మావో జెడాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
చి →‎యుద్ధం మరియూ తిరుగుబాటు: clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 30:
 
== యుద్ధం మరియూ తిరుగుబాటు ==
[[చైనా]] ఆ రోజులలో అనేక మంది ప్యూడల్ యుద్ధ ప్రభువుల ఆధీనంలో చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి ఉండేది. వీరందరినీ తుదముట్టించి చైనాను ఏకీకృతం చేయుటకు కమ్యూనిష్టులు మొదట [[సన్ యెట్ సెన్]] నాయకత్వంలోని ''[[కొమింటాంగ్]]'' అనబడే ఒక జాతీయ పార్టీతో కలసి కృషి చేశారు. కానీ [[1925]]లో సన్ యెట్ సెన్ మరణించిన తరువాత కొమింటాంగ్ పార్టీకి [[చియాంగ్ కైషెక్]] నాయకుడయ్యాడు. ఇతనితో కమ్యూనిష్టులకు సయోధ్య కుదరలేదు. వీరి మధ్య ఘర్షణ త్వరలోనే యుధ్దంగా మారింది. దీనితో మావో మరి కొంతమంది కమ్యూనిష్టు నాయకులతో కలసి తమ సైన్యాన్ని [[1928]] లో జియాంగ్జి రాష్టానికి తరలించాడు. [[1931]] నుండి చియాంగ్ ఈ సైన్యం మీద అనేకసార్లు దాడులు చేసి కమ్యూనిష్టులను తీవ్రంగా నష్టపరిచాడు. దానితో [[1934]] లో మావో కమ్యూనిష్టు సైన్యాన్ని షాంగ్జీ (షెన్సీ) రాష్ట్రానికి తరలించాడు. ఈ తరలింపు చరిత్రలో ''[[లాంగ్ మార్చ్]] ''గా ప్రసిద్దిప్రసిద్ధి చెందినది. ఇది ఒక సంవత్సర కాలం పైగా పట్టిన 9,700 కిలో మీటర్ల సుధీర్ఘమైన నడక. మార్గమధ్యంలో అనేక మంది చనిపోయారు.
 
[[1931]] లో [[జపాన్]] [[చైనా]] లోని [[మంచూరియా]] ప్రాంతం మీద దండెత్తినది. [[1937]]లో జపాన్ పూర్తి స్థాయి యుద్ధానికి తెరతీసింది. కమ్యూనిష్టులు కొమింటాంగ్ పార్టీ జాతీయ సైన్యంతో మరలా కలసి జపాన్‌ను ఎదుర్కొన్నారు. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధ]] సమయంలో కొమింటాంగ్ సైన్యాలు దేశం లోపలి ప్రాంతాలకు తరిమి వేయబడటంతో మావో తన గెరిల్లా యుద్ధ తంత్రంతో [[1945]] కల్లా చైనా లోని అధిక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. [[1946]] లో మంచూరియా ప్రాంతంలో కమ్యూనిష్టులకు జాతీయ సైన్యానికి యుద్ధం ప్రారంభమైనది. [[1949]] అక్టోబర్ కల్లా కమ్యూనిష్టులు చైనాను పూర్తిగా ఆక్రమించుకుని [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]] ను స్థాపించారు. కొమింటాంగ్ పార్టీ [[తైవాన్]] వరకే తన అధికారాన్ని పరిమితం చేసుకున్నది.
"https://te.wikipedia.org/wiki/మావో_జెడాంగ్" నుండి వెలికితీశారు