కోన ప్రభాకరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
==క్రీడలు, సినిమాలు==
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల మరియు ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ [[కుస్తీ]] లు పట్టేవాడు. మరియు బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉన్నది. తొలినాళ్ళలో అనేక [[తెలుగు సినిమా]] లను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో [[మంగళసూత్రం]], [[నిర్దోషి]], [[ద్రోహి]] మరియు [[సౌదామిని]].<ref>[http://www.imdb.com/name/nm0464807/ ఐ.ఎమ్.డి.బి.లో కోన ప్రభాకరరావు పేజీ.]</ref>
==శాసనసభ్యునిగా==
బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంత ఊరులో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.
 
==మరణం==
అక్టోబరు20, 1990 న హైదరాబాదులో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/కోన_ప్రభాకరరావు" నుండి వెలికితీశారు