పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 233:
ప్రధానముగా హిందూవులలో నాలుగు విధానలైన వివాహ పద్ధతులున్నాయి. అవి. 1. [[బ్రహ్మీ వివాహం]].2. గాంధర్వ వివాహం, 3. క్షాత్ర వివాహం. 4. రాక్షస వివాహం. [మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు.]
 
 
==ముస్లిం వివాహం==
{{Main|నికాహ్}}
[[File:Nikah 003.jpg|thumb|A Muslim bride of [[Pakistan]] origin signing the ''nikkah nama'' or [[marriage certificate]].]]
[[File:Muslim wedding in India.jpg|thumb|A Muslim couple being wed alongside the [[Tungabhadra River]] at [[Hampi]], India.]]
ముస్లిం మతాచార వివాహం ఒక పవిత్ర కార్యం కాదు. అది స్త్రీ పురుషుల మధ్య మత సమ్మతి పొందిన ఒక ఒప్పందం. ముస్లిం వివాహపు ముఖ్య ఉద్దేశ్యం స్త్రీ పురుషులు న్యాయ బద్ధమైన వైవాహిక జీవితం గడపడం. వైవాహికేతర సంబంధం ముస్లిం ధర్మ శాస్త్రం ప్రకారం అపవిత్రమైన సంబంధం. ఇది వ్యభిచారంతో సమానం. ఆలాంటి సంబంధం కలిగి వున్న స్త్రీ పురుషులకు జన్మించిన సంతానం అక్రమ సంతానంగా ముద్ర వేయబడి వారికి సక్రమ సంతానానికి లభించే హక్కులు ఏవీ సంక్రమించవు. పెళ్ళి తప్పక చెయ్యాలని అందరు ప్రవక్తలు చెప్పారు. పెళ్ళి సగం విశ్వాసం అన్నారు. వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థకు పునాది, సమాజాన్ని సక్రమంగా పట్టి ఉంచే వల అన్నారు. వివాహం స్త్రీ పురుషుల మధ్య చట్టపరమైన ఒడంబడిక, సామాజిక కట్టుబాటు. ముస్లిం పురుషుడు నలుగురు స్త్రీల వరకు పెళ్ళి చేసుకోవచ్చు. ముస్లిం స్త్రీ మాత్రం ఒకే పురుషుడిని చేసుకోవాలి.
===ముస్లిం వివాహ చెల్లుబాటుకు ముఖ్య షరతులు===
న్యాయ సమ్మతమైన ముస్లిం వివాహానికి ఎటువంటి ప్రత్యేకమైన మతపరమైన కార్యక్రమాలు, క్రతువులూ ఉండవు. యుక్త వయస్సు వచ్చి వివాహా ఒప్పందానికి అంగీకరించగలిగే ప్రతి వ్యక్తీ వివాహానికి అర్హులే. యుక్త వయసు అంటె 15 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండటం. మైనర్ ముస్లిం బాలికకు వివాహం జరపడానికి ఆమె సమీప సంరక్షుడి అనుమతి అవసరం. బాల్య వివాహాల చిరోధక చట్టం 1978 ముస్లిఖ్ మతస్థులకు కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం బాలికలకు 18 సం.లు, బాలురకు 21 సం.లు కనీస వివాహ పరిమితిగా నిర్ణయించబడినది. ఈ షరతును ఉల్లంఘించటం శిక్షించదగిన నేరం.
 
ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి ముఖ్యమైన షరతు ఒకరిచే వివాహ ప్రతిపాదన మరొకరిచే అనుమతి ఈ ప్రతిపాదన, అనుమతి ప్రక్రియ ఇద్దరు మతిస్థిమితం కలిగిన వ్యక్తుల సమక్షంలో ఒకే సమావేశంలో జరగాలి. ఈ ప్రక్రియలో వివాహ ఒప్పందానికి జరిపే సంభాషన స్పష్టంగానూ ఎటువంటి అపోహలకు తావు ఇవ్వనిదిగానూ ఉండాలి. ఈ ఒప్పందం సమయంలో వరుడు వధువుకు మెహర్ చెల్లింపుకు అంగీకరించాలి. ఈ చెల్లింపు ఉద్దేశ్యం భార్యపట్ల భర్తకున్న గౌరవాన్ని ప్రకటించడ. మెహర్ నగదు రూపంలో గానీ, ఆస్తి రూపంలో గానీ ఉండవచ్చు. మెహర్ చెల్లించే ఒప్పందం ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి మరొక ముఖ్య అంశం.
 
ముస్లిం, విగ్రహారాధన, అగ్ని ఆరాధన అవలంబించే వారిని వివాహం చేసుకోరాదు. అలాగే తన భర్య తరపు పైస్థాయి క్రింది స్థాయి వారసులను పూర్వీకులను లేదా వారి సంతానాన్ని వివాహం చేసుకోరాదు. పెంపుడు బిడ్డలను వివాహం చేసుకోవడం నిషిద్ధం. ఒక ముస్లిం స్త్రీకి రెండు సం.లు వయసులోపు గల బిడ్డ తల్లి పాలు పొందకలగడం వల్ల పెంపుడు బిడ్డగా చెప్పబడుతోంది. అయితే ఒక ముస్లిం వ్యక్తి తన తల్లి వద్ద పాలు త్రాగిన పెంపుడు సోదరిని పెళ్ళి చేసుకోవచ్చు. మత పవిత్ర గ్రంథం బహు భార్యత్వాన్ని నిషేధించినప్పటికీ కొన్ని మినహాయింపులు యివ్వబడ్డాయి.
===వైవాహిక హక్కుల పునరుద్ధరణ===
దంపతులలో ఒకరు మరొకరిని సరైన కారణం లేకుండా విడిచి వేరుగా జీవిస్తున్నట్లయితే బాధిత భార్య లేదా భర్త కోర్టులో దాంపత్య జీవనం పునరుద్ధరణ కోసం దావా దాఖలు చేయవచ్చు. ఉదా: ఇలాంతి దావాను భర్త దాఖలు చేసినట్లైతే భార్య ఈ క్రింది విధాలుగా తన వాదనలను కోర్టులో విన్నవించుకొని తను భర్తతో ఏ కారణం చేత కాపురం చేయలేక పోతున్నదో విశదీకరించవచ్చు. ఈ కారణాలు:
# భర్త క్రూర ప్రవర్తన వల్ల భార్యకు ప్రాణభయం కలగడం
# భర్త తన దాంపత్య బాధ్యతలను నిర్వర్తించలేకపోవడం
# వివాహం సక్రమంగా జరగక చెల్లుబాటు కాకపోవడం
# భర్త మతం నుంది వెలివేయబడటం.
# భర్త భార్యకు చెల్లించాల్సిన మెహర్ చెల్లించకపోవడం.
 
పై కారణాలలో క్రూరత్వం అంటె భర్త భార్యకు దైహికమైన, మానసికమైన బాధలు కలుగజేయటం తద్వారా ఆమె ప్రాణ భయానికి లోనవ్వడం లేదా ఆమెకు ఆరోగ్య భంగం కలగడం వంటి చర్యలు. దాంపత్య జీవిత పునరుద్ధరణ కోసం బాధిత దంతతులలో ఎవరైనా సమీపంలోనికుటుంబ న్యాయస్థానం, అట్టి నాయ స్థానం లేనిచోట సాధారణ సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు.
===ముస్లిం వివాహం - విడాకులు===
ముస్లిం వివాహం రద్దు కావడానికి భార్యాభర్తల వైవాహిక సంబంధానికి ముగింపు పలకడానికి 3 విధానాలు అమలులో ఉన్నాయి. అవి.
# తలాక్ : దీని ద్వారా భర్త ముస్లిం మతాచారం ప్రకారం జరిగిన వివాహంలోని భార్యకు విడాకులు ఇవ్వవచ్చు.
# ఒప్పందం: భార్యా భర్తలు స్వంచ్చందంగా రాసుకున్న ఒక ఒప్పందంలో భార్య తన మెహర్ ను లేదా తనకు చెల్లించవలసిన మెహర్ ను వదులుకొని వివాహ రద్దుకు అంగీకరించటం.
# కోర్టు డిక్రీ : ముస్లిం వివాహాల రద్దు చట్టం 1939 ప్రకారం కోర్టుల ద్వారా విడాకుల డిక్రీని పొందవచ్చు.
 
తలాక్ విధానంలో పెళ్ళీ రద్దు కావటానికి పవిత్ర ఖురాన్ లో ధర్మ ప్రవచనం చేయడం జరిగింది. దీని ప్రకారం సరైన కారణం ఉండి తలాక్ కు పూర్వమే భార్యాభర్తల మద్య వారి వారి కుటుంబాల నుంది చెరొకరు ఎంఫిక చేసిన ఇద్దరు అంధ్యవర్తుల ద్వారా సమస్యను రాజీపరిష్కారం కోసం ప్రయత్నం జరిపి ఉండాలి. ఆ ప్రయత్నం విఫలమైతే "తలాక్" చెల్లుబాటవుతుంది. తలాక్ అనేది నోటి మాట ద్వారా గానీ లిఖిత పూర్వకంగా గానీ ప్రకటించాలి. దీనికి ప్రత్యేకమైన నమూనా అంటూ ఏమీ లేదు. అయితే ఈ ప్రకటనలో భర్త చెప్పే లేదా ఉచ్చరించే మాటలు వివాహం రద్దు కావడానికి మాత్రమే ఉద్దేశించబడాలి. ముస్లిం భర్త తన ముస్లిం భార్యకు కోర్టు ప్రమేయం లేకుండనే విడాకులు ప్రకటించవచ్చు.
 
===ముస్లిం స్త్రీ విడాకులు పొందడం===
 
<!--
==వివాహ వయస్సు==
స్త్రీకి సంతాన యోగ్యత 18 నుండి 25 వరకూ ఎక్కువగా ఉంటుంది. 25 నుండి 30 వరకూ సంతాన యోగ్యత తగ్గుతుంది. 30 పైబడిన తర్వాత చాలా అరుదుగా మాత్రమే సంతాన యోగ్యత ఉంటుంది. పురుషుడికి వీర్యకణాల ఉత్పత్తి 25 నుండి 70 సంవత్సరాల వరకూ ఉంటుంది. కనుక వివాహానికి స్త్రీకి కనీసం 18 సంవత్సరాలు, పురుషుడికి కనీసం 25 సంవత్సరాలు ఉండాలి, భార్యా భర్తల మధ్య 3 నుండి 10 సంవత్సరాల తేడా ఉండవచ్చు, భర్త కంటే భార్య చిన్న వయస్కురాలై ఉండాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని భావించేవారు. కాని నేడు నగరాల్లో స్త్రీలు 30 సంవత్సరాలు దాటితే గాని వివాహానికి సిద్ధం కావడం లేదు. ఫలితంగా సంతానం కోసం వైద్యుల చుట్టూరా తిరుగుతున్నారు.
-->
 
==ముస్లిం వివాహం==
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు