పొట్లూరి సుప్రీత: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చదరంగం క్రీడాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
2012లో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా పాఠశాల స్థాయి చదరంగం పోటీలలో అండర్-11 విభాగంలో పాల్గొని, స్టాండర్ద్స్ లో పసిడి, బ్లిట్జ్ లో రజతపతకం కైవసం చేసుకున్నది. [1]
 
2013లో ఇరాన్ దేశంలో నిర్వహించిన అసియా ర్యాపిడ్ ఛెస్ ఛాంపియన్ షిప్ పోటీలలో, అండర్-12 విభాగంలో పాల్గొని, రజతపతకం సాధించి, దుబాయ్ లో నిర్వహించిన ప్రపంచ ఛెస్ పోటీలలో అండర్-12 విభాగంలో పాల్గొనడానికి అర్హత సాధించి, అ పోటీలలో పాల్గొని, బ్లిట్జ్ లో ప్రథమస్థానానికి టై ఏర్పడి పసిడి పతకంపసిడిపతకం సాధించినది.
 
2014లో తైవాన్ దేశంలో నిర్వహించిన ఆసియా పాఠశాలల చదరంగం పోటీలలో, అండర్-13 విభాగంలో పాల్గొని, స్వర్ణపతకం సాధించడంతో, ప్రపంచ చదరంగ సమాఖ్య ఈమెకు, '''ఉమన్ ఫిడే మాస్టర్ ''' టైటిల్ ను ప్రదానం చేసినది. 2014లోనే ఈమె తన పదమూడు సంవత్సరాల వయసులో, పూనే నగరంలో నిర్వహించిన ప్రపంచ జూనియర్ ప్రపంచ చదరంగం పోటీలలో, అండర్- 20 విభాగంలో తలపడి, అత్యధికంగా 210 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి, అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కినది.
పంక్తి 17:
2016, జనవరి-3 నుండి 7 వరకు, మహారాష్ట్రలోని నాగపూరు నగరంలో నిర్వహించిన అఖిల భారత పాఠశాలల చదరంగం పోటీలలో ఈమె బాలికల అండర్-17 విభాగంలో పాల్గొని, ఏడు రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించి ప్రథమస్థానంలో నిలిచినది. ఈ విజయం సాధించిన ఈమె, 2016,జులైలో ఇరాన్ దేశంలో నిర్వహించు ఆసియా స్కూల్ గేంస్ పోటీలలోనూ, 2016,నవంబరు-2016 లో నిర్వహించు ప్రపంచ స్కూల్ గేంస్ పోటీలలోనూ పాల్గొనడానికి అర్హత సాధించినది. [2]
 
2016,ఏప్రిల్-9న మంగోలియా దేశంలో నిర్వహించిన ఆసియా యూత్ బ్లిట్జ్ ఛెస్ ఛాంపియన్ షిప్పు పోటీలలో, ఈమె పాల్గొని కాంస్యపతకం సాధించినది. ఇది ఆమె చదరంగ క్రీడాప్రస్థానంలో సప్తమ అంతర్జాతీయ పతకం. [3]
 
==మూలాలు==
[1] ఈనాడు కృష్ణా; 2013,జనవరి-23; 14వపేజీ.
[2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-18; 13వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2016,ఏప్రిల్-13; 10వపేజీ.
 
[[వర్గం:చదరంగం క్రీడాకారులు]]
"https://te.wikipedia.org/wiki/పొట్లూరి_సుప్రీత" నుండి వెలికితీశారు