రామశర్మ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
ఈ నాటక ప్రదర్శన కారణంగానే రామశర్మకు [[అదృష్టదీపుడు]] చిత్రంలో అవకాశం దొరికిందని విని నాగయ్య ఎంతో సంతోషించారు. సిద్ధారుడు పాత్రతో అతను పాపులర్ కనుక సిద్దార్ట్ అని పేరు మార్చుకోమని నాగయ్య సూచించారు. కానీ తన అసలుపేరుతోనే నటిస్తానని చెప్పారు రామశర్మ ఆ రోజులలో దర్శకుడు కానీ, హీరో కానీ డిగ్రీ హోల్డర్ అయితే ఆ డిగ్రీతో సహా టైటిల్స్ వేయడం జక ఫ్యాషన్ గా ఉండేది. అలాగే రామశర్మ నటించిన చిత్రాల టైటిల్స్లో రామశర్మ బి.ఎ. అనే వేసేవారు.
 
అదృష్టదీపుడు చిత్రం విజయవంతమయింది. కానీ రామశర్మ రెండవ చిత్రం [[నవ్వితే నవరత్నాలు]] సక్సెస్ కాలేదు. హీరోయిన్ కృష్ణకుమారికి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. నవ్వితే నవరత్నాలు, కాంచన, మంజరి, ఆకాశరాజు, గుమాస్తా-ఆదర్శం, ఆడజన్మ, మరదలు పెళ్లి, పరోపకారం, ప్రపంచం, నాచెల్లెలు, పల్లెపడుచు, మేనరికం, నాఇల్లు, భక్తరామదాసు, సంతోషం, బంగారుపాప ..ఇలా సుమారు ఒక 25 కి పైగా చిత్రాలలో కథానాయకునిగా రామశర్మ నటించారు.సావిత్రి, జి.వరలక్ష్మి, అంజలి, కృష్ణకుమారి, పద్మ, సూర్యకుమారి, పద్మిని తదితర నాయికల నడుమ నాయకునిగా వెలిగారు. రామశర్మతో ఎక్కువగా తమిళ నిర్మాతలు తెలుగు చిత్రాలు నిర్మించడం గమనార్హం.
 
రామశర్మకు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ బాగానే ఉండేది. ముఖ్యంగా సినీ పత్రికలవారితో స్నేహంగా మెలిగేవారు. ఆ కారణం చేత విపరీత మైన పబ్లిసిటీ వచ్చేది. 'రేరాణి', 'రూపవాణి', మోహిని', 'గుండుసూది', 'సినీ జగత్ వంటి పత్రికల ముఖచిత్రాల్లో శర్మ స్టిల్స్ వేసేవారు. రామశర్మను ఎలాగయినా వార్తలలోకి ఎక్కించాలని కృష్ణ కుమారి-రామశర్మల జంటగురించి గాలివార్తలు నీలివార్తలు పోగుచేసి సినీ పత్రికలు నింపేవి. కృష్ణ కుమారి-రామశర్మల వివాహం జరగొచ్చు అన్నంతగా వార్తలు రాశాయి. ఆ రోజుల్లో హీరోల మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే జర్నలిస్టుల సహకారం కావాలని గ్రహించిన రామశర్మ వారితో చాలా సన్నిహితంగా మెలిగేవారు. తను గురించి ఎప్పుడు పత్రికలలో ఏదో ఒక వార్త వచ్చేలా శ్రద్ధ వహించేవారు. దీని వల్ల రామశర్మకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
 
ఆరోజులలో రామశర్మ, సావిత్రిల జంట చూడ ముచ్చటగా ఉండేది. వాళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారేమోనని కూడా చాలామంది చెప్పకునేవారట. రామశర్మ కెరీర్ 1956తోనే పూర్తయిందని చెప్పాలి. ఎందుకంటే హీరోగా చాలా బిజీగా ఉన్న రోజులలో కుటుంబ సమస్యల కారణంగా ఓ ఏడాది పాటు ఆయన చిత్రరంగానికి దూరం కావాల్సి వచ్చింది. ఆ సమస్యలను పరిష్కరించు కుని తిరిగి చిత్రపరిశ్రమకి వచ్చేసరికి ఆయన స్థానాన్ని అనేక మంది కొత్త తారలు ఆక్రమించడం జరిగింది.
==జీవిత చరమాంకంలో==
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/రామశర్మ_(నటుడు)" నుండి వెలికితీశారు