అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాస్తికులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 37:
ఆయన [[1923]] [[సెప్టెంబర్ 20]] వ తేదీ కృష్ణా జిల్లా [[గుడివాడ]] తాలూకా [[నందివాడ]] మండలం [[రామాపురం]] లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో [[అన్నపూర్ణ]] వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా [[దెందులూరు]] లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో [[అన్నపూర్ణ స్టూడియోస్]] నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు [[అక్కినేని నాగార్జున]], మనవళ్లు [[సుమంత్]], [[అఖిల్]] సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు. అన్నపూర్ణ 28.12.2011 న మృతి చెందారు.<ref>{{Cite web|title=అక్కినేనికి సతీవియోగం|url=http://www.suryaa.com/entertainment/article-2-63087 |publisher=సూర్య|accessdate=2014-01-22}}</ref> అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 22-1-2014న మరణించారు. అర్థరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుటుంబసభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి తీసుకువెళ్ళారు. పదినిమిషాలకే డా.సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతిచెందారని నిర్ధారణ అయింది.<ref name="anrdeath"/>
 
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు సెప్టెంబర్ 20 1923 లో జన్మించారు. చిన్నప్పటి నుండి నాటకాల మీద వున్న ఆసక్తి తోనే 1941 లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “సీతారామ జననం” సినిమా లో పూర్తి స్థాయి కధానాయకుడిగా నటించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని 1949 లో అన్నపూర్ణ ని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా. ANR ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి నటించిన సినిమాలు 256, ఆయన నటించిన ఆఖరి సినిమా “మనం” షూటింగ్ దశలో వుంది. పలురకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953 లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటసామ్రాట్ అక్కినేని ప్రస్థానం అద్భుతం. 1966 లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేని కే దక్కింది. 1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వర రావు. చిత్ర పరిశ్రమని హైదరాబాద్ కి రావడానికి ఎంతో కృషి చేశారు. పర భాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. అన్నపూర్ణ స్టూడియోస్ ని స్థాపించి యువ సామ్రాట్, నవ యువ సామ్రాట్ ఇలా తన వారసులను అందించిన మహా వృక్షం. కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968 లో పద్మశ్రీ అవార్డు, 1988 లో పద్మభూషణ్, 1989 లో రఘుపతి వెంకయ్య, 1990 లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996 లో NTR National అవార్డులు అందుకున్నారు. 2011 లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు. అక్కినేని ని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన Telugu Association of North America. సినీ పరిశ్రమకి అక్కినేని ఓ లెజెండ్. ఇలాంటి లెజెండ్ ఈరోజు మనతో లేకపోవడం బాధాకరమైన సంఘటన. ఆయన కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జనవరి 22 తెల్లవారు జామున 2.45 గం||లకి మృతి చెందారు.
 
<h3>మనందరి అక్కినేని ప్రస్థానం:</h3>