ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (4) using AWB
చి clean up, replaced: తెరాస → తెరాస (4) using AWB
పంక్తి 28:
[[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర, అనుచరవర్గములో టైగర్‌గా ప్రసిద్ధులు. 2003 వరకు [[భారతీయ జనతా పార్టీ]] ఆంధ్రప్రదేశ్ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించిన నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]] నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను [[కె.చంద్రశేఖరరావు]] ప్రారంభించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] లో విలీనం చేశారు.
 
2004 ఎన్నికలలో [[మెదక్]] [[లోక్‌సభ]] నియోజకవర్గం నుండి [[తెరాస]] పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన నరేంద్ర, [[తెరాస]] యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యారు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని [[తెరాస]] కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర [[తెరాస]] మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
 
2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి [[మాయావతి]] ఆధ్వర్యములోని [[బహుజన సమాజ్]] పార్టీ లో చేరారు.<ref name="merinews.com">{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనారు. అనంతర కాలంలో భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/ఆలె_నరేంద్ర" నుండి వెలికితీశారు