గౌతమిపుత్ర శాతకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: కర్నాటక నుండి కర్ణాటకకు మార్పు
పంక్తి 9:
[[బొమ్మ:Gout.JPG|thumb|300px|నాసిక్ లో లభ్యమైన అరుదైన గౌతమీపుత్ర శాతకర్ణి నాణెం]]
 
నాసిక్ ప్రశస్తి గౌతమీపుత్ర శాతకర్ణిని అప్రాంత, అనూప, సౌరాష్ట్ర, కుకుర, అకార మరియు అవంతి ప్రాంతాల పాలకునిగా పేర్కొన్నది. ఈ ప్రాంతాలను ఈయన నహపాణుని నుండి హస్తగతం చేసుకొని ఉండవచ్చు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కన్ ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలములో [[శాతవాహన]] ప్రాబల్యం దక్షినాన [[కంచి]] వరకు వ్యాపించింది. ఈయన ఆనంద గోత్రీయుల నుండి దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలను జయించినాడని ప్రతీతి. శాలివాహనుడు బనవాసి ప్రాంతాన్ని తన రాజ్యములో కలుపుకొని [[కర్నాటకకర్ణాటక]]లోని కొంతభాగముపై అధికారము సాధించాడు. ఈయన తరువాత క్రీ.శ.130 ప్రాంతములో ఈయన కుమారుడు [[వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి]] రాజ్యం చేపట్టాడు.
 
గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికాడు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని క్యాలెండర్లలో ఉపయోగిస్తున్నారు.