ఆంగ్ల భాష: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల, ప్రైమరీ → ప్రాథమిక using AWB
చి Wikipedia python library
పంక్తి 11:
== ఆంగ్ల భాష సంక్షిప్త చరిత్ర ==
 
మనం ఈ నాడు “బ్రిటిష్ దీవులు" అని పిలచే భూభాగంలో పూర్వం ఐదు రాజ్యాలు ఉండేవి. వాటిలో ప్రజలని ఇంగ్లీషు వాళ్లు, బ్రిటన్ వాళ్లు, స్కాట్ వాళ్లు, పిక్ట్ వాళ్లు, లేటిన్ వాళ్లు అని పిలచేవారు. వీరు వేర్వేరు భాషలు మాట్లాడేవారు. వీరందరిలోను ముందు ఈ దీవులలో నివసించటానికి వచ్చిన వాళ్లు బ్రిటన్ లు; అందుకనే ఈ దేశానికి బ్రిటన్ అనే పేరు సిద్ధించింది. తరువాత సా. శ. 43 లో రోము నుండి చక్రవర్తి క్లాడియస్ పంపిన వలస ప్రజలు వచ్చి బ్రిటన్ లో స్థిరపడటం మొదలు పెట్టేరు. చూరు కింద తలదాచుకుందుకని వచ్చి ఇంటినే ఆక్రమించిన తీరులో రోమకులు బ్రిటన్ ని ఆక్రమించి ఐదు శతాబ్దాలు పాలించేరు. అప్పుడు గాత్ అనే మరొక తెగ వారు రోమకులని ఓడించి దేశం నుండి తరిమేశారు. అప్పుడు ఈ గాత్ తెగని పడగొట్టటానికి పిక్ట్ లు, స్కాట్ లు ప్రయత్నించేరు. వీళ్లని ఎదుర్కొనే శక్తి లేక బ్రిటన్ మళ్లా రోమక ప్రభువులని ఆశ్రయించక తప్ప లేదు. కాని ఆ సమయంలో రోములో వారి ఇబ్బందులు వారికి ఉండటంతో వారు సహాయం చెయ్యలేక పెదవి విరచేరు. గత్యంతరం లేక బ్రిటన్ లు ఐరోపాలో, నేటి జెర్మనీ ప్రాంతాలలో, ఉండే సేక్సన్ లు అనే మరొక తెగని పిలుచుకొచ్చేరు. వారు బ్రిటన్ తీరానికి మూడు పడవలలో సా. శ. 449 లో వచ్చినట్లు చారిత్రకమైన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు వారు మాట్లాడిన భాషనే ఇప్పుడు మనం "పాత ఇంగ్లీషు" అంటున్నాం. దీన్నే ఏంగ్లో-సేక్సన్ అని కూడ అంటాం.
 
ఒక భాషలోని మాటలే ఆ భాష యొక్క పడికట్టు రాళ్లు. పదసంపదే భాషకి రూపు రేఖలని ఇస్తుంది, ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఏదైనా కొత్త భాషని నేర్చుకునేటప్పుడు ఉచ్చారణని, వ్యాకరణాన్ని అవుపోశన పట్టటం అంత కష్టం కాదు. కాని ఆ భాషలోని పద సంపద మీద ఆధిపత్యం సంపాదించటానికి చాల కాలం పడుతుంది. ఒక భాషని అనర్గళంగా మాట్లాడాలంటే ఆ భాషలోని పదాలు త్వరత్వరగా స్పురణకి రావాలి. ఇంగ్లీషు విషయంలో ఇది కష్టం. ఎందుకంటే ఇంగ్లీషు చీపురుకట్ట లాంటి భాష. వాకట్లో చీపురు పెట్టి తుడిస్తే చేరే ద్రవ్యరాశిలో ఆకులు, అలములు, చితుకులు, చేమంతులు, రెట్టలు, పెంటికలు, ..., ఇలా సమస్తం ఉంటాయి. అలాగే ఇంగ్లీషు ఎవరి వాకిట్లోకి వెళ్ళినా అక్కడి సామగ్రిని అంతా సేకరించి మమేకం చేసుకుంది. అందుకనే ఇంగ్లీషు మాటల్లో కాని, వర్ణక్రమంలో కాని ఒక నియమం, నిబంధన, వరస, వావి కనబడవు. అందుకనే నేటి ఇంగ్లీషు పదసంపదలో మూల భాష అయిన జెర్మన్ వాసనలు తక్కువగానే కనిపిస్తాయి.
పంక్తి 19:
ఇంగ్లీషు భాష తల్లివేరు జెర్మన్ భాషలో ఉండటం ఉంది కాని, ఏంగ్లో-సేక్సన్ లు బ్రిటన్ లో వచ్చి స్థిరపడే నాటికే వారి భాష అయిన జెర్మన్ మీద లేటిన్ ప్రభావం బాగా పడిపోయింది. అందుకనే ఇంగ్లీషు మీద లేటిన్ ప్రభావం మొదట్లో ఎక్కువగా ఉండేది. క్రైస్తవ మతగ్రంధాలు, పూజలు, పురస్కారాలు లేటిన్ లో ఉండేవి కనుక వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు, విద్యారంగంలోనూ లేటిన్ పదజాలం పాతుకు పోయింది.
 
