బిరుదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
కవులను, రచయితలను వారు చేస్తున్న సాహిత్య కృషికి అభినందనీయంగా బిరుదులను ఇవ్వటం పరిపాటి. అవి మరింత ప్రోత్సాహాన్నిచ్చి మరింత కృషికి బాటలు వేస్తాయన్న ఉద్దేశ్యంతో బిరుదులను ఇవ్వడం సాంప్రదాయం.
 
== బిరుదులు-స్వభావం ==
సాధారణంగా బిరుదులన్నీ గౌరవాన్ని పెంచటానికి ఇచ్చేవే. అవి పొందినవారికి సంతోషాన్ని హెచ్చించేవే. కవి సార్వభౌముడు, కవిచక్రవర్తి బిరుదులు ఇలాంటివే. కాని కొన్ని వీటికి భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉండటం కూడా ఒకటీ అరా గమనించవచ్చు. సాహితీ కృషీవల, తెనుగులెంక వంటి కొన్ని బిరుదులు వినయాన్ని, ఒదిగి ఉండటానికి ప్రతీకలుగా నిలిచాయి. కొన్ని బిరుదులు వ్యంగ్యంతో తగిలించినవి, మరికొన్ని విపరీతార్థంతో అంటించినవీ ఉన్నాయి.
== బిరుదులు-రకాలు ==
# సామ్య బిరుదులు: పూర్వ కవులు, పురాణపురుషులు,చారిత్రక పురుషులు, విదేశీ కవి,రచయితలు, పరభాషా పండితులు, పక్షులు, జంతువులు, సూర్యచంద్రులు, నదీసముద్రాలు, రత్నాలు మొదలగు వాటితో పోల్చి ఇచ్చే బిరుదులు.
# వయసును సూచించే బిరుదులు: తరుణ,బాల, యువ, ప్రౌడ వంటి వయసుతో ప్రారంభమయ్యే బిరుదులు ఉన్నాయి.
# ప్రాంతాలతో ముడిపడిన బిరుదులు: నల్గొండ కాళోజీ, వెల్లంకి వేమన మొదలగువాటిలాగా ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించే బిరుదులు ఉన్నాయి.
# సంబంధ బాంధవ్య బిరుదులు: మిత్ర, పుత్ర, బంధువు, పితా వంటి సంబంధాలతో ఇచ్చే బిరుదులు ఉన్నాయి.
 
== ఇవీ చూడండి ==
*[[తెలుగు కవులు - బిరుదులు]]
"https://te.wikipedia.org/wiki/బిరుదు" నుండి వెలికితీశారు