ఆకెళ్ల రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

A major contributor to this article appears to have a close connection with its subject.This article contains content that is written like an advertisement.This article relies largely or entirely upon a single source.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Reverted to revision 1500023 by CommonsDelinker: some content deleted by the unknown user. (TW)
పంక్తి 44:
 
[[ఆకెళ్ల రాఘవేంద్ర]] (జననం: [[జూన్ 1]], [[1974]]) ఐఎఎస్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్త.
 
== '''వ్యక్తిగతం''' ==
ఆకెళ్ల రాఘవేంద్ర పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి. పెరిగినది కోనసీమలోని అమలాపురం ప్రాంతంలో. పదవ తరగతి వరకు మురమళ్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఆపై అమలాపురంలోని ఎస్ కె బి ఆర్ కళాశాలలో బి.ఎస్సీ వరకు విద్యాభ్యాసం చేశారు. తండ్రి పేరు సుబ్రహ్మణ్య శర్మ, తల్లి సూర్యకుమారీ లలిత. వీరికి గల ముగ్గురి సంతానంలో చివరివారు ఆకెళ్ల రాఘవేంద్ర. భార్య పేరు మాధవి. కుమార్తె సిరివెన్నెల; కుమారుడు సంకల్ప రుత్విక్. <ref>ఫిబ్రవరి 11, 2010, ఈనాడులో ప్రచురణ</ref>
 
== '''ఉద్యోగం''' ==
Line 55 ⟶ 58:
 
అట్లే గ్రూప్-I స్థాయి అధికారులుగా హరిత, సంపత్ కుమార్, ఎం.వరప్రసాద్, రెడ్డి గంగాధరరావు, సుబ్బారెడ్డి, రమేష్, ఉషారాణి, కోటిరెడ్డి, దేవులపల్లి సుబ్బారావు, కృష్ణవేణి, మీరా ప్రసాద్, శ్రీదేవి.. ఇలా అనేక పదుల మంది ఉన్నారు.
 
== '''తత్త్వం''' ==
తనదైన జీవితతత్వాన్ని రూపొందించుకున్న వ్యక్తి ఆకెళ్ల రాఘవేంద్ర. "Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అంటారాయన. తాను పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని, జీవితం ద్వారా పొందిన అనుభవాన్ని రంగరించి - తన తరువాతి తరం వారికి జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలో మనసుల్ని తాకేలా చెప్పాలన్నది ఆకెళ్ళ లక్ష్యం. ఆ దారిలోనే పయనిస్తున్నారు ఆయన.
 
== '''రచయిత''' ==
ఆకెళ్ల రాఘవేంద్ర చేయి తిరిగిన రచయిత. IAS విద్యార్థులకు ఆంత్రోపాలజీ, తెలుగు సాహిత్యం తదితర అంశాలపై గ్రంథాలు రచించారు. గురజాడ రచించిన "కన్యాశుల్కం" నాటకంలోని గిరీశం, వెంకటేశం - మళ్లీ పుడితే అనే చిలిపి ఊహతో "ఈనాటీ గిరీశం" అనే హాస్య వ్యంగ్య నవల రచించారు ఆకెళ్ల. విజయాన్ని ఎలా అందిపుచ్చికోవాలో విశ్లేషిస్తూ "సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్" పుస్తకాన్ని వెలువరించారు. [[మాడపాటి హనుమంతరావు]] జీవితంపై కూడా ఓ పుస్తకాన్ని రచించారు. కొన్ని సినిమాలకు సంభాషణలు, కథలు అందించారు. ఆకెళ్ల కలం నుంచి జాలువారిన మరిన్ని ప్రముఖ రచనల్ని గమనిస్తే...
 
== '''మీరు సామాన్యులు కారు''' ==
[[File:మీరు సామాన్యులు కారు.jpg|thumb|మీరు సామాన్యులు కారు]]
ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు సామాన్యంగానే పుడతారు. కాని ఎదిగేకొద్దీ.. ఎగిరే కొద్దీ.. పెరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో మలుపూ తిరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో అడుగూ వేసే కొద్దీ.. అసామాన్యులుగా నిలబడాలి. అదెలాగో వివరించే గ్రంథమే 'మీరు సామాన్యులు కారు'.
 
మనలో ఎంతటి శక్తి ఉందో.. దానిని ఎలా వెలికి తీయాలో ఇందులో తెలుసుకోవచ్చు. సామాన్యులనుకున్న ఎందరో వ్యక్తులు.. అసామాన్యులుగా ఎలా ఎదిగారో కళ్లకు కట్టినట్టు చూపించే చరిత్ర ఇది.
 
== '''[[శోభన్ బాబు]] జీవితచరిత్ర'''==
- పరుగు ఆపడం ఓ కళ... ప్రముఖ నటుని ఆదర్శ జీవనగమనం
[[దస్త్రం:ShobanAr.jpg|thumbnail|Raghavendra's book about Shoban Babu]]
విజయం సాధించడానికి ఏం చెయ్యాలో మనందరికీ తెలుసు. నిజానికి అది తెలియాలి కూడా ! కానీ ఎక్కడ ఆపితే ఆ విజయాన్ని ఆస్వాదించగలమో ఎంత మందికి తెలుసు? డబ్బు, పేరు - ఏదైనా సరే.. అన్నింటికీ ఒక స్థాయి తర్వాత 'ఇక చాలు' అని చెప్పడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రశాంతతకు చిరునామా అదే. ఈ జీవితసారాన్ని ఆకళింపు చేసుకున్న సోగ్గాడు [[శోభన్ బాబు]] జీవనయానాన్ని, అంతరంగాన్ని ఆవిష్కరించడమే "పరుగు ఆపడం ఒక కళ" అనే గ్రంథం.
 
