"కపిలతీర్థం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: తీర్ధం → తీర్థం (2) using AWB)
చి
[[బొమ్మ:Tirumala kapila teertham.jpg|250px|thumb|right|కపిలతీర్థం]]
[[శేషాద్రికొండ]] దిగువన, [[ఏడుకొండలు|ఏడుకొండలకు]] వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. [[కృతయుగము]]లో [[పాతాళలోకం]]లో [[కపిలమహర్షి]] పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, [[భూమ]]ని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. [[త్రేతాయుగము]]లో [[అగ్ని]] పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు [[కలియుగం]]లో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ [[ముక్కోటి పౌర్ణమి]] నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది [[మేరుపర్వతం|మేరుపర్వత]] సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తిక మాసం నందు వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.
ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యం లొ పని చేస్తుంది, శివరాత్రి పండుగ మరియు బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.
== చరిత్ర ==
[[విజయనగర సామ్రాజ్యము|విజయనగర చక్రవర్తి]], [[అచ్యుత రాయలు]] ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు<ref name=kapila1>[http://www.omnamovenkatesaya.com/saptagiri_Nov2005_Eng/Tirumala_through_ages.htm అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి]</ref>. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] వ్రాశారు. బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టియున్న విశాలమైన మంటపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్క స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కారు చందులాలా ఏర్పాటుచేసిన దానధర్మాలు బాగా జరిగేవని ఆయన వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
బొమ్మ:Chakra Teerdham Tirumala.jpg|చక్రతీర్దము వద్ద స్వయంభూ సుదర్శనము
</gallery>
==బాహ్య లింకులు==
 
http://www.tirumala.org/TemplesAtTirupathi.aspx#id5
==మూలాలు==
<references/>
74

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1744778" నుండి వెలికితీశారు