ఊరగాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
తెలుగువారికి ఆవకాయ గురించి ఉపోద్ఘాతం అవసరంలేదు. వారికి ఇంటింటా సుపరిచితమైన వంట. అమెరికా వెళ్ళే తెలుగువారు చాలామంది తప్పక తీసుకువెళ్ళే పదార్ధం.<ref>[https://docs.google.com/gview?url=http://www.teluglobe.com/wp-content/uploads/2010/03/murthy-telgudanaalu.pdf&chrome=true '''కట్టా గోపాలకృష్ణ మూర్తి''', Department of Industrial and Operations Engineering, University of Michigan, Ann Arbor. ''కొన్ని"తెలుగుదనాలతో" నా అనుభవాలు , పేజీ 64, తెలుగు వంటలతో కొన్ని అమెరికన్ల అనుభవాలు''] </ref> తింటున్న అన్నానికి వేరువేరు రుచులు కలపడానికి నంజుకునే వంటకాన్ని "'''ఊరగాయ'''" అంటారు. ఉదాహరణకు, కొత్తగా తోడుపెట్టిన తియ్యటి పెరుగన్నం తినేటప్పుడు [[దబ్బకాయ]] ఊరగాయ నంజుకుంటే పులుపు, కారం, ఉప్పు, కొద్దిగా దబ్బతొక్క చేదు కలిసి జిహ్వకు ఎంతో సుఖం కలిగిస్తుంది. [[పచ్చడి]], [[పికిలు]]. ప్రాచీన గ్రంధాలలో '''ఊరుగాయ''' అని కూడా ఉంటుంది.
==రకాలు==
[[దస్త్రం:MaamiDi kaayalanu kattariMce pedda kattipita.JPG|thumb|right|పచ్చడి మామిడి కాయలను కత్తరించ డానికి ఉపయోగించే పెద్ద కత్తి పీట. కొత్త పేట రైతు బజారు వద్ద తీసిన చిత్రం]]
పుల్ల పచ్చి [[మామిడి]] ముక్కలతో చేసే [[ఆవకాయ]], [[మాగాయ]], లేక దాని కోరుతో చేసే మామిడికోరు ఊరగాయ; [[నిమ్మ]], [[దబ్బ]], [[ఉసిరి]], [[గోంగూర]], [[చింతకాయ]], [[పండుమిరప]], [[ఉల్లి]], [[వెల్లుల్లి]] ఊరగాయలూ తరతరాల నుంచీ [[తెలుగు]]వాళ్ళు వాడుతున్నారు. ఈ మధ్య [[టమోటా]], [[దోస]], [[కారట్టు]], [[కాలిఫ్లవరు]] ఊరగాయల్లాంటివి గూడా వాడడం మొదలుపెట్టారు.
[[File:Green Mango pieces for Pickle 02.JPG|thumb|ఆవకాయ పచ్చడి కోసం కొట్టిన మామిడి ముక్కలు. నిజాంపేట, హైదరాబాద్.]]
[[File:Green Mango pieces for Pickle 04.JPG|thumb|మాగాయ పచ్చడి కోసం మామిడి ముక్కలు. నిజాంపేట, హైదరాబాద్.]]
==మామిడి ఆవకాయ తయారీ విధానం==
===కావలసిన పదార్థాలు===
Line 39 ⟶ 36:
మామిడికాయలను తడిబట్టతో తుడిచి , ముక్కలు చేసి అందులో జీడి తీసేయాలి. ఒక గిన్నెలో కారంపొడి, ఉప్పు, జీలకర్ర , మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. మరో గిన్నెలో నువ్వులనూనె వేడి చేయాలి . ఈ నూనె బాగా కాగిన తర్వాత ఇంగువ వేసి చిటపటలాడాక ఆవాలు , జీలకర్ర కూడా వేసి పోపు పెట్టాలి. గిన్నెను పొయ్యి మీదనుండి దింపేయాలి. నూనె చల్లారనివ్వాలి. నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం , వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి. దీనివల్ల అందులోని తడి పోయి కమ్మగా ఉంటుంది. పూర్తిగా చల్లారాక కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని వేసి మొత్తం కలపాలి. తర్వాత మామిడి ముక్కలు వేసి మొత్తం మసాలా ముక్కలకు పట్టేటట్టుగా కలపాలి. మొత్తం కలిపి శుభ్రమైన, తడిలేని జాడీలో ఆవకాయ వేసి జాగ్రత్తగా మూత పెట్టి ఉంచాలి. మూడు రోజుల తర్వాత మరోసారి ఆవకాయనంతా కలియబెట్టాలి. అంతే నోరూరించే కమ్మని ఆవకాయ తినడానికి తయారవుతుంది.
 
