నాలుగు స్తంభాలాట (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
అప్పటికి సీనియర్ నిర్మాతగానే కాక సినిమా రంగంపై మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా పేరున్న నిర్మాత నవతా కృష్ణంరాజు పరాజయాల్లో ఉండడంతో ఈ సినిమాపైనే అన్ని ఆశలూ పెట్టుకుని నిర్మించారు. ఆయనకు జంధ్యాల సినిమా తీసే ధోరణి అర్థంకాక విసుక్కుని గొడవపడ్డారు. అయితే సినిమా పూర్తయ్యాకా జంధ్యాల సినిమాపై మంచి కమాండ్ ఉన్న వ్యక్తి అని, అది ఆయన సినిమా తీసే శైలి అనీ అర్థమయింది కృష్ణంరాజుకు.<br />
ఈ సినిమా పాటల చిత్రీకరణలో వినూత్నమైన ప్రయత్నాలు చేశారు. నరేష్ మొదటిసినిమాగా చేద్దామనుకున్న [[ప్రేమ సంకెళ్ళు]] సినిమా మేకప్ టెస్ట్ కోసం నరేష్ కొన్ని మోటార్ సైకిల్ జంప్స్ చేశారు. దాన్ని చూసిన జంధ్యాల రాగమో, అనురాగమో పాట కోసం అతనితో ఫీట్స్ చేయించారు. కొండల్లో ఆరు అడుగుల ఎత్తు మీంచి మోటార్ సైకిల్ నడుపుతూ దూకేయమంటే హీరోహోండా సిబి 100 బండితో నరేష్ అలానే దూకేశారు. దూకిన ప్రదేశం జంపింగ్ కి అనుకూలంగా లేకపోయినా బైక్ మాత్రం సరిగానే దిగింది. అలానే చాలానే రిస్కీ ఫైట్లు ఆ ధైర్యంతో జంధ్యాల నరేష్ తో చేయించారు. గోదావరిలో కూడా సినిమాకోసం నరేష్ దూకారు. ఈ సాహసాల్లోనే భాగంగా విశాఖలోని ఎర్రకొండల్లో భూమి రబ్బర్ లా కిందకూ మీదకూ కదులుతూంటే తమాషాగా ఉందని అక్కడ నరేష్, పూర్ణిమలను నిలబెట్టి కొన్ని షాట్లు తీసుకున్నారు. ఇంతలో అక్కడివారు పరుగెత్తుకుంటూ వచ్చి- అది ఊబి.. దిగబడితే మళ్ళీ బతికి బయటపడరని చెప్పడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.<br />
సినిమా నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చయింది, సుమారుగా 50 రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరుపుకుంది.<ref name= "జంధ్యామారుతం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యా మారుతం|date=ఏప్రిల్ 2005|publisher=హాసం ప్రచురణలు|location=హైదరాబాద్|edition=I}}</ref>
 
==చిత్ర బృందం==