చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
పంక్తి 51:
[[దస్త్రం:Anna-university.jpg|thumb|కుడి|220px|[[అన్నా విశ్వవిద్యాలయం]] ముఖ ద్వారం చిత్రం]]
=== ప్రాధమిక, మాధ్యమిక విద్య ===
చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వంచే నడపబడే పాఠశాలు, ప్రైవేటు పాఠశాలలు, ఉమ్మడిగా (ప్రభుత్వ ప్రైవేటు రంగం ఉమ్మడి నిధులతో) నడిచే పాఠశాలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో బోధనా మాధ్యమం [[ఆంగ్లము]], ప్రభుత్వ రంగంరంగ పాఠశాలలో బోధనా మాధ్యమము [[ఆంగ్లము]] కానీ, [[తమిళం]] గానీ ఉండవచ్చు.ఇచట తెలుగు మాధ్యమ పాఠశాలలు కూడ కలవు. ఉన్నత విద్యలకు అవకాశం ఉన్నందున తమిళనాడు ప్రజలు ఆంగ్ల మాధ్యమాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రైవేటు రంగ పాఠశాలలు తమిళనాడు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో అనుసంధానమై ఉంటాయి. కొన్ని పాఠశాలలో సి.బి.యస్.సి. లేదా ఐ.సి.యస్.సి. లేదా ఆంగ్లో-ఇండియన్ బోర్డు (మాంటిస్సెరీ పద్ధతి) కి అనుసంధానంగా పాఠ్యాంశాల బోధన ఉంటుంది. కొన్ని విద్యాలయాలు అంతర్జాతీయ బాక్యులరేటు లేదా అమెరికన్ విద్యా పద్ధతులను కూడా అనుసరిస్తున్నాయి. పాఠశాల విద్య 3వ ఏట కిండర్ గార్డెన్‌తో ప్రారంభం అవుతుంది. రెండు ఏళ్ళ తరువాత ఒకటి నుండి పన్నెండు తరగతుల వరకు పాఠశాలలో విద్య నడుస్తుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన తరువాత ఉన్నత విద్య కోసం వృత్తి విద్యల వైపు కానీ అకాడెమిక్ రంగాల వైపు గాని ఎన్నుకోవచ్చు.
 
=== ఉన్నత విద్య ===
1857 సంవత్సరములో ఏర్పాటు చేయబడిన [[మద్రాసు విశ్వవిద్యాలయం|మద్రాసు విశ్వవిద్యాలయానికి]] మూడు క్యాంపసులు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయములో అనేక విభాగాలలో (విజ్ఞాన శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, వివిధ కళలు, [[వైద్య శాస్త్రము]], [[న్యాయ శాస్త్రము]] మొదలైనవి) ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశము ఉన్నది. నగరములో ఉన్న అనేక కళాశాలలు ఈ విశ్వవిద్యాలయముతో అనుసంధానము చేయబడి ఉన్నవి. మద్రాసు విశ్వవిద్యాలయము కంటే పురాతనమైన విద్యాసంస్థలు కూడా ఉన్నవి. 1835లో స్థాపించబడిన [[మద్రాసు మెడికల్ కాలేజి]], 1837లో స్థాపించబడిన [[మద్రాసు క్రిస్టియన్ కళాశల]], 1840లో స్థాపించబడిన [[ప్రెసిడెన్సీ కళాశాల]], 1842 స్థాపించబడిన పచ్చయప్ప కళాశాల మెదలైనవి కొన్ని ఉదాహరణలు. 1938లో స్థాపించబడిన [[స్టాన్లీ మెడికల్ కాలేజి]], 1946లో ప్రారంభించబడిన [[వివేకానంద కాలేజి]] 1951లో మెదలు పెట్టిన న్యూ కాలేజి, చెన్నై మరికొన్ని ప్రముఖ విద్యాసంస్థలకు ఉదాహరణలు. ఈ విద్యాసంస్థలు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుసంధానించబడి పనిచేస్తాయి. ఇవి కాకుండా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిన విద్యాసంస్థలలో ముఖ్యమైనవి[[క్వీన్ మేరి కాలేజి]] (1914), [[ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి]] (1915), [[లయోలా కాలేజి (చెన్నై)]] (1925), [[స్టెల్లా మేరీస్ కాలేజి]], (1947) [[నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజి]] (1995), [[ఏషియన్ కాలేజి ఆఫ్ జర్నలిజం]] (2000) మరియు [[మద్రాసు స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్]] (1952).
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు