రామశర్మ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''ఉప్పులూరి రామశర్మ''' గౌతమబుద్ధ నాటకంలో బుద్ధుని వేషం ద్వారా పేరు తెచ్చుకుని సినిమాలలో ప్రవేశించాడు. ఇతనిది కాకినాడ. సినిమాలలో నాయక, ఉపనాయక పాత్రలు ధరించాడు.అందగాడైన రామశర్మ సంభాషణలు చెప్పటంలో సైతం మేటి. కృష్ణకుమారి తొలి చిత్రం 'నవ్వితే రత్నాలు' బిఎన్‌ కళాత్మక చిత్రం బంగారుపాప, సావిత్రితో మేనరికం, ప్రపంచం చిత్రాల్లోనూ నటించారు.<ref>[http://www.visalaandhra.com/movieworld/article-36028 తళుక్కుమని మెరిసి మరుగైన నటులు]</ref>
==జీవిత విశేషాలు==
రామశర్మ పూర్తి పేరు "ఉప్పలూరిఉప్పులూరి వీర వెంకట ప్రభాకర రామశర్మ". ఆ పేరు చాలా పెద్దదిగా ఉందని భావించి సినిమాలలోకి వచ్చిన తర్వాత రామ శర్మగా తన పేరు కుదించుకున్నారు. ఆయన స్వస్థలం పిఠాపురం. అక్కడే హైస్కూల్ వరకూ చదువుకున్నారు. తర్వాత కాకినాడలో గణిత శాస్త్రంలో బి.ఎ. చేశారు.
 
సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలనే కోరికతో బొంబాయి వెళ్లి ఫజల్ బాయి ఇనిస్టిట్యూట్ లో చేరారు. అక్కడ ఉండగానే ఛాయాగ్రాహకుడు బోళ్ల సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన సలహాపై మద్రాసు వెళ్లి సినిమాల్లో అవకాశం కోసం చాలా ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కొంతకాలం చూసి ఇక లాభం లేదనుకుని పిఠాపురం తిరిగివెళ్లి పోయారు రామశర్మ ఆయనలోని ఉత్సాహాన్ని గమనించి వాళ్ల ఊరివాడే అయిన పంతం చిన్నారావు రామశర్మ హీరోగా ఒక సినిమా తీద్దామని ప్రయత్నించారు కానీ అదీ కుదరలేదు.
పంక్తి 28:
 
ఒకింత నిరాశకు గురయినా తనని తేను సముదాయించుకుని నాటకాల మీద దృష్టి కేంద్రీకరించారు రామశర్మ. అదే సమయంలో తమిళనాడు టాకీస్ అధినేత సౌందరరాజన్ అంతా కొత్త వారితో ఒక సినిమా తీసే ప్రయత్నాలలో ఉన్నారు. ఆ విషయం తెలిసి దాసు అనే ప్రొడక్షన్ మేనేజర్ రామశర్మను సౌందరరాజన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన్ని చూడగానే మేకప్ టెస్ట్, కాస్యూమ్స్ టెస్ట్ ఏమీ చేయకుండానే ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు. అందులోనూ ద్విపాత్రాభినయం. తొలి చిత్రంలోనే రెండు పాత్రలు చేసే అవకాశం అతి అరుదుగా లభిస్తుంది. అందుకే రామశర్మ అదృష్టవంతుడని అభినందించేవారంతా. అన్నట్లు ఆయన తొలి సినిమా పేరు "అదృష్టదీపుడు" కావడం గమనార్హం. ఈ చిత్రంలో అదృష్టదీపుడు, హరిదత్తుడు పాత్రలను రామశర్మ పోషించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావుకు కూడా ఇదే తొలి సినిమా. ఇందులో విక్రభద్రుడు పాత్రను పోషించారాయన.
 
==నాగయ్య ప్రోత్సాహం==
రామశర్మ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ఒక రకంగా నాగయ్య కారకులని చెప్పాలి. అదేలాగంటే.. తన గౌతమబుద్ధ నాటకాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించాలనే కోరిక రామశర్మకు ఉండేది. ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఆనాటి ప్రముఖ నటుడు నాగయ్యను కలిశారు. రామశర్మ కోరికను మన్నించి గౌతమబుద్ద నాటక ప్రదర్శనని మద్రాసులో ఏర్పాటు చేసి చిత్ర ప్రముఖులను ఆహ్వానించారు నాగయ్య.
"https://te.wikipedia.org/wiki/రామశర్మ_(నటుడు)" నుండి వెలికితీశారు