నేషనల్ ఆర్ట్ థియేటర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== చరిత్ర ==
1952 నాటికి తెలుగు సినిమా పరిశ్రమలో ముఖ్యమైన నటునిగా ఎదుగుతున్న [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంబించారు. తాను చేద్దామనుకున్న ప్రయోగాత్మకమైన సినిమాలు ఇతర నిర్మాతల డబ్బుతో చేయడం సరికాదని, వీలుకాదని భావించి ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. తమ బంధువైన దోనేపూడి కృష్ణమూర్తి ఆర్థికంగా దెబ్బతినడంతో ఆయనను నిర్మాణంలో భాగస్వామిగా తీసుకుని, తన తమ్ముడు [[నందమూరి త్రివిక్రమరావు]]ను మేనేజింగ్ పార్టనర్ గా పెట్టుకుని [[నేషనల్ ఆర్ట్స్]] పతాకంపై 1953లో తొలిచిత్రంగా [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చి పుల్లయ్య]] సినిమా నిర్మించారు. సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా ఆర్థికంగా పరాజయం పాలైంది. నిర్మాణ సంస్థ పేరు [[నేషనల్ ఆర్ట్ థియేటర్]] గా మార్చి 1954లో [[డి.యోగానంద్]] దర్శకత్వంలో [[తోడుదొంగలు (1954 సినిమా)|తోడుదొంగలు]] సినిమాను నిర్మించారు. అది కూడా పరాజయం పాలైంది. దాంతో మూడవ ప్రయత్నంలో అప్పటికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న జానపద శైలిలో చిత్రాన్ని నిర్మించారు. [[డి.యోగానంద్]] దర్శకత్వంలోనే జానపద ఫక్కీలో తీసిన [[జయసింహ (సినిమా)|జయసింహ]] చిత్రం ఘన విజయాన్ని సాధించి ఎన్టీఆర్ కి నిర్మాతగా తొలి విజయాన్ని అందించింది.<ref name="నిర్మాతగా ఎన్టీఆర్ కి వజ్రోత్సవం">{{cite web|title=NTR's production house completes 60 years|url=http://www.nandamurifans.com/main/ntrs-production-house-completes-60-years/|website=nandamurifans.com|accessdate=18 August 2015|quote="నిర్మాతగా ఎన్టీఆర్ కి వజ్రోత్సవం" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన}}</ref>
 
==నిర్మించిన సినిమాలు==