మాడపాటి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 51:
ఆయన ప్రజాసేవ విద్యారంగంలోనూ విస్తరించింది. [[భారతదేశము]]లో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది.
== రాజకీయరంగం ==
రాజకీయ రంగంలో ప్రత్యక్ష కార్యాచరణ, క్రియాశీల రాజకీయం వంటివి మాడపాటి హనుమంతరావు ప్రముఖంగా చేపట్టలేదు. దీనికి ముఖ్యకారణం ఆయన ప్రజాజీవనంలో ప్రవేశించిన 20వ శతాబ్ది తొలి రెండు దశాబ్దాల నాటి హైదరాబాద్ రాజ్య స్థితిగతులే కారణం. అప్పటి పరిస్థితుల్లో హిందువులు నిర్వహించుకునే ప్రతి సభాసమావేశానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ అనుమతుల్లో కూడా రాజకీయాలు చర్చించకూడదన్న షరతు ప్రముఖంగా ఉండేది. అప్పటికి రాజకీయ కార్యకలాపాలపై ఉన్న నిషేధాన్ని ఎదిరించి నిలిచినవారు లేకపోలేదు. కానీ వారంతా అతికొద్ది సమయంలోనే రాజ్యబహిష్కరణ వంటి విధినిషేధాలకు గురయ్యారు.
 
== వ్యక్తిత్వం ==
మాడపాటి హనుమంతరావు దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో దక్షత వంటివి కలిగిన వ్యక్తి. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం వల్ల ఆయన అజాతశత్రువుగా నిలిచారు. దేశసేవ చేసే ఉత్సాహంలో ఉద్రేకం పొందకూడదన్నది ఆయన అభిప్రాయం. వృత్తిరీత్యా తనను సంప్రదించవచ్చే క్లయింట్లు, రాజకీయరీత్యా సహచరులు మొదలుకొని అందరితోనూ ఆత్మీయంగా వ్యవహరించేవారు. ఈ లక్షణాలకు తోడు నాటి హైదరాబాద్ రాష్ట్రపు స్థితిగతుల్లోని అజ్ఞానాంధకారాన్ని చైతన్యంతో తొలగించే తొలి ప్రయత్నం చేసినవారు కావడంతో తన జీవితకాలంలో అపరిమితమైన గౌరవాన్ని పొందారు. రాజకీయాల్లో ఆయన మితవాది, అయినా ఆయన రాజకీయాదర్శాలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా వారిని ఎంతగానో గౌరవించేవారంటే వారి వ్యక్తిత్వం వెల్లడవుతోంది.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
"https://te.wikipedia.org/wiki/మాడపాటి_హనుమంతరావు" నుండి వెలికితీశారు