గరికపాటి రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ప్రజానాట్యమండలి సాంఘీక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో [[దేవిక]], [[అల్లు రామలింగయ్య]], సంగీత దర్శకులు [[మోహన్ దాస్]] మరియు [[టి.చలపతిరావు]]లు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు మరియు బుర్రకథ కళాకారుడు [[షేక్ నాజర్]] ఉన్నారు.<ref>http://www.idlebrain.com/research/anal/anal-tc4.html</ref>
 
రాజారావు 1953లో [[పుట్టిలుపుట్టిల్లు]] సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు [[జమున]] మరియు అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశాడు. పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్ధికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్ధికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు.
 
ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన [[ఆరాధన]] వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి పాత్ర వేశాడు.
"https://te.wikipedia.org/wiki/గరికపాటి_రాజారావు" నుండి వెలికితీశారు