అంజన: కూర్పుల మధ్య తేడాలు

అహల్య, గౌతమ ముని కుమార్తె
కొత్త పేజీ: అంజన వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమె కి వాయుదేవుడి క...
(తేడా లేదు)

09:45, 13 జూలై 2007 నాటి కూర్పు

అంజన వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమె కి వాయుదేవుడి కారణంగా హనుమంతుడు జన్మించెను. విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది: అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన కళ్ళు చూపుని కోల్పోయాయి. తరువాత అహల్య కి సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణం లో ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=అంజన&oldid=160999" నుండి వెలికితీశారు