<gallery mode="packed" heights="150px">
దస్త్రం:MaamiDi kaayalanu kattariMce pedda kattipita.JPG|పచ్చడి మామిడి కాయలను కత్తిరించుట
[[File:Green Mango pieces for Pickle 02.JPG|thumb|ఆవకాయ పచ్చడి కోసం కొట్టిన మామిడి ముక్కలు. నిజాంపేట, హైదరాబాద్.]]
[[File:Green Mango pieces for Pickle 04.JPG|thumb|మాగాయ పచ్చడి కోసం మామిడి ముక్కలు. నిజాంపేట, హైదరాబాద్.]]
[[File:Preparation of mango pickles..JPG|thumb|తయారవుతున్న ఆవకాయ పచ్చడి]]
[[File:Aavakaaya.in my house.JPG|thumb|left|జాడీలో ఆవకాయ]]
</gallery>
==చరిత్ర==
పలురకాల ఊరగాయలు (ముఖ్యంగా ఆవకాయ, మాగాయ, గోంగూర ఊరగాయలు) తయారుచేసే విధానాన్ని తెలుగువారే మొదట కనిపెట్టారు. ఊరగాయలు వాడడం ప్రాచీనకాలంనుంచీ జరుగుతోందని చెప్పడానికీ చాలా నిదర్శనలున్నాయి. ఇప్పుడు ఊరగాయలవాడకం [[ఇండియా]] అంతటా వ్యాపించింది. ప్రాచీన [[తెలుగు సాహిత్యం]]లో ఊరగాయలను గురించి ప్రస్తావన ఉందికూడా.
 
Line 58 ⟶ 61:
కలబంద, గజనిమ్మకాయ, నార్దపుకాయ, <br>
చిననిమ్మకాయయు, జీడికాయ, <br>
 
[[File:Aavakaaya.in my house.JPG|thumb|left|జాడీలో ఆవకాయ]]
(తేటగీతి)- <br>
కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ <br>
Line 136 ⟶ 139:
 
==చేసే విధానం==
 
[[File:Preparation of mango pickles..JPG|thumb|తయారవుతున్న ఆవకాయ పచ్చడి]]
 
[[File:Aavakaaya jaaDIlu.JPG|thumb|ఆవకాయ నిల్వ ఉంచడనికి ఉపయోగించే జాడీలు]]
మిగతా వంటకాలకూ, ఊరగాయలకూ ముఖ్య భేదం ఏమిటంటే ఊరగాయలు చెయ్యడానికి వేడి అవసరం లేదు. ఊరగాయ చేసే పద్ధతి ఇలా ఉంటుంది: ఊరగాయగా చెయ్యబోతున్న కాయలను బాగా శుభ్రంచేసి, తడి ఆరాక వాటిని ముక్కలుగా కొయ్యాలి (ముక్కల ఊరగాయ చెయ్యడానికి), లేక కోరుగా తురమాలి (కోరు ఊరగాయ చెయ్యడానికి). అప్పుడు వాటిలో [[ఉప్పు]], [[పసుపు]], [[కారం]], [[ఆవ పిండి]], [[జీలకర్ర పిండి]], [[ఆవాలు]], [[వెల్లుల్లి]], [[వేరుశనగ పప్పు]], [[నువ్వుల నూనె]], [[బెల్లం]] మొదలైన దినుసులు సరైన మోతాదులలో బాగా కలిపి, మిశ్రమాన్ని ఒక జాడీలో ఉంచాలి. కొన్నిరోజులు ఊరి, కాయముక్కలు మెత్తబడ్డాక అది ఊరగాయ అవుతుంది. కలిపిన దినుసుల సమూహంలో కాయ ఊరడంవల్ల తయారయింది కనుక దానికి "ఊరగాయ" అని పేరు పెట్టారు.
 
"https://te.wikipedia.org/wiki/ఊరగాయ" నుండి వెలికితీశారు