, Gollas come across from Godavari, and go round the Golla villages, reciting the names of the progenitors of the fallen line, and exhibiting paintings illustrative of their overthrow.


Of the various sub-divisions, the Puja Gollas claim superiority over the others. Their origin is traced to Simhadri Raju, who is supposed to have been a descend- ant of Yayathi Raja of the Mahabaratha. Yayathi had six sons, the last of whom had a son named Kariyavala, whose descendants were as follows :

Penubothi (his son), Avula Amurthammayya,

Kalugothi Ganganna,

I OH Raju,

Simhadri Raju.

!

Peddi Erunuka Noranoka P5H

Raju. Raju. Raju, Raju.

The Gollas are believed to be descended from the four last kings. 11-19 B


GOLLA 292

According to another legend, there were five brothers, named Poli Raju, Erranoku Raju, Katama Raju, Peddi Raju, and Errayya Raju, who lived at Yellamanchili, which, as well as Sarvasiddhi, they built. The Rajas of Nellore advanced against them, and killed them, with all their sheep, in battle. On this, Janaga- mayya, the son of Peddi Raju, who escaped the general slaughter, made up his mind to go to Kasi (Benares), and offer oblations to his dead father and uncles. This he did, and i _the gods were so pleased with him that they transported him in the air to his native place. He was followed by three persons, viz., (i) Kulagentadu, whose descendants now recite the names of the progenitors of the caste ; (2) Podapottu (or juggler), whose descendants carry metal bells, sing, and produce snakes by magic ; (3) Thevasiyadu, whose descendants paint the events which led to the destruction of the Golla royalty on large cloths, and exhibit them to the Gollas once a year. At the time when Janagamayya was translated to heaven, they asked him how they were to earn their living, and he advised them to perform the duties indicated, and beg from the caste. Even at the present day, their descendants go round the country once a year, after the Telugu New Year's day, and collect their dues from Golla villages.

By religion the Gollas are both Vallamulu (Vaishna- vites) and Striramanthulu (Saivites), between whom marriage is permissible. They belong to the group of castes who take part in the worship of Ankamma. A special feature of their worship is that they place in a bamboo or rattan box three or four long whip-like ropes made of cotton or Agave fibre, along with swords, sandals and idols. The ropes are called Virathadlu, or heroes' ropes. The contents of the box are set beneath

ఇది మీరైనా రాయయండి లేదా నేనైనా సవరిస్తాను. D.VENKATRAO

ప్రత్యుత్తరం మార్చు

నమస్కారం వెంకటరావు గారూ! మీరు ఇచ్చిన సమాచారంలో కొన్ని విలువైన పాయింట్లు ఉన్నాయి. వాటిని తప్పక చేరుస్తాను. కృష్ణదేవరాయులు 'పారిజాతపహరణం'లో అతని ముత్తాత యయాతి వంశస్తుడని చెప్పుకున్నాడు, నిజమే. కాని కృష్ణదేవరాయులు కురూబ గొల్ల అని చెప్పడానికి మాత్రం సరైన ఆధారాలు లేవు. ఎందుకనగా ఆయన తండ్రియైన తుళువ నరస నాయకుడు బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడు అని పలు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. బంట్స్ నేటికీ నాగవంశపువారని చెప్పుకుంటారు. కొన్ని సాహిత్య పుస్తకాలు కృష్ణదేవరాయలు చంద్రవంశపు క్షత్రియుడని చెబుతున్నాయి. నా అభిప్రాయం ప్రకారం చరిత్ర పుస్తకాలతో పోలిస్తే సాహిత్య పుస్తకాల్లో కల్పితం ఎక్కువ వుంటుంది.