== '''చెరగని ముద్రలు''' ==
[[File:చెరగని ముద్రలు గ్రంథం.jpg|thumb|చెరగని ముద్రలు గ్రంథం]]
[[స్వామి వివేకానంద]], జాన్ కీట్స్, మార్టిన్ లూథర్ కింగ్, బసవరాజు అప్పారావు, [[దామెర్ల రామారావు]] లాంటి చరిత్ర నిర్మాతల అడుగజాడల పుస్తకం ఇది. 40 ఏళ్ల లోపు మరణించిన మహానుభావుల సంక్షిప్త జీవిత చరిత్రల సంకలనం ఈ 'చెరగని ముద్రలు' - కడుపుకి తిండి, కంటికి నిద్ర, వేళకి పడక సుఖం - ఇందుకోసమే అయితే జంతువుగానే పుట్టొచ్చు. మానవ జన్మ ఎందుకు దండగ. ఎలా పుట్టిందో అలాగే ఉండి - పోయే గుణం జంతువుది. మనిషి అలా కాదు. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే లక్షణం మానవులది. అలా చరిత్ర గతి మార్చిన వారి జీవిత కథలివి.
 
== '''ఆకెళ్ల భావాల్లో జీవితం''' ==
జీవితం చాలా చిన్నది. విలువైనది. దాన్ని ప్రయోజనకరంగా మలచుకోవాల్సింది మనమే. విసిరి పారేసిన పూలబుట్టకు, ముచ్చటగా పెంచిన పూలతోటకు ఎంత తేడా! స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కెరీర్‌పై, ఉద్యోగం వచ్చాక కుటుంబం పట్ల, ఆపై సంఘం మీద దృష్టి పెట్టాలి
 
ఎలా పుట్టామన్నది కాదు.. ఎందుకు పుట్టామన్నది ముఖ్యం. ఎందుకు చనిపోయామన్నది కాదు.. ఎలా వెళ్లిపోయామన్నది ప్రధానం. ఆనందం, ఆరోగ్యం, సత్కీర్తి, సంపద - ఈ నాలుగూ జీవిత సౌధానికి మూలస్తంభాలు కావాలి. సమస్యలు, సంక్షోభాలు, కోపాలు, వేదనలు.. సహజం. భయం నుంచి నిర్భయానికి, విషాదం నుంచి సంతోషానికి, వైఫల్యం నుంచి విజయానికి జీవిత ప్రస్థానం చేయడమే ప్రతి ఒక్క మనిషి కర్తవ్యం. ఈ పరిణామక్రమమే జీవితం అంటే.
 
== '''లక్ష్యం గురించి ఆకెళ్ల''' ==
విద్యార్థులు ముందుగానే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. భయాన్ని వీడి ఆత్మ విశ్వాసంతో జీవించాలి. మన సంతకం ఆటోగ్రాఫ్ కావాలి. మనం మరణించాక కూడా మన తాలూకు భావాలు, ఆదర్శాలు తరువాతి తరాలకు దీప స్తంభాలుగా వెలగాలి. పశుపక్ష్యాదులకు పుట్టుక మాత్రమే తెలుసు. జీవితలక్ష్యం తెలీదు. అది తెలిసేది, తెలియాల్సింది మనిషికి మాత్రమే. అంటే లక్ష్యం లేకుండా మనిషి ఉండకూడదన్న మాట. ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి దాగి ఉంది. దాన్ని వెలికితీయాలి.
 
ఒక నీటి బిందువు కాలిన పెనం మీద పడితే ఆవిరి అయిపోతుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పడితే ప్రకాశిస్తుంది. ఆ బిందువే ముత్యపు చిప్పలో పడితే ముత్యమే అవుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. సమాజం, కుటుంబం, పాఠశాల - ఆ మూడు విద్యార్థుల భవితను నిర్దేశిస్తాయి.
 
ప్రతి వ్యక్తి జీవితానికి నిజమైన హీరో తండ్రి. అసలైన స్ఫూర్తిదాత తల్లి. అలాంటి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చకూడదన్న దృష్టి ప్రతి ఒక్క యువకుడికీ, యువతికీ ఉండాలి.
 
== '''డ్రెస్ కోడ్ ఏం చెబుతోంది?''' ==
ఆకెళ్ల రాఘవేంద్ర ఆహార్యం ఎపుడూ ఒకటే. 2003 జూన్ 24 నుంచి ఆయన వేషధారణ ఎల్లపుడూ ఒకేరీతి. కుర్తా, జీన్ ఫ్యాంట్, గడ్డం, కళ్లజోడు - ఇంతే. జీవితం పట్ల ఉన్న అవగాహనకు సూచికగా ఆకెళ్ల ఈ వేషధారణ అవలంబించుకున్నారు. జీన్స్ పాశ్చాత్య తత్త్వానికి, కుర్తా భారతీయ తత్త్వానికి ప్రతీకలు. గడ్డం ఒకానొక సంకల్పదీక్షలో ఉన్నారనడానికి సూచిక.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1974 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/ఆకెళ్ల_రాఘవేంద్ర" నుండి వెలికితీశారు