సంకీర్తన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
== కథ ==
ఓ పల్లెటూళ్ళో జాలరి కులానికి చెందిన కాశి (అక్కినేని నాగార్జున) అజ్ఞాత కవి, గాయకుడు. కాశిలోని ప్రతిభ పెద్దగా ఎవరకీ తెలియదు. తల్లి (డబ్బింగ్ జానకి) జాలరిగా పనిచేస్తూంటుంది, కాశికి ఉద్యోగం ఉండదు, ఎప్పుడూ ప్రకృతిలో విహరిస్తూ తన కవితా గానం చేస్తూ తిరుగుతుంటాడు. అతనికి ముగ్గురు చిన్న పిల్లలు, గోదారి (రాళ్ళపల్లి) అనే అతను మంచి స్నేహితులు.
 
పెద్ద కులానికి చెందిన కీర్తన (రమ్యకృష్ణ)ని నిజానికి పిల్లలు లేని వాసుదేవ మూర్తి (జె.వి.సోమయాజులు) గుడిమెట్లపై దొరికితే తెచ్చుకుని పెంచుకుంటూంటాడు. కానీ కీర్తన తమ సొంత కూతురు కాకపోవడంతో వాసుదేవమూర్తి భార్యకు ఆమెపై అక్కసు, వ్యతిరేకత ఉంటుంది. ఇదిలావుండగా ఆ ఊరి జనం దేవతలా భావించి కొలుస్తూ ఉంటారు. ఆమె అడుగుపెట్టాకే తమ కడగళ్ళు పోయాయని, గ్రామం సుభిక్షమైందని నమ్ముతూంటారు.
"https://te.wikipedia.org/wiki/సంకీర్తన_(సినిమా)" నుండి వెలికితీశారు