కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==కుటుంబ నేపధ్యం==
కుమారజీవుడు క్రీ.శ 344 లో మధ్య ఆసియా లోని [[తక్లమికిన్]] ఎడారి ప్రాంతం లోని ఒయాసిస్ నగర రాజ్యమైన [[కూచా]] (Kucha) లో జన్మించాడు. ఇది (ప్రస్తుత ప్రస్తుతంXinjiang) చైనా దేశంలో భాగంగాఅంతర్భాగంగా వుంది. ఇతని తల్లి [[జీవిక]] (జీవ) కూచా రాకుమార్తె. తండ్రి [[కుమారయాన]] జన్మతా భారతీయ బ్రాహ్మణుడు. ‘కుమారయాన’ కాశ్మీర్ లోని సంపన్న కులీన వర్గానికి చెందిన వాడు. ఇతను బౌద్ధ బిక్షువుగా మారి ధర్మ ప్రచారం కోసం కాశ్మీర్ ను విడిచిపెట్టి పామీర్ పర్వతాలను దాటి మధ్య ఆసియా లోని నగర రాజ్యమైన ‘కూచా’ (kucha) కు వచ్చి అక్కడి రాజాస్థానంలో బౌద్ధ సన్యాసిగా స్థిరపడ్డాడు. ఇతని ప్రతిబా విశేషాలను చూసిన కూచా రాజు ఇతనికి ‘కువో షిహ్’ బిరుదుతో (kuo-shih జాతీయ గురువు) గౌరవించాడు. ఈ రాజు యొక్క చిన్న సోదరి ‘జీవిక’ గొప్ప విదుషీమణి. అమోఘమైన జ్ఞాపక శక్తి కలది. రాకుమారి అయిన జీవిక సాటి రాకుమారులను కాదని, కుమారయానను చూసినంతనే అతనినే వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెలిబుచ్చింది. రాజు కూడా [[బౌద్ధ బిక్షువు]] అయిన కుమారయానుని తన సోదరితో వివాహానికి అంగీకరించమని కోరడం, నచ్చచెప్పడం జరిగి చివరకు జీవిక-కుమారయానుల వివాహం జరిగింది. వీరికి క్రీ.శ 344 లో ‘కుమారజీవుడు’ జన్మించాడు. కుమారయాన, జీవికలకు జన్మించిన కారణంగా వారి పేర్ల భాగాలతో కుమారజీవుడుగా పిలవబడ్డాడు.
 
==బాల్యం-విద్యాభ్యాసం==
పంక్తి 47:
 
==చైనాలో నిర్భందం – విడుదల==
కుమారజీవుని రాకకై వేగిరపడిన చైనా చక్రవర్తి యొక్క ఆజ్ఞ మేరకు అతని సేనాధిపతి జనరల్ ‘లుగుయాంగ్’ (Gen. Lu Guang) క్రీ.శ. 383 లో కూచా రాజ్యంపై దాడిచేసి రాజుని చంపి కుమారజీవుని బందించాడు. బందించబడే నాటికి కుమారజీవుని వయస్సు 40 సంవత్సరాలు. ఇదే సమయంలో ఉత్తర చైనా రాజ్యంలో అంతర్గత రాజకీయ పోరు సంభవించింది. కిన్ వంశానికి చెందిన పాత చక్రవర్తి చంపబడటం, యావో వంశానికి చెందిన కొత్త చక్రవర్తి అధికారంలోకి రావడం జరగడంతో సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ తన విధేయతను మార్చుకొని స్వతంత్ర్యం ప్రకటించుకొన్నాడు. యుద్ద ఖైదీ అయిన కుమారజీవుని చక్రవర్తి వద్దకు పంపకుండా తన రాజధాని ‘లియాంగ్ చౌ’గ్జౌ’ (Liangzhou) లో తన వద్దనే 16 సంవత్సరాలుకు పైగా బందీగా వుంచుకొన్నాడు. ఈ బందీ పరిస్థితులలోనే కుమారజీవుడు చైనా భాషను నేర్చుకొనడం జరిగింది. తదనంతరం రెండవ చక్రవర్తి అయిన యావో జింగ్ (Yao Xing) తన సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణికి విసిగిపోయి క్రీ.శ. 401 లో అతనిపై దాడి చేసి ఓడించి కుమారజీవుని సురక్షితంగా విముక్తి చేసి తన రాజధాని చాంగన్ కు రప్పించుకొన్నాడు. ఈవిధంగా చైనా అంతర్గత రాజకీయ పోరులో నలిగిపోయిన కుమారజీవుడు క్రీ.శ. 384 నుండి 401 వరకు 16 సంవత్సరాలకు పైగా అకారణంగా బందీయై మగ్గిపోవలసి వచ్చింది.
 
==[[చాంగన్]] నగరంలో కుమారజీవుడు==
[[image:White Horse Pagoda, Duhuang.jpg|thumb|చైనాకు బౌద్ద గ్రంధాలను చేరవేస్తూ మరణించిన తన అశ్వానికి స్మారకంగా కుమారజీవుడు దుహాంగ్ లో నిర్మించిన White Horse Pagoda]]
16 సంవత్సరాల సుదీర్ఘ బందనం నుంచి విముక్తుడై క్రీ.శ. 401 లో రాజధాని చాంగన్ (ప్రస్తుత Xian, చైనా)లో అడుగుపెట్టిన కుమారజీవునికి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీ.శ. 366 - 416) నుండి అఖండ ఆదరణ లభించింది. చక్రవర్తి అతనిని జాతీయ గురువు (National Perceptor) గా నియమించడమే కాక రాజ గురువుగా స్వీకరించి గౌరవించాడు. బౌద్ధ సూత్రాలను, సారస్వతాన్ని చైనా భాషలోనికి అనువదించడంలో ప్రముఖ పాత్ర వహించవలసిందిగా చక్రవర్తి అతనిని కోరాడు.
 
బౌద్ద పరిభాషను, బుద్దుని యథార్ధ బోధనలను అర్థం చేసుకొంటూ, మూల సంస్కృత బౌద్ద గ్రంధాలలోని భావాన్ని, తత్వాన్ని అనువాదంలో స్పష్టంగా వ్యక్తం చేయాలంటే, చైనా అనువాదకునిగా స్థానిక తావో (Taoism) తాత్విక ప్రభావానికి గురికాని విదేశీ బౌద్ద సన్యాసి అవసరమవుతుంది. అప్పటికే కుమారజీవుడు మద్య ఆసియాలో అత్యంత ప్రముఖ ఆచార్యుడిగా పేరు పొందాడు. పైగా పాళీ, సంస్కృత భాషలలో దిట్ట మరియు మహాయాన బౌద్ద్దంలో కూడా పండితుడు కావడం, బౌద్ద తత్వాన్ని, ధర్మాన్ని విశిదీకరించడంలో అతనికున్న సాధికారత, అపార ప్రజ్ఞా పాటవాలు ఈ అంశాలన్నీ చైనా చక్రవర్తి కుమారజీవుని అనువాద కార్యానికి నాయకత్వం వహించవలసిందిగా కోరడానికి దారితీసాయి.
పంక్తి 97:
==చక్రవర్తి యావో జింగ్ తో కుమారజీవుని సత్సంబందాలు==
కుమారజీవుడు ఆనాటి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీ.శ. 366 - 416) తో చక్కని స్నేహపూరితమైన సంబందాలు కలిగివున్నాడు. కుమారజీవుని అసాధారణ ప్రజ్ఞా పాటవాలు, బౌద్ద ధర్మ వివరణలో అతనికున్న సాధికారత, చక్రవర్తిని అమితంగా ఆకర్షించాయి. బౌద్ద గ్రంధాల చైనా అనువాద ప్రక్రియలకు సమర్ధుడిగా అతనినే భావించిన చక్రవర్తి కుమారజీవుని శత్రు చెర నుంచి విడిపించి తన వద్దకు రప్పించుకొన్నాడు. జాతీయ గురువుగా గౌరవించడమే కాకుండా, రాజ గురువుగా ప్రకటించి తన ఆస్థానంలో అతని స్థాయిని అతి స్వల్ప వ్యవధిలోనే ఉన్నతీకరించాడు. అనువాద కేంద్రానికి నాయకుడిగా చేసి బృహత్తర అనువాద కార్యక్రమ భాద్యతను కుమారజీవుని భుజ స్కంధాలపై నిలిపాడు.
 
అదేవిధంగా చక్రవర్తి చూపిన ఆదరణ, అందించిన తోడ్పాటు, అనువాదం పట్ల చక్రవర్తికి గల ప్రత్యేకాసక్తిని గమనించిన కుమారజీవుడు చక్రవర్తి అభిమతానికి అనుగుణంగా అనువాద కార్యక్రమాన్ని రాజధానికి చేరుకొన్న ఆరు రోజుల వ్యవధిలోనే ప్రారంభించాడు. తను మరణించేవరకూ 12 సంవత్సరాలపాటు నిరాఘాటంగా అసమాన కృషితో అనువాద యజ్ఞాన్ని కొనసాగించి చక్రవర్తి అభిమానానికి పాత్రుడయ్యాడు.కుమారజీవుని ప్రభావంతో చక్రవర్తి యావో జింగ్ తన రాజ్యంలో అనేక బౌద్దాలయాలు, నిర్మించాడు. కుమారజీవుని ప్రభావం వలన ఈ చక్రవర్తి కాలంలోనే బౌద్దమతానికి తొలిసారిగా రాజ మద్దతు లభించింది. ఫలితంగా కుమారజీవుని ప్రభావంతో ఇతని రాజ్యంలో 90 శాతం ప్రజలు బౌద్దులుగా మారారని వర్ణించబడింది.
 
కుమారజీవుని ధార్మిక చింతన, ప్రతిభ, ఆద్యాత్మిక సంపన్నత చక్రవర్తిని ఎంతగా కదిలించాయంటే, సన్యాసి అయిన కుమారరజీవునికి సంతతి లేని కారణంగా, అతని అపూర్వ ప్రతిభా పాటవాలు అతనితోనే అంతరించిపోతాయనే దిగులు సైతం చక్రవర్తికి కలిగింది. ఫలితంగా ఆశ్రమజీవితం నుండి కుమారజీవుని తప్పించి ఒక అందమైన రాజ భవంతిలోకి తరలించాడు. ఆకర్షణీయమైన అంతఃపుర పడుచులను ఎన్నిక చేసి మరీ అతనికి పరిచారకులుగా నియమించి వారి ద్వారా ఉత్తమ సంతానం కలిగేటట్లుగా అనుకూల పరిస్థితులు కల్పించాడు. దీనితో బొద్ద సన్యాసిగా కుమారజీవునికి సంకట పరిస్థితి ఎదురైంది. ఒకవైపు చక్రవర్తి ఆజ్ఞ ధిక్కరిస్తే అనువాద కేంద్రం మూతబడవచ్చు. మరోవైపు పాటిస్తే సన్యాసిగా తన నియమ నిష్ఠకు భంగం వాటిలుతుంది. జాగ్రత్తగా ఆలోచించి చక్రవర్తి ఆజ్ఞకు తలవంచవలసి వచ్చింది. కొన్ని ఆధారాల ప్రకారం ప్రతికూల పరిస్థితుల ప్రభావానికి గురైన కుమారజీవుడు ఆశ్రమ జీవితం నుండి సాంసారిక జీవితానికి బలవంతంగా మళ్ళించబడ్దాడని, అతనికి సంతతి కలిగిందని తెలుస్తుంది. ఒకానొక సమయంలో అసలు సంగతులు తెలియని అతని గురువు 'విమలరక్ష'(క్రీ.శ. 337 - 413) చైనాకు వచ్చినపుడు శిష్యుడైన కుమారజీవుని జీవనరీతిని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తుంది. ఖిన్నుడైన కుమారజీవుడు గురువుతో తాను కర్మకు బందీ అయినవాడుగా, క్లేశానికి లోనైన వాడుగా వివరించి, గౌరవార్హతకు నోచుకున్నవానిగా తనకు తాను పరిగణించుకోవడం లేదని విన్నవించుకొన్నాడు. పశ్చతాపానికి లోనైన కుమారజీవుడు రాజ భవంతిలో భోగభాగ్యాల మద్య తులతూగవలసి వచ్చినప్పటికీ తన జీవన రీతిని ఒక బౌద్దాశ్రమ సన్యాసి జీవించే రీతిలోనే గడపడానికి చివరివరకు ప్రయత్నించాడు. బురద నుండి వెలువడిన పద్మం వలె తనను పోల్చుకొన్నాడు. తన శిష్యులతో, తన తోటి బౌద్దసన్యాసులతో తన జీవన రీతిని ఉద్దేశిస్తూ పద్మంను మాత్రమే చూసి దానికి అంటిన బురదని పట్టించుకోవలదని కోరాడు. తన బోదనలలోని అంతిమ సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకొనమని, తన జీవన విధానాన్ని ఆదర్శంగా గ్రహించవద్దని తరచు కోరేవాడు. ఏది ఏమైనప్పటికి సమకాలీన బౌద్ద సమాజం కూడా అతని సంకట పరిస్థితిని అర్ధం చేసుకొన్నట్లే కనిపించింది. అనువాద కృషి అవాంతరాలు లేకుండానే చివరవరకూ కొనసాగింది.
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు