మేకా రంగయ్య అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
'''ఎం.ఆర్. అప్పారావు''' గా ప్రసిద్ధిచెందిన [[నూజివీడు]] జమిందారీ కుటుంబానికి చెందిన వీరి పూర్తి పేరు '''మేకా రంగయ్య అప్పారావు''' ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి మరియు శాసనసభ్యుడు.
 
ఈయన [[కృష్ణా జిల్లా]] నూజివీడు గ్రామంలో [[మార్చి 21]], [[1915]] లో రాజా [[మేకా వెంకటాద్రి అప్పారావు]] మరియు రామయ్యమ్మ దంపతులకు జన్మించారు. ఇతని విద్యాభ్యాసం [[నూజివీడు]], [[మచిలీపట్నం]] [[నోబుల్ కళాశాల]], [[మద్రాసు క్రైస్తవ కళాశాల]], [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] లలో సాగింది.
 
ఈయన [[నూజివీడు శాసనసభ నియోజకవర్గం]] నుండి వరుసగా 1952, 1957, 1962, 1967 మరియు 1972లలో జరిగిన ఎన్నికలలో [[కాంగ్రెసు]] పార్టీ అభ్యర్ధిగా గెలుపొందారు. [[నీలం సంజీవరెడ్డి]], [[కాసు బ్రహ్మానందరెడ్డి]] మంత్రివర్గాలలో కొంతకాలం సాంస్కృతిక, అబ్కారీ శాఖామాత్యులుగా సేవలందించారు. ఆ తరువాత [[రాజ్యసభ]] కు ఎన్నికయ్యాడు. అప్పారావు, [[బెజవాడ గోపాలరెడ్డి]], [[పి.వి.జి.రాజు]] ల సమకాలీకుడు. తొలిసారిగా 1952లో సి.పి.ఐ అభ్యర్ధి [[దాసరి నాగభూషణరావునునాగభూషణరావు]]ను ఓడించి, శాసనసభకు ఎన్నికైన అప్పారావు, 1989లో ఒక్క సారి తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీచేసి, కాంగ్రేస్ అభ్యర్ధి పాలడుగు వెంకట్రావు చేతిలో ఓడిపోయిన తరుణం తప్ప మరెన్నడూ ఎన్నికలలో ఓటమి చవిచూడలేదు.
 
అప్పారావు టెన్నిసు ఆటగాడు. ఈయన తన తండ్రి [[తెలుగు]]లోకి అనువదించిన గీతా గోవిందాన్ని ఆంగ్లంలోకి మార్చారు. [[ఉమర్ ఖయ్యాం]] రుబాయిత్ లను గేయ రూపంలో రాశారు. చంద్రగుప్త, యాంటిగని నాటకాలు రాశారు. అప్పారావు 1974 నుండి 1980 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాడు.<ref>http://www.andhrauniversity.info/sucvclist.html</ref> నూజివీడులో ధర్మ అప్పారావు కళాశాలను ప్రారంభించాడు.<ref>[http://www.hinduonnet.com/thehindu/2003/02/01/stories/2003020103740400.htm Ex-Minister Apparao dead ] - The Hindu</ref>