ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
సాహిత్య పరిషత్ 1912 మొదలుకొని 1918 వరకూ అనేక రచయితల పుస్తకాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పించింది. 1919- 20 మద్య కొన్ని కారణాల వలన పిఠాపురం రాజావారి జోక్యంతోనూ జయంతి రామయ్య పంతులు గారి చొరవతోనూ దీనిని కాకినాడకు తరలించారు. తరువాత 1946 వరకూ ఇది ప్రైవేటు పరంగా పుస్తక ప్రచురణ, ప్రచారంలో కృషిచేసింది. 1947 లో జయంతి రామయ్య పంతులు గారి సోదరి శ్రీమతి సుబ్బమ్మల భర్త అయిన ప్రభల సుందర రామయ్య గార్ల దాతృత్వం వలన సంస్థకు చక్కని భవనం సమకూరింది. అప్పటి నుండి ఆంధ్ర సాహిత్య పత్రికలను ప్రచురిస్తూ అత్యంత ప్రజాధరణ పొందిన సూర్యాంధ్ర నిఘంటువును 1946లో ప్రచురించింది, దానిని 7 భాగాలుగా విడగొట్టి సరికొత్త ప్రచురణ కావించింది
==ప్రభుత్వ ఆధీనంలోకి==
1973 నుండి సాహిత్య పరిషత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ భవనానికి మరిన్ని హంగులు కూర్చి ఆంధ్ర సాహిత్య పరిషత్ గవర్నమెంట్ మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ANDHRA SAHITYA PARISHAD GOVERNMENT MUSIUM AND REASEARCH INSTITUTE) అని మార్పుచేసారు. ఆఫ్ఫటి నుండి ఇది ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ ఆధీనంలో పనిచేస్తున్నది. 1977 నుండి వారి ద్వారా సుమారు 400 పురతన రాతి విగ్రహాలు, టెర్రాకోటా వస్తువులు, రాగి ఇత్తడి పంచలోహ విగ్రహాలు తదితర ఇతర వస్తువులు సేకరించబడి జాగ్రత్త చేయబడ్డాయి. ఇంకా మరిన్ని సేకరించబడుతున్నాయి.
 
==సేకరణలు==