శ్రీ కృష్ణదేవ రాయల రాజ సేవకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
ఈ అమరం తిమ్మర్సయ్య గారే వాకిటి కావలి తిమ్మన్న అందురు. 'అమరం మనగా పాళెపట్టుదొరల కియ్యబడు కొలది సీమ అని [[శబ్దరత్నాకరము]]లు అర్ధం చెప్పియున్నారు. బత్తెము, సైనిక బలము, జమీనుగల ఒక గొప్ప హోదా కలవారికి ఈఎ బిరుదు కలదు. విజయనగర సాంరాజ్యములోని వివిధ ప్రాంతాలలో గల కోటలకు అధ్యక్షులై దేశాన్ని పరిపాలించే ప్రభువులను అమరనాయకులనే వారు. వీరురాజోద్యోగులై, దండనాయకులై, దేశపరిపాలకులైన నాయకులు. రాజకీయోద్యోగులలో దొరలు, పారుపత్యదార్లు, రాయసంవారు, అవసరంవారు, రాచకరణాలు, అనే వివిధ హోదాలవారు కనబడుతున్నారు.
 
గోర్లంట గ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను సూరపరాజు అనే ఆయన తీర్చాడని, ఆయన వాకిటి ఆదెప్పనాయనింవారి తండ్రిపేరు తిమ్మప్పనాయకుడిన్ని [[1912]] వనాటి మద్రాసు ఎపిగ్రాఫికల్ రిపోర్టు 55వ పేరాలో ఉదహరింపబడినది.
 
అవసరం తిమ్మయని, అమరం తిమ్మయని, వాకిటి తిమ్మయ్యని అని వేరు పేర్లు గల తిమ్మప్ప నాయకుడు రాయల ముఖ్య రాజ సేవకుడుగా చెప్పుచుందురు.