"ఎ.బి.బర్థన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''అర్ధేందు భూషణ్‌ బర్ధన్‌''' (25 సెప్టెంబరు 1924 – 2 జనవరి 2016)<ref>{{cite web|url=http://www.communistparty.in/2015/12/the-revolutionary-life-of-comrade-b.html |title=Communist Party of India (CPI): The revolutionary life of Comrade A. B. Bardhan |website=Communistparty.in |date= |accessdate=2016-01-02}}</ref> లేదా '''ఎ.బి.బర్థన్''', భారత దేశంలోని ప్రాచీన రాజకీయపార్టీ అయిన [[భారత కమ్యూనిస్టు పార్టీ]] జనరల్ సెక్రటరీ గా పనిచేసారు. సంక్షుభిత సంకీర్ణ రాజకీయాల శకంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పార్టీని సమర్థవంతంగా నడిపించారు.
==ప్రారంభ జీవితం==
ఆయన [[సెప్టెంబరు 25]] [[1924]] న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన బరిసాల్ లో జన్మించారు. ఆయన తన 15వ యేట నుండి కమ్యూనిస్టు భావాలను కలిగియుండి [[నాగపూర్]] వెళ్ళారు.<ref>http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/</ref> ఆయన 1940 లో నాగపూర్ విశ్వవిద్యాలయం లోని ఆల్ ఇందియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో చేరారు.<ref>http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/</ref> ఆ కాలంలో నిషేదింపబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా లో అదే సంవత్సరం చేరారు. ఆయన నాగపూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. ఆయన ఆర్థికశాస్త్రం మరియు న్యాయశాస్త్రాలలొ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను కూడా పొందారు.<ref>http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/</ref>
==రాజకీయ జీవితం==
తర్వాత కార్మిక నేతగా పలు ఉద్యమాలు చేపట్టారు. ఆ సమయంలో 20 సార్లు అరెస్టయ్యారు. నాలుగేళ్లకుపైగా జైలు జీవితం గడిపారు<ref>http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/</ref><ref>http://indianexpress.com/article/india/india-news-india/veteran-cpi-leader-a-b-bardhan-passes-away/</ref>. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, 1957లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగ్‌పుర్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీకి అధ్యక్షునిగానూ పనిచేశారు. 1969, 1980 సాధారణ ఎన్నికల్లో నాగ్‌పుర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 1990లో దేశ రాజకీయాల్లో ప్రవేశించి, సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. 1996లో యూపీఏ1 సంకీర్ణ ప్రభుత్వంలో సీపీఐ చేరడంలో బర్ధన్‌ కీలక పాత్ర పోషించారు. అప్పటివరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇంద్రజిత్‌ గుప్త హోంమంత్రి కావడంతో, బర్ధన్‌ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2012 మార్చి వరకూ ఆయన ఆ పదవిలోనే కొనసాగారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులకు ఆయన తన విలువైన సూచనలిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌, భాజపాయేతర పక్షాలను ఖథర్డ్‌ ఫ్రంట్‌గ పేరుతో ఒక్క తాటిపైకి తీసుకురావడంలో బర్ధన్‌ విశేషంగా కృషి చేశారు.<ref>[http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/vaamapakshaagraneta-bardhan-kannumuta-newsid-48020364 వామపక్ష అగ్రనేత బర్ధన్‌ కన్నుమూత]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1801943" నుండి వెలికితీశారు