గుంతకల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
గుంతకల్లు పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరం లో ఉన్న నేట్టికంటి ఆంజనేయ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడి స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊరి వాళ్ళే కాకుండా కర్ణాటక రాష్ట్రము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. శ్రావణమాసము లో ఇక్కడ స్వామి వారిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతారు. ప్రతి శనివారము, మంగళవారము కసాపురం దేవాలయము భక్తులతో కిట కిట లాడుతుంది. ఇక్కడ స్వామి వారిని తమ కోరికలను కోరుకొని తీరిన తరువాత స్వామి వారికి చెక్కతో చేసిన పాదరక్షలు సమర్పించుకుంటూ ఉంటారు భక్తులు. స్వామి వారికి సమర్పించిన పాదరక్షలు సంవత్సరము తరువాత అరిగిపోయి ఉండడము స్వామి వారి మాహాత్మ్యము అని ఆలయ పూజారులు చెబుతారు. ఇక్కడికి దగ్గరిలోనే కొండమీద కాశి విశ్వేశ్వర స్వామి వెలసినాడు. కసాపురం చేరుకోవడానికి గుంతకల్లు రైల్వే స్టేషను నుండే కాకుండా బస్టాండ్ దగ్గరినుంచి ఆటో లు చాల ఉంటాయి. గుంతకల్లు నుండి పత్తికొండ వెళ్ళే రహదారిలో ఉంది కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటీవలే ప్రభుత్వము గుంతకల్లు నుండి కసాపురము కి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది కూడా పూర్తి కావస్తుంది.
 
==మండల గణాంకాలు==
;గ్రామాలు 18
 
;జనాభా (2001) - మొత్తం 1,59,535 - పురుషులు 80,867 - స్త్రీలు 78,668
;అక్షరాస్యత (2001) - మొత్తం 65.03% - పురుషులు 76.03% - స్త్రీలు 53.69%
"https://te.wikipedia.org/wiki/గుంతకల్" నుండి వెలికితీశారు