మాధవరం (తాడేపల్లిగూడెం): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
మిలిటరీ మాధవరం వ్యాసం విలీనం చేసితిని.
పంక్తి 1:
'''మాధవరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[తాడేపల్లిగూడెం]] మండలానికి చెందిన గ్రామము. దీనికి మిలట్రీ మాధవరం అని కూడా పేరు. ఘనమైన గత చరిత్ర ఈ గ్రామం సొంతం. బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు. వారి స్మారకార్థం గ్రామంలోని చెరువు గట్టున ఓ స్మారకస్థూపం కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచీకరణతో ఈ గ్రామం నుంచి అనేక మంది అనేక దేశాలకు వెళ్లి స్థిరపడిపోయారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే మిలట్రీ మాధవరం పేరు సార్థకనామధేయంగా మిగిలింది. మంచి విలువలు కలిగిన విద్యా వ్యవస్థ ఈ గ్రామానికి మణిహారం. జూనియర్ కాలేజి వరకు ఇక్కడ విద్యా సౌకర్యాలున్నాయి.
 
 
 
== మాధవరం చరిత్ర ==
17వ శతాబ్దం లో ఈ గ్రామం ఏర్పడినట్టుగ ఆధారాలు ఉన్నాయి. అప్పటి ఒడిషా, డెక్కన్ ప్రాంతాలను పరిపాలించే గజపతి వంశానికి చెందినా పూసపాటి మాధవ వర్మ బ్రహ్మ తన రాజ్య రక్షణ కోసం ఈ గ్రామానికి సుమారు 6 కీ.మీ దూరం లో ఉన్న అరుగొలను గ్రామం లో ఒక కోటను నిర్మించి, ఉత్తర ఆంధ్ర నుంచి సేన్యాన్ని ఇక్కడుకు రప్పించి వారికీ సాగు భూమి మరియు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అరుగొలను గ్రామం లో ఇప్పటికి ఆ కోట శిధిలాలు ఉన్నాయి. ఈ సైనికులు మాధవరం గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి నుండి ఈ గ్రామంలోని వాళ్ళు అందరు సైన్యం లో చేరుతూ వచ్చారు. తరతరాలుగ దేశరక్షణ తమ ధ్యేయం జీవిస్తున్నారు. బ్రిటిష్ పరిపాలనలో భారత దేశం తరుపున మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధం లో సుమారు రెండువేల మంది పాల్గొన్నారు.<ref>http://www.hindu.com/2011/01/27/stories/2011012754320700.htm</ref><ref>http://www.caravanmagazine.in/lede/madhavarams-military-men-0</ref><ref>https://www.youtube.com/watch?v=3M2ceN7Cjb8</ref>
 
గాంధీ మహాత్మడు స్వతంత్రియోద్యమం కొరకు భారత దేశ సంచారము చేస్తున్నప్పుడు ఈ గ్రామానికి వచ్చారు అని అక్కడి వృద్ధులు చెబుతారు. ఈ గ్రామం లో సైనికుల గౌరవ చిహ్నంగ ఇండియా గేటు దగ్గర ఉన్న అమర్ జవాన్ స్తూపం పోలిన ఒక స్థుపాన్ని ఇక్కడ నిర్మించారు.
== ముఖ్య వృత్తులు ==
మాధవరం గ్రామ ప్రజలుకు మిలిటరీ తరవాత వ్యవసాయం ముఖ్య వృత్తి. వరి, చెరకు ముఖ్య పంటలు.
== విద్య కేంద్రాలు ==
మాధవర గ్రామం లో ఒక ప్రాధమిక పాఠశాలా, ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటుగా ఒక మిషనరీ కాన్వెంట్ మరియు ఒక ప్రైవేటు స్కూల్ కూడా ఉన్నాయి.
== దేవాలయాలు ==
మాధవరం గ్రామం లో పోలరమ్మ గుడి, శివాలయం, వెంకటేశ్వర ఆలయం, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం, కుమారస్వామి ఆలయం, వైష్ణవ ఆలయం ఉన్నాయి. పోలేరమ్మ గుడి ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో మంచి ప్రాచుర్యం పొందిన ఆలయం.
== పండుగలు మరియు జాతరలు ==
దక్షిణ భారత దేశములో జరుపుకునే అన్ని పండుగులు ఇక్కడ ఘనంగ జరుపుకుంటారు. ముఖ్యంగా గ్రామా దేవత అయిన పోలేరమ్మ జాతర ఇక్కడ ఎంతో భక్తీ శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరకి పక్క ఉళ్ళ నుంచే కాక కర్ణాటక రాష్ట్రము నుంచి కూడా భక్తులు పాల్గొంటారు.
== రవాణా ==
తాడేపల్లిగూడెం నుంచి ఈ గ్రామానికి [https://te.wikipedia.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81_%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE_%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5 APSRTC] వారి బస్సు సర్వీస్ ద్వార చేరుకొనవచ్చు. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషను తాడేపల్లిగూడెం.
==మిలిటరీ మాధవరం==
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని పశ్చిమ గోదావరి జిల్లా [[తాడేపల్లిగూడెం]] మండలం లో [[మాధవరం]] గ్రామం ఉంది. ఇది తాడేపల్లిగూడెం పట్టనణానికి 12 కీ మీ ల దూరం లో ఉంది. ఈ గ్రామన్ని చుట్టుప్రక్కల గ్రామాలు వారు మిలిటరీ మాధవరం అని పిలుస్తారు. ఈ గ్రామం లో నివసించే ప్రతి కుటుంబం లో కనీసం ఒకరు మిలిటరీ లో ఉండటమే అ పేరు కి కారణం. మొదటి మరియు రెండవ ప్రపంచం యుద్ధలలలో ఈ గ్రామం నుంచి సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు. తోంభయి ఒక్కమంది అసువులు బాసారు. ఈ గ్రామం లో ప్రతి ఒక యువకునికి మిలిటరీ లో చేరడం అంటే ఒక ఆశయం.
 
{{తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామాలు}}