మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
ఆంధ్రోద్యమాన్ని ఆరంభ దశ నుంచి ఓ మహోద్యమంగా మలిచేవరకూ సాగిన ఆయన జీవనపథంలో పలువురు తర్వాతి తరం మహానాయకుల్లో రాజకీయ నేతృత్వాన్ని ఆయనే మొదట ప్రోత్సహించారు. ఆంధ్రోద్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి, వారికి తగిన బాధ్యతలు అప్పగించారు. వారి చేతిలో తర్వాతి తరం తెలంగాణా పోరాట నాయకత్వం రూపుదిద్దుకున్నది అన్నా అతిశయోక్తికాదు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ">{{cite book|last1=గుమ్మన్నగారి|first1=బాలశ్రీనివాసమూర్తి|title=ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ|date=జూన్ 2014|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|isbn=978-93-89652-05-01}}</ref>
== వ్యక్తిత్వం ==
మాడపాటి హనుమంతరావు దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో దక్షత వంటివి కలిగిన వ్యక్తి. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం వల్ల ఆయన అజాతశత్రువుగా నిలిచారు. దేశసేవ చేసే ఉత్సాహంలో ఉద్రేకం పొందకూడదన్నది ఆయన అభిప్రాయం. వృత్తిరీత్యా తనను సంప్రదించవచ్చే క్లయింట్లు, రాజకీయరీత్యా సహచరులు మొదలుకొని అందరితోనూ ఆత్మీయంగా వ్యవహరించేవారు. ఈ లక్షణాలకు తోడు నాటి హైదరాబాద్ రాష్ట్రపు స్థితిగతుల్లోని అజ్ఞానాంధకారాన్ని చైతన్యంతో తొలగించే తొలి ప్రయత్నం చేసినవారు కావడంతో తన జీవితకాలంలో అపరిమితమైన గౌరవాన్ని పొందారు. రాజకీయాల్లో ఆయన మితవాది, అయినా ఆయన రాజకీయాదర్శాలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా వారిని ఎంతగానో గౌరవించేవారంటే వారి వ్యక్తిత్వం వెల్లడవుతోంది.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
 
==రచనారంగం==
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు