రెండుజెళ్ళ సీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
== థీమ్స్, ప్రభావాలు ==
[[ముళ్ళపూడి వెంకటరమణ]] రాసిన [[బుడుగు]] పుస్తకంలో ఆయన బుడుగు పాత్రతో రెండు జెళ్ళ సీత అన్న పదాన్ని కాయిన్ చేశారు. అందంగా, కాస్త అమాయకంగా కనిపించే అమ్మాయిల్ని అబ్బాయిలు రెండు జెళ్ళ సీత అన్న పేరుతో పిలిచేవారు. దాంతో ఈ సినిమాకు రెండు జెళ్ళ సీత అన్న పేరుపెట్టారు. విశాఖపట్టణంలోని ఓ ఆటోడ్రైవర్ [[బాపు]] [[ముళ్ళపూడి వెంకటరమణ|రమణ]]ల పేర్లు ఆటో వెనుక రాసుకున్నారు. అది యూనిట్లోని వారు చూసి, జంధ్యాలకు చెప్పడంతో ఆ ఆటోని రప్పించి హీరోయిన్ సీత సినిమాలో మొట్టమొదట ఆ ఆటోలోంచే దిగినట్టు చిత్రీకరించారు. బాపు-రమణల రెండు జెళ్ళ సీతేనని అన్నట్టు కవితాత్మకత ఈ షాట్ ద్వారా వ్యక్తపరిచారు.<br />
సినిమాలో కథాంశం [[వరకట్నం|వరకట్న]] దురాచారాన్ని వ్యతిరేకిస్తూ అల్లుకున్నది. సినిమా క్లైమాక్సులో పురుషులలో పుణ్యపురుషులు వేరు అంటూ ఓ పాటను కూడా వరకట్నానికి వ్యతిరేకంగా చిత్రీకరించారు. "కృష్ణ, గోదావరుల్లో ప్రవహించేది నీరు కాదు.. కన్నీరు. కట్నం ఇచ్చుకోలేని కన్నెపిల్లల కన్నీరు" అంటూ జంధ్యాల రాసిన డైలాగ్ వరకట్నం ఎంతటి సాంఘిక దురాచారమో తెలుపుతుంది.<ref name="జంధ్యామారుతం" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రెండుజెళ్ళ_సీత" నుండి వెలికితీశారు