దేశవ్యాప్తంగా పశువులను, గొర్రెలను మేపుకొనే తెగలు చాలా ఉన్నాయి. దక్షిణభారతదేశంలో గొల్ల అనేది ఒక తెగ., అలాగే ఉత్తర భారతదేశంలో యాదవ అనేది ఒక తెగ. దేశవ్యాప్తంగా గోపాల, కురూబ, గావ్లి, లింగాయతులు ... ఇలా ఎన్నో తెగలు ఉన్నాయి. ఈ తెగల వృత్తి ఒకటే. అందువలన వీరందరూ ఒకటే అన్న భావన కలుగుతుంది. ఇక అక్షితల, ఆరుద్ర, గున్వాల, గుమ్మ(గుమ్మి), గావ్లి(గొల్ల), పీట్ల, తాట్ల, వల్లభాల(వల్లబల) వగైరా గోత్రాలు గొల్లవారికి చెందినవి. అసలైన యాదవులవి కావు. ఈ గోత్రాలను ఇప్పటికీ ఉత్తర భారతదేశపు యాదవులు అంగీకరించరు.

మధ్య యుగాల్లోనే సంస్కృత మహాభారత కావ్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించారు. అందువలన ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న పశువులను, గొర్రెలను మేపుకొనే కులాలవారు తాము యాదవులుగా భావించుకున్నారు, ఇతర దేవతలతో పాటూ శ్రీకృష్ణుడిని కూడా ఆరాధిస్తున్నారు. అందువలన కేవలం శ్రీకృష్ణదేవరాయలే కాదు, బ్రిటీషువారు కూడా గొల్లవారిని యాదవుల వంటివారిగా భావించుకున్నారు. అచ్చు యాదవులు శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధిస్తారు. పైపెచ్చు మహాభారత కావ్యము క్రీస్తు పూర్వం సుమారు 500 సంవత్సరాల్లో వ్రాయబడిన ఒక సాహిత్యం మాత్రమే, చరిత్ర కాదు. మతంలోని గట్టి విశ్వాసాల వలన సాహిత్యం కూడా చరిత్రగా అనిపిస్తుంది.

జాతులు వేరే అయినా వృత్తి ఒకటే ఉన్నప్పుడు ఒక్కరే అన్న భావన కలుగడం సహజం. అలాగే యాదవులు, గొల్లవారు ఒక్కటే అన్న భావన కలుగడం సహజం, తప్పుకాదు. స్థానికతను (Nativity) ప్రతిబంబించేలా తెలుగు అనువాద మహాభారత కావ్యంలో యాదవులను గొల్లవారిగా పేర్కొనియుండవచ్చును. ఉదాహరణకు తెలుగు అనువాద బైబిలులోని క్రొత్తనిబంధనలో మత్తయి సువార్తలో గొల్లవాడు అనే పదము కనిపిస్తుంది. శంకరనారాయణ తెలుగు నిఘంటువులో Sherpard ఆన్న పదానికి గొల్లవాడు అని కనిపిస్తుంది. ఇంగ్లీషు వికీపిడియాలో Golla(caste) అని టైప్ చేసి చూడండి. తరువాత kuruba, gavli, Ahirs అని కూడా టైప్ చేసి చూడండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 04:24, 7 ఏప్రిల్ 2015 (UTC))Reply

ధన్యవాదాలు మార్చు

మీరు పొరబడుతున్నారు. ఎటువంటి ఆధారాలు చూపించకుండానే వారు మారుస్తారా చెప్పండి.బైబిల్ లో ఉన్దని అన్నిచోట్ల అలానే ఉంతుందా చెప్పండి. మీకు ఇప్పటికే నాకు తెలిసినటువంటి కొన్ని ఆధారాలు చూపించాను. మీరు ఇప్పటికైనా నే రాసిన దానిని ఎడిట్ చేయవలదని నే మనస్పుర్తిగా కోరుకుంటున్నాను. మా సర్టిఫికట్ లోనే వున్నది యాదవ ,అది పేరు చివర తగిలించుకోవటం, తగిలించుకోవ పోవటం వారిష్టం, దానిలో తప్పేముంది. స్థానికతను (Nativity) ప్రతిబంబించేలా తెలుగు అనువాద మహాభారత కావ్యంలో యాదవులను గొల్లవారిగా పేర్కొనియుండవచ్చును అని మీరు మాత్రమే భావిస్తున్నారు మీకు ఇంకా అనుమానాలు ఉంటే "www.yadavhistory.com" ఒకసారి చూడండి. మహభారతం కల్పితం కానే కాదు అని నేనొక్కడినే కాదు హిందువులందరు నమ్ముతున్నారు. దానిని కేవలం సాహిత్యం లాగా చూడటం తగదని నా విన్నపం. .D.VENKATRAO

  • ఇక సెలవు

ధన్యవాదాలు.

వెంకట్రావుగారూ! క్రీస్తు పూర్వం భారతదేశ చరిత్రకు చాలావరకూ సరైన ఆధారాలు లేవు. ఎవరు ఏం చెప్పినా అది అభిప్రాయమే అవుతుంది. అది నేను చెప్పినా, మీరు చెప్పినా. అందుకే పలువురు రచయితలు రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా యాదవ అనేది ఉత్తరభారత దేశానికి చెందిన Pastoral Caste అనేది సత్యం, అలాగే గొల్ల అనేది దక్షిణ భారతదేశపు Pastoral caste అనేది సత్యం. ఒక వృత్తి ఒకే జాతి చేయాలని లేదు. ఒకే వృత్తి జీవనాధారంగా కలిగియున్న జాతులు ఎన్నో ఉండవచ్చును. రెండు భిన్న జాతులవారి వృత్తి ఒకటే అయినప్పుడు ఆ జాతులు ఒక్కటే అన్న భావన కలుగడం సహజం. నాకు తెలిసియున్నంతవరకూ యాదవులకు, గొల్లవారికి గోత్రాలు common గా లేవు. అది మీకూ తెలుసు. గోత్రాలు ఒకటే అయినప్పుడు ఒక్కరే అనుకోవచ్చును. బహుశా యాదవులకు, గొల్లవారికీ మధ్య కులాంతర వివాహాలు జరిగియుండవచ్చును. ఈ సువిశాల భారతదేశంలో Pastoral caste ఒకటే ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు?. ఈ దేశంలో చాలా Pastoral castes ఉన్నాయండి. ఆ తెగలు కూడా యాదవుల చేసే వృత్తే. యాదవులు మహాభారతంలో పేర్కొనబడుటచేత ప్రఖ్యాతినొందారు. సంస్కృత మహాభారతంలో పేర్కొనబడ్డ యాదవులు తెలుగు అనువాద మహాభారతంలో గొల్లవారిగా భావించబడ్డారు. తెలుగు అనువాద బైబిలులోని క్రొత్తనిబంధనకు చెందిన మత్తయి సువార్త 25:32 లో గొల్లవాడు అనే పదము కనిపిస్తుంది. శంకరనారాయణ తెలుగు నిఘంటువులో Sherpard, Herdsman అను పదాలకు గొల్లవాడు అను అర్ధము కనిపిస్తుంది. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

మహాభారత కావ్యము సుమారు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల్లో , అనగా వేదకాలం (2000 B.C- 1000 B.C) తర్వాత వ్రాయబడింది. రామాయణమైనా, మహాభారత మైనా కుటుంబవ్యవస్త పటిష్టతకు, మానవుడు సన్మార్గంలో పయనించడానికి వ్రాయబడిన సాహిత్యాలే. మీరు చెప్పిన అభిప్రాయాలు, నా అభిప్రాయాలు కలిపి ఈ వ్యాసంలో చేరుస్తాను. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 12:04, 8 ఏప్రిల్ 2015 (UTC))Reply

ధన్యవాదాలు. మార్చు

మీ పరిశోధన బాగున్నది. కానీ ఒక చిన్న విన్నపము అంధంక అనునది రాక్షస తెగ కాదు. ధన్యవాదాలు......... D.VENKATRAO

ధన్యవాదాలు... నేను తప్పక పరిశోధిస్తాను... Andhaka అని గూగిల్ లో టైప్ చేసి ఇంగ్లీషు వికీపిడియాలో చూశాను... అందుకని పోస్ట్ చేశాను... మరొక్కసారి పరిశీలిస్తాను. మీకు ఏమైనా తెలిస్తే ఇక్కడ చెప్పండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 16:15, 10 ఏప్రిల్ 2015 (UTC))Reply

ధన్యవాదాలు. మార్చు

D.VENKATRAO...

వెంకట్రావు గారూ! నేను పోస్ట్ చేసిన వ్యాసంలో మీరు ఏ భాగాన్నైనా తొలగిస్తే దయచేసి దానికి తగిన బలమైన కారణం చర్చా పేజీలో పేర్కొనండి. వికీపిడియాలోకి లాగిన్ అయ్యి చేయండి. వికీపిడియావారి ప్రమాణాల ప్రకారం ఏ వ్యాసాన్నైనా తటస్థంగా వ్రాయాలి. ప్రపంచ విజ్నానాన్ని తెలియచేయడమే వికీపిడియా వారి ధ్యేయం. వికీపిడియా అనేది రచయితల మధ్య జరిగే యుద్ధ భూమి కాదు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 12:09, 14 ఏప్రిల్ 2015 (UTC))Reply


వివరణ మార్చు

రమేష్ రాజు నేను మీకు అదే చెప్ప దలుచుకున్నాను. అంధక అనునది యాదవ జాతికి సంబంధించిన ఒక తెగ అని మీరే "యాదవ" వ్యాసం లో రాసి ఉన్నారు. మళ్ళీ మీరే ఒకటి కాదు అంటున్నారు. ఒక సారి సరి చూడండి. ఇంకా, you have to visit once yadav history.com. I always login with my account. You should always does believe in history. If you have the proofs do you have that yadavs not have Andhak has their sub-group. Then please add them to here. Thanks s. D.VENKATRAO...

అంధకుడు అనేది పురాణ సాహిత్యంలో ఒక పాత్ర. పురాణాలు చరిత్ర కాదు, సాహిత్యం మాత్రమే. సరిగా తెలియని చరిత్రను మీరైనా, నేనైనా అభిప్రాయాలుగానే వ్రాయాలి. కాని లాజిక్ గా ఆలోచిస్తే దేశమంతటా ఒకే Pastoral caste ఉండదు. ఒక వృత్తిని ఒకే తెగ కాదు, ఎన్నో తెగలు చేపట్టే అవకాశమున్నది. వివిధ తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలు ఒకే జాతికి చెందినవారని నమ్మడం సహజం. యాదవులు సంస్కృత మహాభారత కావ్యంలో పేర్కొనబడ్డారు కనుకనే Pastoral castes లో గొప్పవారిగా పరిగణించబడ్డారు. అందువలనే దేశంలో ఉన్న చాలా Pastoral castes యాదవులను తమ పూర్వీకులుగా విశ్వసించడంలో ఆశ్చర్యం లేదు. గోత్ర గృహనామ ఆచార వ్యవహారాల్లో ఇతర Pastoral castes కి యాదవులతో సంబంధం లేదు. అందువల్ల వృత్తి పరంగా గొల్లవారు యాదవులవంటివారే తప్ప యాదవులు కారని నా అభిప్రాయం. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 06:53, 15 ఏప్రిల్ 2015 (UTC))Reply

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం మార్చు

 
ఇటీవల వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:23, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

బైబిల్ పుస్తకంలో సందేహాలు మార్చు

ముఖ్యమైన క్రైస్తవ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదములు , మీ కృషి అబినందనీయము.మరికొన్ని సందేహములను చేర్చవచ్చా? దయచేసి చెప్పగలరు,Muraliyelle (చర్చ) 05:44, 10 డిసెంబరు 2015 (UTC)Reply

సందేహాలు మార్చు

భూపతిరాజు గారు , సంస్కృతంలోని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు ఉత్తర భారతానికి చెందిన యాదవ తెగ తెలుగువారికి గొల్లలుగా పరిచయం చేయబడినది గాని నిజానికి యాదవులు వేరు గొల్లలు వేరు అని చాల మంది చరిత్రకారులు అన్నారని మీ వ్యాసాలలో పేర్కొన్నారు .నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి .వాటిని మీ ముందుంచుతున్నాను, వాటికీ సవివరముగా,ససాక్ష్యముగా మీ అభిప్రాయాలను తెలుపగలరు.