తరువాత స్కేండినేవియా నుండి వైకింగులు దండయాత్ర చేసి ఒక శతాబ్దం పాటు - సా. శ. 780 నుండి 880 వరకు - బ్రిటన్ తో చిల్లర మల్లర యుద్ధాలు చేసేరు. ఈ సమయంలో ఆ ప్రాంతాల పదజాలం ఇంగ్లీషులో కలిసిపోయింది. నిజానికి పదవ శతాబ్దం వరకు ఈ భాషని "ఇంగ్లీషు" అనే పేరుతో వ్యవహరించనే లేదు.
 
పెను తుపానులా వచ్చి ఇంగ్లీషుని కూకటి వేళ్లతో కుదిపేసిన భాష ఫ్రెంచి భాష. సా. శ. 1066 తరువాత బ్రిటన్ మీద ఫ్రెంచి వారి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. దానితోపాటు ఫ్రెంచి వారి ధర్మశాస్త్రం, స్థాపత్య శాస్త్రం, సంగీతం, లలితకళలు, సాహిత్యం బ్రిటన్ మీద విపరీతమైన ప్రభావం చూపించటం మొదలు పెట్టేయి. జెర్మన్ సంప్రదాయాలని ఆసరా చేసుకున్న ఆంగ్లో-సేక్సన్ ఆచార వ్యవహారాలు ఫ్రెంచి దృక్పథానికి కట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాత కొత్తల కలయికతో సమానార్ధకాలయిన పాత మాటలు, కొత్త మాటలు పక్క పక్కన నిలబడి మనుగడ కొనసాగించేయి. కొన్ని పాత మాటలు కొత్త అర్ధాన్ని సంతరించుకున్నాయి.
 
తరువాత బ్రిటన్ ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలు స్థాపించి ఏలుబడి చెయ్యటంతో పదహారవ శతాబ్దానికే ప్రపంచ భాషలలోని మాటలు ఇంగ్లీషులో జొరబడటం మొదలు పెట్టేయి. అప్పటికే ఐరోపాలో నవజాగృతి యుగం తలెత్తటం, విజ్ఞానశాస్త్రం వేగం పుంజుకోవటంతో గ్రీకు మాటలు తండోపతండాలుగా వచ్చి ఇంగ్లీషులో పడ్డాయి. ఇంగ్లీషు ఇలా కొత్త అందాలతో వెలుగుతూ ఉంటే ఇంగ్లీషులో మాతృఛాయలు పూర్తిగా నశించిపోతున్నాయని కొందరు ఆరాటపడ్డారు. ఎవరెంతగా ఆరాట పడ్డా ఇంగ్లీషు మీద పరభాషా ప్రభావం పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గ లేదు.
 
తరువాత ఇంగ్లీషుని ఎక్కువగా ప్రభావితం చేసింది అమెరికాలో మాట్లాడే ఇంగ్లీషు. అమెరికాలో ఇంగ్లీషు వర్ణక్రమం మారిపోయింది. భ్రిటన్ లో వాడే మాటలకి సమానార్ధకాలైన కొత్త మాటలు ఎన్నో అమెరికాలో పుట్టుకొచ్చేయి. అమెరికాకి స్వరాజ్యం వచ్చిన కొత్తలో బ్రిటన్ మీద ఉండే తిరస్కార భావమే ఈ మార్పుకి ప్రేరణ కారణం.
"https://te.wikipedia.org/wiki/ఆంగ్ల_భాష" నుండి వెలికితీశారు