నాలుగు స్తంభాలాట (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
=== నటీనటుల ఎంపిక ===
బాల నటుడిగా తెలుగులో [[పండంటి కాపురం]], [[దేవదాసు (1974 సినిమా)|దేవదాసు]], [[సంతానం - సౌభాగ్యం]], మలయాళంలో కవిత వంటి సినిమాల్లో నటించిన నరేష్ కి హీరోగా ఇది తొలి చిత్రం. నరేష్ తల్లి, ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత [[విజయనిర్మల]] స్వంత బ్యానర్ మీద [[ప్రేమ సంకెళ్ళు]] హీరోగా నరేష్ తొలిచిత్రంగా తీద్దామనకున్నారు. అయితే ఒక డ్యాన్స్ స్కూలుకి [[కె.విశ్వనాథ్]] తో కలిసి వెళ్ళిన జంధ్యాలకు నరేష్ ని చూడగా, అతని గురించి వాకబు చేసి తెలుసుకున్నారు. ఆపైన విజయనిర్మలను కలిసి తను తీయబోయే తదుపరి చిత్రంలో హీరోగా చేయడం గురించి అడిగారు. బయటి బ్యానర్లో, వేరే దర్శకుని ద్వారా నరేష్ హీరోగా పరిచయమైతేనే బావుంటుందని ఆమెకూ అనిపించడంతో ప్రేమసంకెళ్ళు ప్రాజెక్టును అప్పటికి పక్కనపెట్టారు. అంతకుముందు నుంచే విజయనిర్మలకీ, జంధ్యాలకీ సన్నిహితుడైన సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]] నరేష్ తో జంధ్యాల సినిమా తీస్తే బావుంటుందనుకుని ప్రోత్సహించారు. ముద్దమందారంలోనే నరేష్ హీరో అయితే బావుంటుందనుకున్నా, చివరికి నాలుగు స్తంభాలాటలో కుదరడంతో ఆయన చాలా సంతోషించారు. అలా నరేష్ సినిమాలో హీరోగా చేశారు. తన తొలిచిత్రం [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారంలో]] హీరోహీరోయిన్లుగా పరిచయం చేసిన ప్రదీప్, పూర్ణిమలకు రెండో సినిమా [[మల్లెపందిరి]]లో అతిథి పాత్రలను ఇచ్చిన జంధ్యాల ఇందులో మళ్ళీ హీరోహీరోయిన్ పాత్రలకు తీసుకున్నారు.<br />
ఈ సినిమాకు రెండేళ్ళ క్రితం [[జాతర (సినిమా)|జాతర]] అనే చిత్రంలో తొలిసారి వెండితెరపై కనిపించిన [[సుత్తి వీరభద్రరావు]], అంతకుముందే జంధ్యాల తొలిచిత్రంలో చిన్నవేషం వేస్తూ నటునిగా ప్రయత్నాలు చేస్తున్న [[సుత్తి వేలు]]కూ ఈ సినిమాలో హాస్యం పండించే పాత్రలు వచ్చాయి. ఈ సినిమాలో సుత్తి ట్రాక్ విషయంలో కామెడీ పండించిన వాళ్ళిద్దరికీ స్క్రీన్ నేమ్స్ గా సుత్తి స్థిరపడే స్థాయిలో ఈ సినిమాలో హాస్యం విజయవంతమైంది.
 
=== చిత్రీకరణ ===