బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
దక్షిణ భారతదేశంలో నిర్మితమైన తొలి సినిమా [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకల్యాణం(1934)]]లో రాజరత్నం సీత. అంతవరకూ ఉత్తరదేశంలో నిర్మితమవుతూ వచ్చిన తెలుగు సినిమాలు- 'సీతా కల్యాణం'తో మద్రాసులో మొదలైనాయి. [[పినపాక వెంకటదాసు]] గారు, వేల్‌ పిక్చర్స్‌ పేరుతో తడికెలతో స్టూడియో (ఆళ్వార్‌పేటలో) కట్టి 'సీతాకల్యాణం' తీశారు. చిత్రపు నరసింహారావు దర్శకుడు. కల్యాణి అనే ఆయన రాముడు. రాజరత్నానికి ఇది తొలి సినిమా.
 
మధ్యలో ఒకటి రెండు చిత్రాల్లో నటించినా, నాటకాల్లోనూ నటిస్తూ- [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్లీ పెళ్లి(1939)]] చిత్రంలో నటించిన పాత్రకూ, పాడిన పాటలకీ ప్రశంసలు లభించాయి. రాజరత్నం ఇందులో రెండో నాయిక. ప్రధాన నాయిక కాంచనమాల. [[కొచ్చర్లకోట సత్యనారాయణ]], రాజరత్నం జంట. ఆమె పాడిన 'చెలి కుంకుమమే, పావనమే', 'కోయిలరో, ఏదీ నీ ప్రేమగీతి', 'గోపాలుడే' పాటలు ఆ రోజుల్లో చాలా పాపులరు. కాంచనమాలతో కలిసి పాడిన 'ఆనందమేగా వాంఛనీయము' కూడా అందరూ పాడుకునేవారు. ఈ సినిమాతో రాజరత్నానికి మంచి పేరు వచ్చినా, నాటకాల్లో కూడా నటించేది. వై.వి.రావు అటు తర్వాత తీసిన [[విశ్వమోహిని]](1940)లో నటించిందామె. 'ఈ పూపొదరింటా' పాట జనరంజకమైంది. పెద్ద హిట్టయిన 'మళ్లీ పెళ్ళి' తర్వాత, అంతటి పెద్ద హిట్టూ [[బి.ఎన్‌.రెడ్డిగారిరెడ్డి]]గారి [[దేవత (1941 సినిమా)|దేవత(1941)]]. [[చిత్తూరు నాగయ్య]] సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట- 'రాదే చెలి నమ్మరాదే చెలి- మగవారినిలా నమ్మరాదే చెలీ' ఇప్పటికీ నాటితరం వారికి బాగా గుర్తు. అలాగే అందులో ఆమె 'నిజమో కాదో', 'ఎవరు మాకింక సాటి' పాటలు కూడా పాడింది. ఇంకో పాట కూడా అందరి నోటా వినిపించేది. అది 'జాగేలా వెరపేలా త్రాగుము రాగ సుధారసము'. ఈ పాటలన్నీ సముద్రాల రాఘవాచార్య రాశారు.
 
సినిమాలకి వచ్చిన తర్వాత కూడా రాజరత్నం పది, పన్నెండు ప్రయివేట్‌ గీతాలు గ్రామ్‌ఫోన్‌కి పాడింది. సినిమాలకి నిదానంగా ప్లేబాక్‌ విధానం వస్తోంది. [[వందేమాతరం (1939 సినిమా)|వందేమాతరం(1939)]]లో నాగయ్య, కాంచనమాల పాడిన పాటలు ముందే రికార్డు చేసి, ప్లేబాక్‌ పద్ధతిలో చిత్రీకరించారు. ప్లేబాక్‌ కాకపోయినా, కృష్ణ అనే అబ్బాయికి సాబూ పాడాడు. ఒకరికి ఇంకొకరు పాడడం ఇలా మొదలైనా, ఈ పాట ముందుగా రికార్డు చెయ్యలేదు. వేరొకరిచేత ముందుగా పాడించి, రికార్డు చేసి ప్లేబాక్‌ చేసి చిత్రీకరించినది- [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్లీ పెళ్లి]]లో హీరో వై.వి.రావుకి ఆ చిత్రం సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు పాడారు. ఆ లెక్కలో ఓగిరాల మొదటి నేపథ్య గాయకుడు.
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_రాజారత్నం" నుండి వెలికితీశారు