దక్షిణ భారతదేశంలో అనాది కాలమునుండి యాదవులుగా సంభోదించుకుంటున్న కులమేది?== (చారిత్రిక సాక్ష్యాలతో తెలుపగలరు.) 2.శ్రీకృష్ణదేవరాయలు నాగ వంశానికీ చెందిన బంటు కులానికి చెందిన వారని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుతున్నట్లు మీ శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యాసములో వ్రాసినారు .ఏ చరిత్ర నిర్మాణానికైనా శాసనాలు మరియు సమకాలీన సాహిత్య ఆధారాలు ప్రామాణికమవుతాయా లేక ఇప్పుడు ఆధారాలు లేకుండా ఎవరో ఏదో ఒకటి వ్రాస్తే అది ప్రామాణికమతుందా? 3.గొల్ల అనేది గ్వాలా(gwala) ,గోల(goala) అనే సంస్కృత లేక దానితో సంబందించిన భాష ల నుండి వచ్చిన పదమైన నప్పుడు గొర్ల ,గొడ్ల వంటి పదాల నుండి వచినదిగా మీరు ఎలా ప్రయత్నిస్తున్నారు. భాష శాస్త్రవేత్తల నుండి వివరణ తీసుకున్నారా? సిహెచ్. వెంకటేశ్వర్లు

సమాధానం మార్చు

నమస్కారం వెంకటేశ్వర్లు గారూ!ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు!

"మరి కొద్దిమంది గొడ్లవారు, గావ్లి, గుర్లవారు అనే పదాలనుండి గొల్ల అనే పదం వచ్చిందని అంటారు." అనునది ఎవరో పోస్ట్ చేశారు. అది అభిప్రాయమే కాబట్టి నేను దాన్ని డిలీట్ చేయలేదు. నేను వ్రాసింది మాత్రం -

" వృత్తి పరంగా గొల్లవారు సంస్కృత మహాభారత కావ్యంలోని యాదవులవంటివారని, వారు కాపు, కమ్మ, మరియు ఇతర బలిజ కులస్తులతోను కలిసిపోతారని, గొల్లవారి ఆచారవ్యవహారాలు కాపు వర్గాలవారివలే ఉంటాయని, గోపాల అను సంస్కృత నామ పొట్టి రూపమే గొల్ల అని చరిత్రకారుడు H.A Stuart అభిప్రాయపడ్డారు. అయితే దేశమంతటా ఒకే Herding తెగ ఉండదని, దేశవ్యాప్తంగా ఎన్నో Herding తెగలు ఉన్నాయని, ఆ తెగలను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారని, వివిధ తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజమని, అందువల్ల గొల్లవారు కూడా ఇతర Herding తెగలవారివలే సంస్కృత మహాభారతములో పేర్కొనబడ్డ యాదవులను తమ పూర్వీకులుగా భావించుకున్నారని, అందువల్ల గోత్ర, గృహనామ, ఆచారవ్యవహారాల్లో యాదవులతో సంబంధం లేకున్నా గొల్లవారు వృత్తిపరంగా యాదవులవంటివారే గాని జాతిపరంగా యాదవులు కారని పలువురి రచయితల అభిప్రాయం."

ధక్షిణ భారతంలో యాదవులు అని పిలుచుకుంటున్నది,పిలవబడుతున్నది గొల్లలే అనేది మీ stuart గారి వాధనే రుజువు. మహాభారత రచనా కాలాని కంటే ముందే పశు పాలకులైన యధు గణాలు విధ్య పర్వతాలు దాటి పశ్చిమ దిశగా మహారాష్త్ర గుండా ,తూర్పు దిశగా ఒరియ ప్రాంతం గుండా ధక్షిణ భారతానికి వచ్చినట్లు ప్రాచీన వాఙ్మయంలో నమోదైనది.ఉదాహరణకి తమిళ సంగమ వాఙ్మయం. ఈనాటి క్షత్రియ కులానికి మూలం గొల్ల కులం అనేది పరిశీలించి తెలుసుకోగలరు.(సిహెచ్.వేంకటేశ్వర్లు. )

STUART గారు అభిప్రాయపడ్డారు. రుజువు ఛేయలేదు. దానికి ప్రధాన కారణం పైన నేను చెప్పినది. క్షత్రియ కులాలకు మూలం గొల్లవారు కాదు. క్షత్రియ కులాలకు (ఆంధ్ర క్షత్రియులైనా, రాజస్థాన్ రాజపుత్రులైనా) గోత్రాలు బ్రాహ్మణులకున్నట్లే సప్తఋషులు, వారి ప్రవరల పేర్లతో ఉంటాయి. ఇతర కులాలవారికి అవిలేవు. (117.248.64.94 06:05, 11 మే 2016 (UTC))Reply

వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు మరియు IPతో రాస్తున్న సిహెచ్.వేంకటేశ్వర్లు గారికి వ్యాసానికి సంబంధించిన చర్చలు ఆ వ్యాస చర్చాపేజీలోనే (చర్చ:గొల్ల లేక చర్చ:యాదవ ) వుంచటం మంచిది. అలా చేయటం వలన భవిష్యత్తులో దిద్దుబాటు చేసేవారికి మొత్తం చర్చలు సునాయాసంగా తెలుస్తాయి. దయచేసి ఇకనుండి ఈ చర్చలు ఆ వ్యాసపు చర్చాపేజీలో చేయండి.చర్చలో వాడుకరి పేరుకి లింకు ఇవ్వడం ద్వారా వారికిసూచన అందుతుంది. అలాగే ఇతరుల సహాయం కోరటానికి {{సహాయం కావాలి}}మూస చేర్చితే సరిపోతుంది. సిహెచ్.వేంకటేశ్వర్లు గారికి ,ఖాతాతో రాసి సంతకం చేస్తే చర్చలు సమర్ధవంతంగా జరుగటానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 04:12, 7 మే 2016 (UTC)Reply

యాదవ గొల్ల ఒక్కటే మార్చు

ఎన్ని సార్లు చెప్పినా మీరు వినరు. నాకు అర్థమయింది............................................. 1920 ల్లోనే యాదవ సభలు బాపట్ల లో జరిగాయని మీకు తెలియనిది కాదు. ఆ సభలలో గొల్లలు యాదవులు ఒకరేనని ఉత్తర భారత దేశ ప్రముఖులు చెప్పారు నా గోత్రం అరికట్ల. .....ANY DOUBTS ... READY YADAV HISTORY............

గొల్లలు యాదవులు సభలు జరుగడం విచిత్రం కాదు. ప్రముఖులు చెప్పినా అది వారి భావన (లేదా అభిప్రాయం) మాత్రమే. లాజికల్ గా ఆలోచిస్తే వివిధ తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజం. ఒకే తెగ దేశమంతా ఉండదు కదా. ఉదాహరణకు కిరాతులు బోయలు ఒకే వృత్తిని కలిగియున్నా వారు ఒకే తెగకు చెందినవారు కాదు. ఒక వృత్తిని ఎన్ని తెగలువారైనా కలిగియుండవచ్చు. వ్యవసాయాన్ని ఎన్నో కులాలవారు చేస్తున్నారు. పశువులు, గొర్రెలు కాచుకొనే తెగలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో ఉన్న గొల్లవారి గోత్రాలు ఉత్తరభారతదేశంలో ఉన్న యాదవులకు లేవు. ఒకే జాతికి చెందినవారైతే గోత్రాలు కామన్ గా ఉంటాయి. భారత దేశంలో వేల కులాలవారు కలిసి నివసిస్తున్నారు. భిన్నత్వంలో ఎకత్వం. మనమంతా భారతీయులమే. ఇది నా అభిప్రాయం.(భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 15:48, 28 నవంబర్ 2017 (UTC))

Share your experience and feedback as a Wikimedian in this global survey మార్చు

WMF Surveys, 18:18, 29 మార్చి 2018 (UTC)Reply

Reminder: Share your feedback in this Wikimedia survey మార్చు

WMF Surveys, 01:17, 13 ఏప్రిల్ 2018 (UTC)Reply

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey మార్చు

WMF Surveys, 00:26, 20 ఏప్రిల్ 2018 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం మార్చు

@భూపతిరాజు రమేష్ రాజు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:భూపతిరాజు_రమేష్_రాజు.jpg
  2. File:పండూరివారి.మామిడి_.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు మార్చు

@భూపతిరాజు రమేష్ రాజు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)Reply

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు మార్చు

@భూపతిరాజు రమేష్ రాజు గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:28, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply