నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
=== సినిమా పేరు ===
నెలవంక అనే పేరును సినిమాకి సంకేతాత్మకంగా పెట్టారు. దర్శకుడు జంధ్యాల ఈ విషయాన్ని వివరిస్తూ శివుని జటాజూటంలో ఉన్నదీ, ముస్లిముల జండాపై ఉన్నదీ ఒకే నెలవంక అనీ, అందుకే నెలవంక అన్ని మతాలూ ఒక్కటే అనే సందేశానికి రూపమని పేర్కొన్నారు. సినిమాలోని ఒక పాటలోనూ - శివుని జటను వెలసినది, మా జండా నిలిపినది ఒకటే నెలవంక, ఇక మన చూపులేల నేలవంక అన్న చరణం ఉంది. అలాగే రంజాన్ ఉపవాసాలు ముగిసి ముస్లిములకు అత్యంత ముఖ్యమైన రంజాన్ పండుగ రావడానికి కూడా నెలవంక కనిపించడమే ముఖ్యమైన గుర్తు కావడమూ ప్రస్తావనార్హం.<ref name="జంధ్యామారుతం" />
 
=== చిత్రీకరణ ===
'''నెలవంక''' సినిమా చిత్రీకరణ [[ముక్త్యాల]]లో జరుపుకుంది. సినిమాలో మతసామరస్యం, జమీందారీ నేపథ్యం ప్రముఖంగా ఉంటాయి. అలానే [[ముక్త్యాల రాజా వాసిరెడ్డి|ముక్త్యాల జమీందారీ]] గ్రామం, అంతేకాక ముక్త్యాలలో హిందూ ముస్లింలు చాలా సామరస్యంతో జీవిస్తూంటారు. [[మొహర్రం]], [[వైకుంఠఏకాదశి]] ఒకేరోజు వచ్చినప్పుడు ముస్లిములు [[పీర్లు|పీర్ల ఊరేగింపు]]తోనూ, హిందువులు పొన్నవాహనం ఊరేగింపుతోనూ ఎదురై ఒకరినొకరు అభినందించుకుంటారు. ఈ పోలికలతో పాటుగా ముక్త్యాల రాజా వారి రథసారథిగా ఓ ముస్లిం ఉండేవారు, ఆ సినిమా తీసేనాటికి గ్రామమంతా మతసామరస్యం వెల్లివిరిసవుండడంతో ముక్త్యాలనే నేపథ్యంగా తీసుకోవడమే కాక అక్కడే సినిమా అంతా తీశారు.<br />
సినిమా చిత్రీకరణ జూన్ 23, 1983లో [[వేదాద్రి]]లో నెలవంక కనిపించిన నెలపొడుపు రోజున '''నెలవంక''' సినిమాని ప్రారంభించారు. ఆగస్టు 5, 1983 వరకూ ముక్త్యాలలోనే 43 రోజులపాటు జరిగిన సింగిల్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ జరుపుకుంది. సినిమాలో జమీందారు నివాసంగా జరిగిన సన్నివేశాలన్నీ ముక్త్యాల రాజా వారి కోటలోనే తీశారు.<ref name="జంధ్యామారుతం" />
 
== విడుదల, స్పందన ==
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు