ఉమర్ ఆలీషా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 92:
ఈ రకమైన ధార్మిక తత్వ చింతన కారణంగానే ఈనాటికి పిఠాపురంలోని '' శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం '' ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా పూర్వీకులు స్థాపించిన పీఠం ప్రధానంగా ధార్మిక విషయలకు పరిమితం కావడం వలన ఉమర్‌ అలీషాలోని కవికి సాహిత్య చరిత్రలో, ప్రజలలో లభించాల్సినంత ప్రాచుర్యం లభించలేదు. విద్యాధ్యాత్మిక పీఠంగాని, ఆయన తరువాత వచ్చిన పీఠాధిపతులు గాని ఆ దిశగా తగిన స్థాయిలో కృషి సల్పలేదు. ఉమర్‌ అలీషా తెలుగు సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ అత్యంత ప్రతిభను చూసేందుకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా మునిమనుమడు, నవమ పీఠాధిపతి, యువకుడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా ఈ లోటును గ్రహించి ' డాక్టర్‌ ఉమర్‌ అలీషా సాహితీ సమితి ' , ' శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి ' అను సంస్థలను ఏర్పాటుచేసి ఆనాడు ఉమర్‌ అలీషా పోషించిన బహుముఖ పాత్రలను సమాజం అవసరాలను గమనిస్తూ, ప్రజల ఆకాంక్షలను విస్మరించకుండా, సమాజహితం కోరుతూ, మహాకవి ఉమర్‌ అలీషా బాటన వినూత్న కార్యక్రమాలకు రూపొందించి నిర్వహిస్తున్నారు.
==రచనలు==
'' మహా కవిగా, విద్యా వేత్తగా, రాజనీతి జ్ఞుడిగా, జాతీయవాదిగా, బహుభాషా విశారదుడుగా, బహుముఖ ప్రజ్ఞాదురీణుడుగా, దయార్ధ్ర హృదయుడుగా, ఆధ్యాత్మక విద్యా పీఠాధిపతిగా సమత-మమత-మానవతలకు ప్రతీక...'' గా వెలుగొందిన డాక్టర్‌ ఉమర్‌ అలీషా తన జీవితకాలంలో పలు గ్రంథాలను రాశారు. అందులో 1.అనసూయాదేవి, 2.కళ, 3.చంద్రగుప్త 4.ప్రహ్లాద లేక దానవవధ, 5. మణిమాల, 6,మహాభారత కౌరవరంగము, 7.విచిత్ర బిల్హణీయము, 8.విషాద సౌందర్యము అను నాటకాలున్నాయి.1. నరకుని కాంతాపహరణ, 2. బాగ్దాదు మధువీధి, 3. విశ్వామిత్ర (అసంపూర్ణము) అను ఏకాంకిలు, 1.వరాన్వేషన్‌ అను ప్రహసనం, 1. ఖండకావ్యములు, 2.తత్త్వ సందేశము, 3.బర్హిణి దేవి, 4. బ్రహ్మ విద్యావిలాసము, 5.మహమ్మద్‌ రసూల్‌ వారి చరిత్ర, 6.సూఫీ వేదాంత దర్శనము, 7. స్వర్గమాత, 8.హాలీలాంటి పద్య గ్రంథాలు రచించారు. 1.ఈశ్వరుడు, 2. మహమ్మద్‌ వారి చరిత్ర, 3. సాధన పథము అను గద్యములు, 1.తారామతి, 2. పద్మావతి, 3. శాంత అనునవలలు, 1. ప్రభాత కథావళి అను కథల సంగ్రహము 1. ఉమర్‌ఖయ్యమ్‌, 2.ఖురాన్‌ - ఏ - షరీఫ్‌, 3.గులిస్తా అను అనువాదాలు 1. ఇలాజుల్‌ గుర్‌భా అను వైద్య గ్రంథాలను ఆయన సృజించారు. ఈ గ్రంథాలలో అన్ని ప్రస్తుతం లభ్యం కావటంలేదు.
===నాటకాలు==
# అనసూయాదేవి,
# కళ,
# చంద్రగుప్త
# ప్రహ్లాద లేక దానవవధ,
# మణిమాల,
# మహాభారత కౌరవరంగము,
# విచిత్ర బిల్హణీయము,
# విషాద సౌందర్యము
===ఏకాంకిలు===
# నరకుని కాంతాపహరణ,
# బాగ్దాదు మధువీధి,
# విశ్వామిత్ర (అసంపూర్ణము)
===ప్రహసనం===
* వరాన్వేషన్‌ అను ప్రహసనం
===పధ్య గ్రంథములు===
# ఖండకావ్యములు,
# తత్త్వ సందేశము,
# బర్హిణి దేవి,
# బ్రహ్మ విద్యావిలాసము,
# మహమ్మద్‌ రసూల్‌ వారి చరిత్ర,
# సూఫీ వేదాంత దర్శనము,
# స్వర్గమాత,
# హాలీలాంటి
===గధ్యములు===
# ఈశ్వరుడు,
# మహమ్మద్‌ వారి చరిత్ర,
# సాధన పథము
===నవలలు===
# తారామతి,
# పద్మావతి,
# శాంత అనునవలలు
===కధా సంగ్రహం===
# ప్రభాత కథావళి అను కథల సంగ్రహము
===అనువాదాలు===
# ఉమర్‌ఖయ్యమ్‌,
# ఖురాన్‌ - ఏ - షరీఫ్‌,
# గులిస్తా
===వైద్య గ్రంథాలు===
# ఇలాజుల్‌ గుర్‌భా
 
ఈ గ్రంథాలలో అన్ని ప్రస్తుతం లభ్యం కావటంలేదు.
 
ఈ రచనలే కాకుండా వందకు పైగా వ్యాసాలు గల సంపుటి, హిందీ ఉపన్యాసాల సంగ్రహం, ఆం గ్ల ఉపవ్యాసాల సంగ్రహం వేర్వేరుగా ఉన్నాయని, ఇవికాక మదాల, మనద్ధాస్‌ అలీ, ఉరుమత్తూరు చక్రవర్తి, శ్రీ మద్వాల్మీకి రామాయణము కూడా ఆయన రచించినట్టు డాక్టర్‌ మహమ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ యస్‌.యం ఇక్బాల్‌ లాంటి పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆయన సృష్టించిన సాహిత్య సంపదలో 34 గ్రంథాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉండగా 23 రచనలు ముద్రితమయ్యాయి. ప్రఖ్యాతి చెందిన ఆయన రచనలు విశ్వ విద్యాలయాల్లోని విద్యార్థుల పాఠ్య గ్రంథాల స్థానాన్ని పొందాయి. ఆనాడు అలీషా రచనల గురించి చర్చించని సాహితీ సభగానీ, ఆయన రచనలేని గ్రంథాలయం గాని ఉండేది కాదట. మాతృభాష తెలుగు కానప్పటికీ, '' తెలుగులో ఛందోబద్ధమైన సాంప్రదాయ కవిత్వం చెప్పి ఆంధ్ర భారతిని ఆరాధించిన తొలి, తుది కవి ఈయనే కావచ్చు,'' నని పండిత ప్రముఖులు ఆయనకు కితాబునిచ్చారు.
Line 100 ⟶ 142:
ఈ విధంగానే ఉమర్‌ అలీషా సాహిత్య-ఆధ్యాత్మిక సంభాషణలు, రచనలను మాత్రమే కాకుండా, ఆయన రాజకీయ అభిప్రాయాలు, స్వాతంత్య్ర సమరయోధునిగా పలు ప్రాంతాలలో ఆయన చేసిన ప్రసంగాలు, సమాజ సంస్కరణలకు ఆయన అనుసరించి విధానాలు, చేసిన సూచనలు ఆయన అభిప్రాయాలు, భారత శాసనసభలో ప్రజా ప్రతినిధిగా పది సంవత్సరాల పాటు పనిచేసినప్పుడు చర్చకు వచ్చిన వివిధాంశాల మీద ఆయన చేసిన ఉపన్యాసాలను సేకరించి ఉమర్‌ అలీషా వ్యక్తిత్వాన్ని, మేథో సంపత్తిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు '' శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథ మండలి '' అను సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ కృషి ఫలించి, డాక్టర్‌ ఉమర్‌ అలీషా రాసిన రచనలన్నీ ప్రజలకు, సాహిత్యాభిలాషులకు, పరిశోధకులకు అందుబాటులోకి వచ్చినట్టుయితే, మహాకవి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని దర్శించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తుంది. చరిత్ర పుటలలో నిక్షిప్తమైయున్న ఆ మేధావి అసమాన ప్రతిభ వెల్లడికాగలదు.
జీవితాంతం వరకు భారత శాసన సభలో ప్రజా ప్రతినిధిగా రాజకీయగా బాధ్యతలను నిర్వహిస్తూ స్వజనుల స్వేచ్ఛా-స్వాతంత్య్రాలు కోరుకుంటున్న స్వాతంత్ర సమరయోధుడుగానూ, ఆధ్యాత్మిక రంగాన శిష్యకోటికి ధార్మిక జ్ఞానబోధ చేయు పీఠాధిపతిగాను, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్తగా, వేదాంతిగా చిరస్మరణీయమైన ఖ్యాతి గడించిన డాక్టర్‌ అలీషా జీవిత పరిసమాప్తి వరకు పర్యటనలు చేసారు. సమకాలీన సాహిత్య సౌరభాలను అఘ్రాణించుటకు, శిష్యపరంపరకు అధ్యాత్మిక మార్గదర్శకం చేయుటకు ప్రతి క్షణాన్ని వినియోగించిన ఆయన అవిశ్రాంతంగా భారతదేశమంతా పర్యటించినా అలసిపోవడం ఎరుగరు. పండిత ప్రముఖులు ఆహ్వానం మేరకు పలు పర్యటనలు చివరి వరకు సాగించారు. మహా మహోపాధ్యాయులు ఉమర్‌ అలీషా ఎక్కడకు వెళ్ళినా తండోపతండాలుగా శిష్యులు ఆయన ఆధ్యాత్మిక బోధలు వినడానికి విచ్చేస్తుంటే, ఆయన సాహితీ ప్రసంగాలను వినడానికి, ఆయనతో సాహిత్య చర్చలు జరిపేందుకు సాహితీ ప్రియులు, పండిత ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా హాజరయ్యేవారు. మౌల్వీ ఉమర్‌ అలీషా రాక కోసం పండితులతో పాటుగా శిష్యులు ఎంతో ఆశగా ఎదురు చూసేవారు.
==అస్తమయం===
1945 జనవరి మాసంలో ఢిల్లీ నుండి స్వస్థలానికి విచ్చేస్తూ, శిష్యుల ఆహ్వానం మేరకు ఆచార్య ఉమర్‌ అలీషా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళారు. అక్కడ కొంతకాలం గడిపాక తిరిగి పిఠాపురం చేరుకో సంకల్పించి, ఆ ప్రయత్నంలో వుండగా [[జనవరి 23వ23]] తేది సాయం సమయం 5 గంటల ప్రాంతంలో మహాకవి కన్నుమూసారు.
 
==ఉమర్ అలీషా వంశీకులు==
"https://te.wikipedia.org/wiki/ఉమర్_ఆలీషా" నుండి వెలికితీశారు