ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''ధరణికోట''', [[గుంటూరు జిల్లా]], [[అమరావతి]] మండలానికి చెందిన [[గ్రామము]]. పిన్ కోడ్: 522 020., ఎస్.టి.డి.కోడ్ = 08645.
[[కృష్ణా నది]] తీరంలోని ప్రశాంతమైన ఊరు.
[[కృష్ణా నది]] తీరంలోని ప్రశాంతమైన ఊరు.
 
ఈ గ్రామచరిత్ర ప్రసిద్ధము. గ్రామ పూర్వనామము "ధాన్య కటకము". ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు [[శాతవాహనులు|శాతవాహనుల]] రాజధానిగా విలసిల్లిన పట్టణము. ఇక్కడ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండెడిదని పుస్తకములలో రాయబడి ఉన్నది (ఇక్కడ ప్రస్తుతము ఆనవాళ్ళేమీ లేవు. అమరావతి మ్యూజియంలో తప్ప). అమరావతి మరియు ధాన్యకటకములు జంట గ్రామాలు. గ్రామ పేర్లు వేరైనా రెండూ కలిసే ఉంటాయి.
==చరిత్ర==
క్రీస్తు శకం 8 నుండి 12 మధ్య చంద్రవంశపు [[క్షత్రియులు]] ధరణికోటను రాజధానిగా చేసుకుని గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలను పాలించారు. హరిసీమ కృష్ణ మహారాజు స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని కోట సామ్రాజ్యం లేదా ధరణికోట సామ్రాజ్యం అని అందురు. కోట రాజులు జైన మతాన్ని అనుసరించినా తరువాత కాలంలో చాళుక్యుల వలె హిందూతత్వాన్ని కూడా పాటించారు. వీరి కాలంలో బ్రాహ్మణులకు అత్యంత విలువ ఉండేది. వీరికి భూములను, నగదును, గోవులను దానంగా ఇచ్చేవారు. కొందరు చరిత్ర కారులు కోట రాజులు మధ్యదేశాన్ని పాలించిన ధనుంజయ మహారాజు యొక్క వంశస్థులని చెబుతున్నారు. అయితే ఈ ధనుంజయుడి గురించి వివరాలు చరిత్రకు అందలేదు. కోట రాజులు చాలా సంవత్సరాలు తమ సామ్రాజ్యాన్ని స్వయంగా పరిపాలించినప్పటికీ తరువాత కాలంలో కాకతీయులకు సామంత రాజులైయ్యారు. కోట వంశ రాజులకు తూర్పు చాళుక్యులతోను, కాకతీయులతోను, పరిచ్చేదులతోను, ఛాగి, కలచురిలతోను వైవాహిక సంబంధాలు ఉండేవి. కోట బెతరాజు కాకతీయ రాజు గణపతి దేవుడి కుమార్తె అయిన గణపాంబను వివాహమాడాడు. 1268 లో కోట బెతరాజు ఆఖరి రాజుగా కోట సామ్రాజ్యం అంతమైపోయింది. కోటవంశ రాజులు నేడు కోస్తా జిల్లాలలో కనిపించే ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రీకులకు పూర్వీకులు.
==గ్రామంలో వైద్య సౌకర్యం==
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
భారతీయ స్టేట్ బ్య్యాంక్. ఫోన్ నం = 08645/255234.
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు