కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
}}
 
'''కాకినాడ''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. [[న్యూయార్క్]] నగరము మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసుగానూ[[మద్రాసు]] గానూ, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబయిగానూ[[ముంబయి]]] గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ [[పారడైస్]] గా పేరొందినది. [[ఆంధ్రప్రదేశ్]] పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి [[కాకినాడని]] ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో కె.జి బేసిన్ రాజధానిగా[[రాజధాని]] గా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.
 
==కాకినాడ పేరు వెనుక ఇతిహాసం==
[[File:Kakinada written in telugu 2013-12-31 13-26.jpg|thumb|250px|'''కాకినాడ''']]
[[కాకినాడ]] అనే పేరు వెనుక అనేక కథలు ఉన్నాయి.
* [[కాకినాడ]] పేరు మొదట '''కాకి నందివాడ''' అని ఉండేదని, అది కాలక్రమముగా [[కాకినాడ]] గా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం [[కాకినాడ]] పేరు కొకనాడగా చలామణి అయ్యింది.
* త్రేతాయుగం లొ ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు [[రాముడు]] అతనిని సంహరించినాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
* ఇక్కడకి మొదట [[డచ్]] వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత [[ఆంగ్లేయులు]] వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత [[కెనడా|కెనడియన్‌]] బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు [[కాకినాడ]] నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా[[కాకినాడ]] గా వాడుకలోకి వచ్చింది.
* బ్రిటీషువారి కాలంలో కాకెనాడ /కోకనాడ (Cocanada) గా పిలువబడి, స్వాతంత్ర్యం వచ్చాక పేరు కాకినాడగా[[కాకినాడ]] గా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిషు వారి పరిపాలన సమయం లో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కోకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - [[కాకినాడ]] పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.
* ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి ఎర్రకలువ (కోకనదము)లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది.
* బిటీష్‌ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులలో ఇక్కడ పండే పంటల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. సర్వే అధికారులు, పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ’ అంటూ పేర్కొన్నారట! కాలక్రమంలో ‘కాకివాడ’గా, ‘కాకినాడ’గా‘[[కాకినాడ]]’గా మారిపోయింది!
 
==నైసర్గిక స్వరూపము==
[[File:Satellite kkd.jpg|thumb|ఉపగ్రహ చాయాచిత్రంలో హోప్ ఐలాండ్ మరియు కాకినాడ]]
[[కాకినాడ]] 16.93° ఉత్తర అక్షాంశం (latitude)దగ్గర, 82.22° తూర్పు రేఖాంశం (longitude) దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం [[కాకినాడ]] మీదుగా పోతుంది. సగటున [[కాకినాడ]] ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది. నగరం యొక్క సరాసరి వెడల్పు 6 కి.మీ కాగా, పొడవు 15 కి.మీలు.
 
స్థూలంగా, నగరం రెండు ప్రాంతాలుగా ఉంటుంది. దక్షీణ ప్రాంతమైన జగన్నాధపురాన్ని, మిగిలిన నగరాన్ని విడదీస్తూ బకింగ్ హాం కాలువ ఉంటుంది. స్థానికంగా, దీనిని ఉప్పుటేరు గా పిలుస్తారు. డచ్ కోరమాండల్ వారి వలసల కాలంలో, [[జగన్నాధపురం]], [[డచ్]] ఈస్టిండియా కంపెనీకి చెందిన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 1734 సం. నుండి 1834 సం. వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.
 
ఉత్తర ప్రాంతం అయిన [[కాకినాడ]], శివారు గ్రామాలు ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరం నుండి దక్షిణం వఱకూ ఉన్న పారిశ్రామిక గొలుసు, నగరం యొక్క తూర్పు ప్రాంతాన్ని సముద్రతీరం నుండి వేరుచేస్తోంది. కాకినాడకి[[కాకినాడ]] కి అగ్నేయంగా [[కాకినాడ]] అఖాతం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న మడ అడవులు, భారతదేశంలో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇదే ప్రాంతం కోరంగి అభయారణ్యానికి నెలవు. గోదావరికి పాయలలో ఒకటైన 'గౌతమి', కాకినాడకి[[కాకినాడ]] కి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.
 
===హోప్ ఐలాండ్===
[[కాకినాడ]] తీర ప్రాంతం అంతా '''[[హోప్ ఐలాండ్]]''' (హోప్ ద్వీపం) ([http://wikimapia.org/#lat=16.971139&lon=82.346478&z=13&l=0&m=a&v=2 వికీమాపియాలో హోప్ ఐలాండ్]) చేత పరిరక్షింపబడుతున్నది. [[సముద్రం|సముద్రపు]] ([[బంగాళా ఖాతము]]) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ [[హోప్ ఐలాండ్]] తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉన్నది. [[కాకినాడ]] సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ [[హోప్ ఐలాండ్]] వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి.
మహలక్ష్మీ టూరిజం, చొల్లంగిపేట వారి హోప్ ఐలాండ్ విహార యాత్ర మట్లపాలెం లో ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు