బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
బుల్లెబ్బాయి స్వరాజ్యాన్ని మాయచేసి శ్మశానం దగ్గరకి రప్పించి అత్యాచారం చేయబోగా ఆమెకు గొంతు పోతుంది. రవి బుల్లబ్బాయిని తీసుకువస్తే, నేనే వాణ్ణి ధర్మపీఠం దగ్గరకు తీసుకువస్తానని రాయుడు తీసుకువెళ్తాడు. సాక్ష్యాల్ని విచారించిన బ్రహ్మన్న బుల్లబ్బాయి స్వరాజ్యాన్ని పెళ్ళాడాలని, లేని పక్షంలో రాయుడు కుటుంబం ఊరు విడిచి పోవాలని తీర్పు ఇస్తాడు. బుల్లెబ్బాయి తనకు పెళ్ళైపోతోందని తాను ఉంచుకున్న పంకజం వద్ద బాధపడుతూండగా బ్రహ్మన్న సుశీల అనే ఆవిడ ఇంట్లోకి సరుకులతో వెళ్ళడం చూసి వాళ్ళిద్దరికీ ఏమిటి సంబంధమని అడుగుతాడు. నీకూ నాకూ మధ్య సంబంధమేనని చెప్పడంతో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది. బుల్లబ్బాయి రాయుడితోనూ చెప్తారు. రాయుడు పదిమందినీ తీసుకువెళ్ళి బ్రహ్మన్నా నీకూ సుశీలకూ ఏమిటి సంబంధం అంటూ ఏకవచనంతో పిలిచి మరీ అడుగుతాడు, ఈ విషయం తెలిసి సావిత్రి తెల్లబోతుంది.<br />
బ్రహ్మన్న సావిత్రికి గతంలో జరిగింది వివరిస్తాడు. గతంలో సుశీల భర్తకు దేవాలయ నగలు దొంగిలించాడన్న ఆరోపణపై శిక్ష విధిస్తారు. ఆ అవమానం తట్టుకోలేని అతను మృతి చెందుతాడు, పాముకాటుతో పూజారి తప్పు తెలుసుకుని ఆ నగలు దొంగిలించింది తానేనని చెప్పి మరణిస్తాడు, తన తప్పు తీర్పు వల్ల జరిగిన దారుణాన్ని చూసి చలించిన బ్రహ్మన్న పొరుగూళ్ళో ఉన్న సుశీలను కాపాడి, పిల్లల్ని చదివించి విద్యాధికుల్ని చేస్తాడు. ఇన్నాళ్ళూ స్వంత చెల్లెలిలా చూసుకున్నానని, అందుకే ఆమె పిల్లలతో మావయ్యా అని పిలిపించుకున్నానని వివరిస్తాడు బ్రహ్మన్న. దాంతో సావిత్రికి బ్రహ్మన్నపై గౌరవం మరింత పెరుగుతుంది.<br />
గత్యంతరం లేక స్వరాజ్యాన్ని బుల్లబ్బాయి పెళ్ళి చేసుకుంటారు. బ్రహ్మన్న కుమార్తె రాజేశ్వరి, సుశీల కొడుకు రాంబాబు ప్రేమించుకుంటున్న విషయం రవి తెలుసుకుని బ్రహ్మన్న దగ్గరకు తీసుకువెళ్తాడు. బ్రహ్మన్న వాళ్ళ ప్రేమను అంగీకరించి, త్వరలోనే పెళ్ళి చేస్తానని చెప్తారు. ఇంతలో రాయుడు ఆ పెళ్ళి జరగడానికి వీలు లేదని అడ్డువస్తారు. అంతకుముందు రాజేశ్వరి నది ఒడ్డున ఊయలవూగుతుంటే నారాయణ కత్తితో చెట్టుకు కట్టిన తాడు తెంచివేస్తారు. ఆమె నారాయణపైనే ఊగుతూ పడడంతో అతని కళ్ళుపోతాయి. నారాయణ తల్లిదండ్రులు కొడుకే ఆధారంగా జీవిస్తున్నామని న్యాయం అడగడంతో తర్వాతిరోజు న్యాయవిచారణ ఏర్పాటుచేస్తారు బ్రహ్మన్న.<br />
ధర్మపీఠం వద్ద రవి రాజేశ్వరి పక్షాన, రాయుడు నారాయణ పక్షాన వాదిస్తారు. చివరకు తన వల్ల కళ్ళుపోయిన నారాయణతోనే రాజేశ్వరి పెళ్ళి కావాలని, ఆమె వారి తల్లిదండ్రుల్ని అతన్నీ చూసుకోవాలని తీర్పునిస్తాడు. రవి ఆ తీర్పును వ్యతిరేకించి రాంబాబు, రాజేశ్వరిల పెళ్ళి చేస్తారు. ఆ విషయం బ్రహ్మన్నకు తెలియగా అన్నదమ్ముల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ధర్మపీఠం మీది కత్తిని బయటకులాగి తమ్ముణ్ణి నరుకుతానని ఆవేశంగా ప్రయత్నిస్తారు బ్రహ్మన్న.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు