బంధనాదం సాగర్ రాజు
బంధనాదం సాగర్ రాజు
ఛాయాచిత్రపటం.
జననం
గుణదల
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
విద్యడిగ్రీ
వృత్తివృత్తి
తల్లిదండ్రులుఎలిజబెత్, రజినీకుమార్
పురస్కారాలుసాధించిన పురస్కారాలు


నా పేరు బంధనాదం సాగర్ రాజు. నేను ఆంధ్ర లొయోల కళాశాలలో బి.ఏ.డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నాకు కందుకూరి విరేశలింగం గారి రచనలు అంటే ఇష్టం.


1. ప్రాజ్నన్నయయుగం అంటే

1 నన్నయ తరువాతి యుగం   2 నన్నయ యుగం   3 నన్నయ పూర్వ యుగం   4 పదమూడవ యుగం 

2. ప్రాజ్నన్నయయుగపు భాష తెలుసుకోవడానికి ఆధారాలు ఏవి ? 1 కావ్యాలు 2 తాళపత్ర గ్రంధాలు 3 శాసనాలు 4 నాణాలు

3. గుణాఢ్యుడు రచించిన కావ్యం పేరు 1 బృహత్కధ 2 అంధక అట్టకధ 3 వినయ పీటకం 4 భారతం

4 గధాసప్తసతిలో ఉన్న గాధలు ఎన్ని ? 1 1000 2 600 3 400 4 700

5 అమరావతీ స్తూపం లోని రాతిపై చెక్కిన తెలుగు మాట ఏది ? 1 చెరువు 2 అత్త 3 నాగబు 4 పాడి

6 మార్గదేశి కవితల గురించి ప్రస్తావించిన కవి 1 నన్నయ 2 నన్నెచోడుడు 3 అన్నమయ్య 4 తిక్కన

7 నన్నయ అనువదించిన తెలుగు భారతం ఏ ప్రక్రియకు చెందింది ? 1 పద్యకావ్యం 2 గద్యకావ్యం 3 చంపూకావ్యం 4 నాటకం

8 భారతానికి గల మరో పేరు 1 పంచమ వేదం 2 ధర్మ శాస్త్రం 3 నీతిగ్రంధం 4 కావ్యం

9 భారతాంధ్రీకరణలో నన్నయకు తోడ్పడిన స్నేహితుడు 1 వెంకు భట్టు 2 నారాయణాచార్యులు 3 నారాయణభట్టు 4 రాజరాజ నరేంద్రుడు

10 నన్నయరచించాడని చెప్పుకునే వ్యాకరణ గ్రంధం ఏది ? 1 వ్యాకరణ దీపిక 2 ప్రౌఢవ్యాకరణం 3 ఆంధ్ర శబ్ద చింతామణి 4 బాల వ్యాకరణం

11 నన్నయ కవితా గుణాలలో మొదటిది ఏది ? 1 ప్రసన్న కధాకలితార్ధయుక్తి 2 శైలి రమ్యత 3 ఆలంకారికత 4 నీతి బోధ

12 ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభిస్తూ నన్నయ చెప్పిన శ్లోకం 1 ఏకదంతం మహాకాయం 2 శుక్లాంబరధరం విష్ణుం 3 దేవరాజ్యసేవ్యమాన 4 శ్రీవాణీ గిరిజాశ్చిరాయ

13 నన్నయకాలంలో గణితశాస్త్ర గ్రంధం రచించిన కవి ఎవరు ? 1 పావులూరి మల్లన 2 మల్లియ రేచన 3 భీమకవి 4 అధర్వణుడు

14 తెలుగు సాహిత్యంలో నన్నయ తిక్కనల మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు ? 1 శివకవియుగం 2 ప్రబంధయుగం 3 అనువాదయుగం 4 కావ్యయుగం

15 నన్నెచోడుడు,పండితారాధ్యుడు,పాల్కురికి సోమనాధుడు - ఈ ముగ్గురిని కలిపి ఏమంటారు ? 1 వైష్ణవ కవిత్రయం 2 కవిత్రయం 3 శైవ కవిత్రయం 4 ఆరాధ్యత్రయం

16 కుమారసంభవ కావ్యాన్ని రచించినది ఎవరు ? 1 సోమన 2 బసవేశ్వరుడు 3 శ్రీపతి పండితడు 4 నన్నెచోడుడు

17 జాను తెనుగు అనే పదాన్ని మొదట వాడిన శివకవి ఎవరు ? 1 బసవేశ్వరుడు 2 సోమనాధుడు 3 నన్నెచోడుడు 4 మంచన

18 వస్తుకవిత అనే పదాన్ని వాడిన మొదటి శివకవి ఎవరు ? 1 నన్నెచోడుడు 2 మల్లికార్జునుడు 3 బసవేశ్వరుడు 4 శ్రీపతి పండితుడు

19 ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించినవారిలో ప్రధముడెవరు ? 1 నన్నయ 2 నన్నెచోడుడు 3 సోమన 4 అధర్వణంలో

20 పాల్కురికి సోమనాధుడు కావ్యరచనా ప్రయోజనం ఏమిటి ? 1 శైవమత ప్రచారం 2 పాండిత్యప్రకర్ష చాటటం 3 ద్విపద రచన ప్రచారం చేయటం 4 ధనార్జన

21 పాల్కురికి సోమన ప్రధమకృతి ఏది ? 1 వృషాధిప శతకం 2 చెన్నమల్లు సీసములు 3 చతుర్వేదసారం 4 చెన్నమల్లు సీసములు

22 పాల్కురికి సోమన కృతులు మొత్తం ఎన్ని ? 1 30 2 20 3 35 4 27

23 సంఖ్యా నియమం, మకుట నియమం కలిగిన మిదటి శతకమేది ?

1 సర్వేశ్వర శతకం 2 బసవలింగ శతకం 3 వృషాధిప శతకం 4 సుమతీ శతకం 

24 రంగనాధ రామాయణంలో ఏ ఛందస్సులో ఉంది ?

1 వృత్తాలు 2 సీసపద్యాలు 3 ద్విపదలు 4 ఆటవెలది 

25 తిక్కన తొలి రచన ఏది ?

1 భారతము 2 కృష్ణశతకం 3 నిర్వచనోత్తర రామాయణము 4 విజయసేనం 

26 తిక్కన తండ్రిపేరు ?

1 కొమ్మన 2 రామయామాత్యుడు 3 ఖడ్గతిక్కన 4 మారన

27 భారతాన్ని తిక్కన ఎవరికి అంకితమిచ్చాడు ?

1 మనుమసిద్ధికి 2 మంత్రిభాస్కరునికి 3 హరిహరనాధునికి 4 ఈశ్వరునుకి

28 తెలుగు సాహిత్యంలో ఉభయకవిమిత్రుడెవరు ?

1 నన్నయ 2 నాచన సోమన 3 తిక్కన 4 పోతన

29 "భారతాన్ని ' తిక్కన ఏమని పేర్కొన్నాడు ?

1 అనువాదకావ్యం 2 తెలుగు భారతం 3 భాషాంతరీకరణ కృషి 4 ప్రబంధ మండలి

30 అమలోదాత్త మనీష నేనుభయ కావ్యప్రౌఢిపాటించు ' అని తనను గురించి చెప్పుకొన్న కవి ఎవరు ?

1 నన్నయ 2 నన్నెచోడుడు 3 శ్రీనాధుడు 4 తిక్కన 

31 గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ ' - ఏ కవి రాసిన పద్యపాదం ?

1 మల్లికార్జున పండితారాధ్యుడు 2 పాల్కురికి సోమన 3 నన్నయ 4 అధర్వణుడు

32 ఎర్రన ఏ రాజు ఆస్థానకవి ?

1 రాజరాజనరేంద్రుడు 2 ప్రోలయవేమారెడ్డి 3 కాటయ వేమారెడ్డి 4 ప్రౌఢ దేవరాయలు 

33 హరివంశము రచించినదెవరు ?

1 ఎఱ్ఱన 2 నాచన సోమన 3 వేములవడభీమకవి 4 శ్రీనాధుడు

34 నవీనగుణసనాధుడనే బిరుదు ఉన్న కవి ఎవరు ?

1 శ్రీనాధుడు 2 పోతన 3 జక్కన 4 నాచన సోమన 

35 శ్రీనాధుని తొలికావ్యంగా దేన్ని చెప్తారు ?

1 మరుత్తరాట్చరిత్ర 2 పల్నాటివీరచరిత్ర 3 కాశీఖండము 4 భీమఖండము 

36 తెలుగులో మొట్టమొదటి వీరగాధాకావ్యం ఏది ?

1 భారతము 2 పల్నాటివీరచరిత్ర 3 భీమఖండము 4 విజయవిలాసము

37 అయః పిండంగా భావించే శ్రీనాధుని కృతి ఏది ?

1 భీమఖండము 2 కాశీఖండము 3 పండితారాధ్య చరిత్ర 4 హరవిలాసము 

38 శృంగార నైషధములో నలదమయంతుల మధ్య దూత ఎవరు ?

1 చెలికత్తె 2 స్నేహితుడు 3 హంస 4 చిలుక 

39 చిరుతొండనంబికధ శ్రీనాధుని కావ్యాలలో దేనికి ఉంది ?

1 కాశీఖండము 2 పల్నాటివీరచరిత్ర 3 హరవిలాసము 4 భీమఖండము 

40 సిరియాళుని కధ దేంట్లో ఉంది ?

1 బసవపురాణము 2 పండితారాధ్య చరిత్ర 3 శృంగారనైషధము 4 భీమఖండము 



జవాబులు: 1. (3) నన్నయపూర్వయుగం 2. (3) శాసనాలు 3. (1) బృహత్కధ 4. (4) 700 5. (3) నాగబు 6. (2) నన్నెచోడుడు 7. (3) చంపూకావ్యం 8. (1) పంచమవేదం 9. (3) నారాయణాభట్టు 10. (3) ఆధ్రశబ్ద చింతామణి 11. (1) ప్రసన్నకధాకలితార్ధయుక్తి 12. (4) శ్రీవాణీ గిరిజాశ్చిరాయ 13 (1) పావులూరి మల్లన 14 (1) శివకవియుగం 15. (3) శైవకవిత్రయం 16. (4) నన్నెచోడుడు 17. (3) నన్నెచోడుడు 18. (1) నన్నెచోడుడు 19. (2) నన్నెచోడుడు 20. (1) శైవమతప్రచారం 21. (4) చెన్నమల్లు సీసములు 22. (1) 30 23. (1) సర్వేశ్వర శతకం 24. (3) ద్విపదలు 25. (3) నిర్వచనోత్తర రామాయణము 26. (1) కొమ్మన 27. (3) హరిహరనాధునికి 28. (3) తిక్కన 29. (4) ప్రబంధమండలి 30. (4) తిక్కన 31. (3) నన్నయ 32. (2) ప్రోలయవేమారెడ్డి 33. (1) ఎర్రన 34.(4) నాచన సోమన 35. (1) మరుత్తరాట్చరిత్ర 36. (2) పల్నాటివీరచరిత్ర 37. (2) కాశీఖండము 38. (3) హంస 39. (3) హరవిలాసము 40. (1) [[బసవ పురాణం }