కొండపల్లి బొమ్మలు: కూర్పుల మధ్య తేడాలు

"Kondapalli Toys" పేజీని అనువదించి సృష్టించారు
"Kondapalli Toys" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4:
== చరిత్ర ==
రాజస్థాన్ నుంచి తరతరాల క్రితం వలసవచ్చిన నిపుణులు ఈ బొమ్మలు రూపొందిస్తూంటారు. ఈ బొమ్మలు రూపొందించే నిపుణుల్ని ‘ఆర్యక్షత్రియులు’గా పిలుస్తూంటారు. వలస వస్తూ ఈ కళాకారులు 16వ శతాబ్దంలో తమతో పాటుగా బొమ్మలు తయారుచేసే కళను తీసుకువచ్చినట్టు చెప్తూంటారు. ఈ నాలుగువందల ఏళ్ళ సంప్రదాయం తరం  నుంచి తరానికి అందుతూ వచ్చింది. ఆ క్రమంలో కొండపల్లిలోని బొమ్మల కాలనీలో కుటుంబంలోని ప్రతివారూ బొమ్మల రూపొందించడంలో పాలుపంచుకుంటున్నారు. ఈ సముదాయం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది. ఈ సముదాయం  శివుడి నుంచి కళలు, నైపుణ్యం పొందిన ముక్తాఋషి తమకు ఆద్యుడని పేర్కొంటూంటారు. ఈ నిపుణులు ఆంధ్రప్రదేశ్ లోని అనేక ఆలయాల్లో గరుడుడు, నంది, సింహం, వాహనాలు వంటివాటి విగ్రహాలను తమ పూర్వీకులు చెక్కినట్టుగా చెప్తారు. కాలక్రమేణా కొండపల్లి కొయ్యబొమ్మలు ఆటబొమ్మల నుంచి సేకరణ వస్తువులయ్యాయి. విపణిలో మార్పుకు ఇది కారణమైంది, ఎందుకంటే పిల్లల బొమ్మలు పాడవగలిగేవి  మళ్ళీ మళ్ళీ కొనేవి కాగా సేకరణ వస్తువులు ఒకసారి కొన్నాకా భర్తీ చేయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది. దసరా, సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు, దానిలో ఈ కొయ్యబొమ్మలు అంతర్భాగం. వేడుకగా స్త్రీలు తాము సేకరించిన వివిధ కొయ్యబొమ్మల్ని ప్రదర్శిస్తారు. వేడుకలో స్త్రీలు, పిల్లలు ఆసక్తిగా పాల్గొంటూంటారు. ఈ పండుగల సమయంలో కొండపల్లి బొమ్మల నిపుణులు ప్రధానంగా తమ వ్యాపారం చేస్తున్నారు. ఐతే ఈ సంప్రదాయాలు క్రమంగా కళ తప్పుతూండడంతో నిపుణులు గిట్టుబాటు కోసం సహజమైన రంగులను వదిలి ఎనామెల్ రంగులు వంటివాటిని వినియోగిస్తున్నారు. బొమ్మల వ్యాపారంలో యంత్రాల వినియోగం వంటివి వచ్చి చేరి కొండపల్లి నిపుణుల వ్యాపారం దెబ్బతీస్తున్నా ప్రస్తుతం ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ సంస్థలు దృష్టిపెడుతున్న కారణంగా వీరికి సహకారంగా ఉంది.
[[దస్త్రం:Wood_craft_models_on_display_at_Shilparamam_in_Hyderabad.jpg|thumb|హైదరాబాద్ లోని శిల్పారామంలో కొయ్య బొమ్మల నమూనాలు<br>
]]
 
== Referencesబొమ్మలు ==
తెల్ల పొణికి అని పిలిచే స్థానిక చెక్క రకం వాడి చెక్కి, ఆపై కూరగాయల నుంచి లభించే రంగులను, సహజ రంగులను, ప్రస్తుతం కొంతవరకూ ఎనామిల్ రంగులను వాడి తయారుచేసే ఈ బొమ్మలు కళాత్మకమైన పనితనానికి ప్రాచుర్యం పొందాయి.  Traditional Kondapally palm tree toys, bullock carts toys, caparisoned elephant toys, village backdrop toys, Brindavana etc.
 
== మూలాలు ==
{{Reflist}}
 
== బయటి లంకెలు ==
* http://www.dsource.in/resource/wooden-toys-kondapally/index.html
[[వర్గం:కృష్ణా జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి_బొమ్మలు" నుండి వెలికితీశారు