హవాయి: కూర్పుల మధ్య తేడాలు

తొలి పరిచయం
(తేడా లేదు)

22:13, 4 జూలై 2007 నాటి కూర్పు

హవాయి పడమర పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాల సమూహం. ఈ ద్వీప సమూహం ఆగస్ట్ 21, 1959న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 50వ రాష్ట్రం అయ్యింది. ఈ ద్వీప సమూహం 21°18′41″ రేఖాంశం, 157°47′47″ అక్షాంశాలపై ఉన్నది. అమెరికా ప్రధాన భూభాగానికి హవాయి 3,700 కిలోమీటర్ల దూరంలో ఉంది.19వ శతాబ్దంలో హవాయిని శాండ్విచ్ ద్వీపాలని కూడా వ్యవహరించేవారు.

భౌగోళిక పరిస్థితి

భూగోళం అంతటికీ అత్యంత సుదీర్ఘమయిన ద్వీప సమూహం హవాయి.ఈ ద్వీప సమూహంలో ఎనిమిది ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీప సమూహం మొత్తం పొడవు 2400 కిలోమీటర్లు.కిలియా అగ్నిపర్వతపు లావా ప్రవాహాల వలన ఈ ద్వీపాల వైశాల్యం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఈస్టర్ ద్వీపాన్ని మినహాయిస్తే ప్రధాన భూభాగాలకు అత్యంత దూరంగా ఉన్న ద్వీపం ఇది. తనలోని ప్రత్యేక భౌగోళిక స్థితిగతుల వలన వైవిధ్యభరితమయిన వృక్ష, జీవజాతులకు హవాయి నెలవయ్యింది.

చరిత్ర

ఇక్కడ లభ్యమయిన పురాతన వస్తువులనుండి ఈ ద్వీపాలలో మనుషులు 11వ శతాబ్దం నుండి నివాసమున్నరనడానికి ఆధారాలు లభిస్తున్నాయి. పోలినేషియన్ నాగరికతకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివాసమున్నారనడానికి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఐరోపా దేశస్థులకు ఈ ద్వీపాల గురించి 1778 లో బ్రిటీషు నావికుడు జేమ్స్ కుక్ పర్యటనల వలన పరిచయం అయ్యింది. కానీ అంతకన్నా ముందరే స్పెయిన్ వారు ఇక్కడకు వచ్చారన్న వాదన ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=హవాయి&oldid=158076" నుండి వెలికితీశారు